Sunday, February 26, 2023

ఆజాద్ ప్రతిజ్ఞ @వర్ధంతి 27.02.1931

త్యాగమూర్తులను స్మరించుకుందాం- భావితరాలకు స్ఫూర్తినందిద్దాం      
         ♧ఆజాద్ ☆ప్రతిజ్ఞ 
హిందుస్తానీ పోలీసు బంధువుల్లారా! మీరు ఊరికే నా మీద ఎందుకు గుళ్ళు కురిపిస్తున్నారు. నేను మీ అందరి స్వాతంత్ర్యం కోసమే పోరాడుతున్నాను. కొంచం ఆలోచించండి" అన్న ఆజాద్ విజ్ఞప్తి పోలీసుల తలకెక్కలేదు. ఆజాద్ ప్రళయకాల రుద్రుడైనాడు.. అతని సింహనాదానికి పార్కులోని బండలు రోడ్డుపక్కనున్న భవంతులు ప్రతిధ్వనిస్తున్నాయి. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు ఆజాద్. ఒంటరిగా వందమంది శత్రువులతో ముప్పైరెండు నిమిషాలు సింహపరాక్రమంతో పోరాడాడు. విప్లవ చరిత్రకే  మకుట సమానమైన పోరాటమది. భారత యువజనుల సాహస పరాక్రమాలకు సముజ్వలమైన ఉదహారణ అది. పార్కు చుట్టూ గుమికూడిన వేలకొద్ది జనం ఆ సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు...
ఆజాద్ వద్దనున్న గుళ్ళన్నీ అయిపోవచ్చాయి. ఆ స్థితిలో కూడా అతని మనస్సు చురుకుగా పనిచేస్తుంది. అప్పటిదాకా మొత్తం ఎన్నిగుళ్ళు ఖర్చయినాయో అతని మనసులో ఖచ్చితమైన లెక్కవుంది సంస్థ డబ్బు లాగానే. తన వద్ద చివరిగుండు మిగిలింది. పదిసంవత్సరాల క్రిందట వారణాసిలో పోలీసులు తనను బెత్తంతో కొడుతున్నప్పుడు చంద్రశేఖర్ తన పేరు "ఆజాద్" అని చెప్పుకున్నాడు.☆తను ప్రాణాలతో ఉండగా ఏ పోలీసు వాడూ తనమీద చేయవేయలేడని తన విప్లవ సహచరులతో మీసం త్రిప్పిచెప్పాడు..ఆ ప్రతిజ్ఞ తన మనస్సులో మెదిలింది.
ఆజాద్ మనస్సులో ఒక నిశ్చయం చేసుకున్నాడు. ఆటోమాటిక్ పిస్తోలు చటుక్కున తలదగ్గరికెళ్ళింది డాం అని ప్రేలింది. అతని చివరి గుండు అతని తలను చేదించుమొని బయటికెగిరింది. అప్పటికి ఆ సర్వతంత్ర స్వతంత్ర వీరుడి వయస్సు 24 సంవత్సరాలే....
అవును నిజమే మన ఆజాద్ 1931, ఫిబ్రవరి 27న దేశంకోసం అమరుడయ్యాడు... అది నేటి దినం... ఆ త్యాగాల ప్రకంపనలు నేటి యువతకు చేరాలని ఆశిద్దాం.....  దేశంకోసం పనిచేయడానికి...
జైహింద్..భారత్ మాతాకి జై.

Wednesday, February 22, 2023

శశికళ: కలం పట్టాల్సిన చేతులతో హలం

Inspirational personality Smt.SHASHIKALA 
(2 times State "Best Agriculturist" Award Winner)
Interaction with LAKSHYAM CAMP students.
ప్రేరణ: కలం ✍🏻 పట్టాల్సిన చేతులు హలాన్ని⚙ పట్టి  ప్రేరణగా శశికళ గారి జీవితం.                               ఉన్నత చదువులు  చదివి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్న  తన చిన్ననాటి కోరికను విది వెక్కిరించి....    భర్త అకాల మరణానికి తోడు  5లక్షల అప్పుతో కుటుంబ బాధ్యతలు అప్పగిస్తే  ....  కష్ట కాలం అని భావించి ఎటూ తోచని స్థితిలో చంటి బిడ్డతో సహా  ఆత్మహత్య చేసుకోవాలనుకున్న  స్థితినుండి..                           ఉన్నత చదువులు(M.A, B.Ed) పూర్తీ చేసి,  తనే ఒక ప్రేరణా శక్తిగా👍🏼 ఎదిగి, ఎదిగే పిల్లలకు @"👩‍🎓కళాశాల" స్థాయిలో తన జీవితమే ఒక పాఠంగా📖 ఉండేలా  ఎదిగిన శశికళ గారు అన్ని  తరాలకు ఆదర్శం.     భర్త పేరును  నిలబెట్టాలని కలం పట్టిన చేతులతోనే హలాన్ని  సాగిస్తూ  ,తనకున్న 16 ఎకరాల పొలంలో , 10 సం.రాల నిరంతర శ్రమతో అనేక ప్రయోగాలు చేసి  అతి తక్కువ ఖర్చుతో సేంద్రీయ వ్యవసాయం ద్వారా అధిక ఉత్పత్తులను రాబట్టి రాష్ట్రస్థాయిలో 2 సార్లు, జాతీయ స్థాయిలో ఒక సారి "👩‍🎓ఉత్తమ రైతు" అవార్డులను స్వీకరించి , పది మందికి అన్నం పెట్టే రైతులు పస్తులుండొద్దు, ఆత్మహత్యలు అసలే వద్దంటూ రైతన్నలకు  ప్రేరణాత్మక పాఠాలు చెప్తున్న మీ జీవితమే  సమాజానికి ఒక  స్పూర్తి.  20నిమిషాల  మీ మాటలు "లక్ష్యం శిబిరం" విద్యార్థులకు ఎంతో ప్రేరణానిచ్చాయి. కొంతమందికి వ్యవసాయం చేయాలన్న ఆలోచననూ కలిగించాయి.  మా శిబిరం తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

Tuesday, February 21, 2023

అమర వీరుల ఉత్తరాలు

"రాంప్రసాద్ బిస్మిల్" ను డిసెంబర్ 19 సాయంకాలం ఉరి తీసారు(1927 @30 yrs age). 
డిసెంబర్ 18న ఆయన తల్లి తన కొడుకును ఆఖరు సారిగా చూసుకోవడానికి వెళ్ళింది. 
తల్లిని చూసి ఆయన కళ్ళలో నీళ్ళు నిండాయి.   'తల్లి   హరిశ్చంద్రుణ్ణి, దధీచిని గుర్తుకు తెచ్చి విచారానికి, పశ్చాత్తాపానికి అతీతంగా ఉండమని సలహా ఇచ్చింది' (కన్న కొడుకుని తెల్లారితే ఉరితీస్తారు అని తెలిసి చివరి క్షణంలో ఆ తల్లి పలికిన ధైర్యవచనాలకు వందనం).
దానికి మన బిస్మిల్ గారు....""" నేను మృత్యువుకు భయపడను.విచారం, పశ్చాతాపం  నాలో లేవు. ఎందుకంటే నేను ఏ పాపం చేయలేదు కనుక.... (భారతమాత బానిస సంకెళ్ళు తెంచడానికి ఫోరాటం తప్పా...).
కాని ## అగ్నికి సమీపంలో ఉన్నప్పుడు నెయ్యి కరగడం తప్పదు. నీకు, నాకు మద్య ఉన్న సంబందమే అలాంటిది".చూడగానే కళ్ళలో నీళ్ళు నిండాయి (వందనం సార్).
ఉరికంబమెక్కిన బిస్మిల్ ఆఖరు మాటగా..# బ్రిటిష్ సామ్రాజ్యం పతనం కావాలని నా కోరిక".
------------------------------'----------
~దేశంకోసం నవ్వుతూ ...... గావింపబడ్డ మీ తల్లీ కొడుకుల ప్రేరణకు సలాం.
(వీలైతే జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా - అమర వీరుల ఉత్తరాలు..
దేశంకోసం పనిచేయాలనుకున్న వారికి ప్రేరణనిస్తాయి)

శివాజీ జయంతి -2023


ప్రతీ సంవత్సరo ప్రేమతో తన జయంతి ఉత్సవానికి పిలుసుకుంటున్న #ఛత్రపతిశివాజీ.
ఈ సారి రెండు కార్యక్రమాలు.
@
1. నారాయణ గూడా, భాగ్యనగర్.

 2.మంగళంపల్లి గ్రామం, #ఆమనగళ్లు మండలం, #రంగారెడ్డిజిల్లా..
అంతా యువకుల బృందoతో #శివాజీదళం పేరున  ప్రతీ సంవత్సరం #శోభాయాత్ర నిర్వహించినా, మొదటిసారి సభా కార్యక్రమం నిర్వహించారట. మంచి సమన్వయoతో ఊరి పoడగలా #శివాజీజయంతి నిర్వహించారు.
ఎవరు ఆ శివాజీ, ఎందుకు ఆయన జయంతి పండగలా చేస్తున్నారు/చేయాలి అనే విషయ ప్రస్తావన చేసే అవకాశo మనకు దొరికింది. రాత్రి 10 అయినా మహిళలు, పిల్లలు, యువకులు అంతా పూర్తి కార్యక్రమంలో ఉండడం విశేషం.
చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఆ ఉత్సవానికి మంచి ఉత్సాహన్ని పoచాయి.
ఆ చిన్నారులను ఈ ఉత్సవంలో పాల్గొనేలా ప్రోత్సాహంచి, వారికి బహుమతులు ఇవ్వడం నిర్వాహకుల గొప్ప నిర్ణయం. మరోసారి #శివాజీదళం సభ్యులకు శుభాకాంక్షలు💐, శుభాభినందనలు.
▪️▪️▪️▪️▪️▪️▪️▪️
అతని కూటనీతి, అతని లొంగుబాటు తనం, అతని వినమ్రతలు, అతని సాహసం, అతని దృఢనిశ్చయం, అతని సదాశయాలతో పోల్చవచ్చు..
అతని కార్యపద్దతిలోని దూరదృష్టి కారణంగా బానిస హిందువులకు సార్వబౌమత్వ రాజ్యవైభవం సంప్రాప్తమయింది.
:~ శివాజీ గురించి ప్రముఖ ఆoగ్ల రచయిత *గ్రాoట్ డఫ్*
◾◾◾◾◾◾◾◾◾◾◾◾🫢

మొదటి కార్యక్రమం @ నారాయణ గూడా, భాగ్యనగర్

Friday, February 17, 2023

శివాజీ వ్యక్తిత్వం -ఔరంగజేబ్ స్తుతి

శివాజీ కథలు చెపితే వినేవాన్ని,
చాలా సార్లు విన్నాం.
కానీ మనమే ఆ కథ చెప్పాలి అన్నప్పుడు? హిందూవాహిని వారు
నాపై ఆ భాద్యత పెట్టినపుడు గత యేడాది కొంత వరకు శివాజీ కథలు చదివి చెప్పా.. ఈ సారి మల్లా చెప్పాలి అన్నప్పుడు ఎందుకో మనసు అంగీకరిoచలే..
పూర్తిగా అధ్యయనం లేకుండా చెప్పడం కొంత కష్టం అనిపించింది..
చెప్పినా అది బట్టీ పట్టి చెప్పినట్టు ఉంటుంది. అందుకే గత వారం నుండి నన్ను శివాజీ ఆవహించినట్టే ఓ నాలుగు పుస్తకాలు చదివా, చాలా వీడియోలు విన్నా..
నేను ఇంత ఇష్టపడి/కష్టపడి నా చదువు చదివినా 5ఏoడ్లలో పూర్తి చేసిన నా LLB మూడేళ్లలో చేసేటోన్ని😀..
శివాజీ సాహిత్యం చదివాక ఆయనపై అభిమానం వేయి రేట్లు పెరిగింది.
నాకేoది ఎవరికైనా అంతే..
ఇదో ఆయన ప్రధాన శత్రువు ఔరoగజేబ్ కూడా అంతే.. ఆయన అన్న మాటలు రచయిత కలం ✍️ద్వారా..
◾◾◾◾◾◾◾◾◾◾◾◾
*కొంచం పొడవైన వ్యాసం*.
అయినా మొత్తం చదవాలి.

ఎందుకంటే మన కరడుగట్టిన శత్రువు మన వ్యక్తిత్వాన్ని, మన కార్యాన్ని, మనలోని మంచిని  తన నోటితో స్తుతిస్తున్నప్పుడు మనకు కలిగే ఆనందం వెలకట్టలేనిది..
అదే ఇది..
ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఔరoగజేబ్ మాటలు..
పరకాయ ప్రవేశం చేసి అక్షరాల కూర్పు చేసి మనకు అందిoచిన ఆ రచయితకు వందనాలు🙏🏼🙏🏼.

ఔరంగజేబ్ మాటల్లో..

*మొత్తం హిందూస్తాన్ ను మొఘల్ సామ్రాoజ్యగా మార్చాలని కలలు గన్న పాదుషా తన కళ్ళతో చూస్తున్నదేమిటి?*..

*మన కళ్ళ ముందే శివాజీ తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు*.
*లక్షల మంది సైనికులున్న మన సేనాధిపతులను ఓడించి, పారిపోయేలా చేశాడు*. ఎక్కడికి పోయింది మన రాజభక్తి ఏమైపోయింది మన విశ్వాసం?*.*.

ఇదిగో నా మేనమామ నవాబే ఆజం షాయిస్తాఖాన్! ఏడు వందల మంది అశ్వకులు, యాభైవేల మంది పదాతిదళం, యాభై ఫిరంగులు, యుద్దానికి సింద్దoగా  ఉన్న కవచదారి గజాలు.... ఇవన్నీ ఆయనకు ఇచ్చాం.. కానీ యువరాజా *శివాజీ ఆయనుండే లాల్ మహాల్ పై దాడి చేసి, చిత్తు చిత్తుగా ఓడిoచాడు.   ఇంతకన్నా సిగ్గుపడాల్సిoదేముంది? మూడు చేతి వేళ్ళు పోయినా, పంచప్రాణాలతో బయటపడ్డందుకు ఆయన అదృష్టాన్ని అభినందిoచుకోవాలి.*😀😀..

ఇదిగో మన సైనాని జస్వంత్ సింగ్.. అదిగో మన గుజరాత్ పాలకుడు, అందగాడు జనాయత్ ఖాన్ బహదూర్. శివాజీ సూరత్ లో అడుగు పెట్టగానే మన వీరుడు తోక ముడిచి పారిపోయాడు. నా పథకాలన్నిటినీ పౌలద్ ఖాన్ పనికిరాకుండా చేసేశాడు.
ఇక ఇదిగో ఇతనే కర్తలబ్ ఖాన్... సర్వ సాయుధ సంపన్నమైన సైన్యం ఉన్నా యుద్దభూమి నుండి తోకముడిచాడు.

ఇదిగో రసూల్ భేగ్ రోజ్ భానీ, మీరే అతిశ్ తర్భిసాత్ ఖాన్, ఖాన్ జహాన్ బహదూర్, ఖాన్ కోకలతాశ్, భావసింగ్ హాడా, రణ మస్త్ ఖాన్, కేసరీ సింగ్, సయ్యద్ మునవ్వర్ ఖాన్, పఠాన్, మొగల్, తుర్క్, ఇరానీ, భాగ్దాదీ, ఆఫ్రికెన్, అరబ్, కోసక్ యూరో పియ వీరులు, ధీరులు... వీళ్ళందరినీ శివాజీ ఓడించాడు.
సలహేర్ యుద్ధంలో మన లక్షమంది సైన్యం పలాయనం చిత్తగిoచిoది. మన గర్వం ఖర్వమైపోయింది. ఎందుకిలా జరిగింది?. శివాజీని విజయం ఎలా వరించిoది.. శివాజీకి మనలాగా భారీ సైన్యం లేదు. మన వద్దనున్న శతఘనులు లేవు, ఏనుగులు-గుర్రాలు లేవు. సంపదలు అసలే లేవు. శివాజీ ఎలా గెస్తున్నాడన్నది మీకూ అర్థం కాదు. మీ వీరులందరు మద్యం, మగువ,నృత్యం, గీతo, ఆట, వేటల మోజులో పడిపోయారు. మీరు శివాజిని ఏనాడూ అంచనా వేయలేకపోయారు.

ఈ *శివాజీ బలమైన కోటలు కట్టాడు. సైన్యాన్ని నిర్మిoచాడు. వనరులు సమకూర్చుకున్నాడు. కొత్త  యుద్ధ ప్రక్రియనే ప్రారంభిoచాడు. అన్నిటినీ మించి అజేయులు, శీలవంతులైన వీరవరులను తయారు చేశాడు*.

 *శివాజీ సైన్యాదిపతులకు లక్షల రూపాయల జాగీర్లు ఆశ చూపిoచాo. కానీ వారు వాటిపై ఉమ్మేశారు. మనం అందరినీ లొంగదీసుకున్నాం, అందరినీ కోనేయగలిగాం. కానీ ఆత్మగౌరవ సంపన్నులైన శివాజీ సేవకులు మాత్రం అమ్ముడు పోవడం లేదు*. శివాజీ మాయోపాయం చేస్తాడు. అతను మోసకారి, అతను వేగవంతుడు, అహoకారి, మొండివాడు, ప్రమాదకారి అయన శత్రువు.   కానీ *ఆయన వ్యక్తిత్వం పాల కన్నా స్వచ్చo..నిర్మలం.. ఆయన సూర్యుడిలా వెలుగుతాడు...
శివాజీ తన శత్రువు మతాన్ని, మసీదును, మహిళను, మతాచారాలను, మత గురువులను కూడా గౌరవిస్తాడు. అందుకే మసీదు మినారులా ఆయన కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి.
 *శివాజీ లాంటి శత్రువు ఉన్నందుకు మనం అదృష్టవంతులo అనడంలో ఎలాంటి సందేహం లేదు*..
అయితే ఏది ఏమైనా అతను మన శత్రువు అతడిని మనం అంతమొoదిoచాలి.

శివాజీ వ్యక్తిత్వం, ఆయన ధర్మనిష్ఠ స్ఫూర్తిగా మనం కొంతైనా ఆయన ఆశయం సాధనలో భాగస్తులం కావలి.

వాగ్యా @శివాజీ పెంపుడు కుక్క

సేకరణ:
' వాగ్యా ' .. దేశం కోసం హిందూ ధర్మం కోసం పోరాడిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ నీడ..శివాజీ మహారాజే తో పాటే నీడ కూడా మాయం అయింది కానీ రాయగఢ్ కోటలో తీక్షణంగా చూస్తూ కోటకు ఇంకా రక్షణగానే ఉంది..

హిందూ సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ పెంపుడు కుక్క పేరు "వాగ్య". జీవితాంతం విదేశీ ఆక్రమణకారులతో శివాజీ జరిపిన అనేక యుద్ధాలలో వెన్నంటి ఉండి ఎల్లవేళలా సహకరిస్తూ గడిపింది..

తన యజమాని శివాజీ యొక్క వాత్సల్యాన్ని వీడలేక మరణాంతరం కాలుతున్న అతని చితిపై దూకి తనువు చాలించింది..

వాగ్యా యొక్క విశ్వాసానికి మరియు మన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా రాయగడ్ కోట పైన స్మారక స్తూపం కట్టించారు.

: దేశం కోసం, హిందూ ధర్మం కోసం మరణించిన మనుషులకే కాదు ప్రాణాలర్పించిన జంతువులకు సైతం గౌరవాన్ని ఇచ్చి సత్కరిస్తుంది, అభిమానంతో స్మారకాలు నిర్మించి గుర్తుంచుకుంటుంది మనదేశం..

Thursday, February 16, 2023

కర్తవ్య బోధ

ప్రపంచమంతా మనకు వ్యతిరేకమైనా, పెద్ద పర్వతాలవంటి కష్టాలు బాటలో అడ్డుగా నిలిచినా, భయపడవద్దు. భగవంతుని సహాయహస్తం  మొదట్లో అవరోధాల రూపంలో, కష్టాల రూపంలో మనకు ప్రత్యక్షమవుతాయి, భగవదిచ్చను అనుసరించి విశ్వాస పూరకంగా పాటించినట్లైయితే, భగవంతుడే మనలను  ముందుకు నడిపించి లక్ష్యసిద్ది కలిగింపజేస్తాడు.
సమాజన్ని వదిలి ఎక్కడికో దూరంగా పోవద్దు. మనస్సును, హృదయాన్ని అర్పించి సమాజాన్ని సేవించు. సమాజసేవ అనేది సర్వవ్యాప్తియైన నారాయణుని సేవకు పర్యాయ పదం.
జీవితంలో మృత్యువు ఏ క్షణంలోనైనా ముంచుకొని రావచ్చు. అది ఎప్పుడు వచ్చినా స్వాగతిoచడానికి, స్వీకరిoచడానికి సిద్ధంగా ఉండాలి. ఎంత కాలమైతే జీవితం నడుస్తూ ఉంటుందో, అంతవరకు దానిని ఆత్మోద్దరణకు, సమాజ సేవకు వినియోగించు..
:~ మనో వికలుడైన శివాజీ.. నేను ఇక రాజ్యం చేయనన్న సందర్భంలో హిత బోధ చేసిన స్వామి సమర్ధ రామదాసు..

విజయం

నాయకుడైనా ప్రతి వ్యక్తి కొంగొత్త వ్యూహాలను తయారు చేస్తాడు. వాటిని విజయవంతంగా అమలు చేస్తాడు. ఈ సామర్ధ్యమే అతనికి విజయాన్నిస్తుంది...
విజయ అంటే 90% సన్నాహాలు, 10% ఉహించని సమస్యలను తట్టుకుని నిలవడం అని చెపుతారు..
:~ ఛత్రపతి శివాజీ జీవిత అధ్యయనంలో స్పష్టంగా కనిపించే విధానం.

శ్రీ కృష్ణుని రాజనీతియే శివాజీ యుద్ధనీతికి మూలసూత్రం అయిందా? 

విజయసాధనం శివాజీ యుద్ధనీతికి మూల సూత్రం. తన శత్రువు ఎవరు? అతడు ఎటివాడు? అనే విషయంలో శివాజీకి పూర్తి  ఆకళింపు ఉంది. అతడు ఎంతటి నీతి వంతుడో, ఇచ్చినమాటను ఎలా నిలబెట్టు కుంటాడో ఆయనకు తెలుసు. తనకు రాజ్యం
లభించడం కోసం తండ్రిని, సోదరున్ని, ఇతర బంధువులను చంపడానికి వెనుదీయని శత్రువుతో జరిపే యుద్ధంలో ధర్మయుద్ద నియమాలను పాటించటం అర్థం లేదని శివాజీ మొదట్లోనే గుర్తించాడు. 

రాజపుత్రుల ఉదాహరణ ఆయన ముందున్నది. వారి వీర మరణములు, బలిదానములు, వారి స్త్రీల జౌహార్లు ప్రశంసనీయములే అయినా విజయాలను సాధించలేకపోయాయి. 

విజయాన్ని ఎలా సాధించాలో ఆయన మహాభారతంనుండి నేర్చుకుని ఉండాలి. శ్రీకృష్ణుడు విజయాలను సాధించాడు. అర్జునుడు విజయుడే. శ్రీకృష్ణుడు యుద్ధరంగా లలో ఓడిపోలేదని కాదు. ఆయన యుద్ధ రంగాలలో ఓడిపోయినా యుద్ధం గెలిచాడు. ధర్మరాజు చేత "అశ్వతామా హతః " అని ఒక విధమైన అసత్యం పలికించాడు, భీమునిచేత దుర్యోధనుణ్ణి తొడపై గదాఘాతం చేయించాడు. జరాసంధుణ్ణి ఎలా రెండుగా చీల్చాలో చెప్పాడు. 
కపట - ద్యూతం ఆడేవారితో జరిగే యుద్ధం నూటికి నూరుపాళ్ళు ధర్మయుద్దంగా ఎలా ఉంటుంది? అభిమన్యుణ్ణి ఏకాకినిచేసి చంపిన వారికి, ఊడిన రథచక్రాన్ని తిరిగి అమర్చుకునే వ్యవధి ఎందుకివ్వాలి? శ్రీకృష్ణుని ఈ నీతి శివాజీకి పాఠం నేర్పింది.

శివాజీ చాణక్యుని అర్థశాస్త్రం, మహాభారతంలోని శాంతిపర్వం మననం చేసుకున్నాడా అనిపిస్తుంది ఆయన రాజనీతిని పరిశీలిస్తే. శివాజీకి తనయొక్క పరిమితి తెలుసు. శత్రువు యొక్క శక్తీ తెలుసు. ఈ రెండు బిందువుల మధ్య ఆయన విజయశీలమగు తన యుద్ధనీతిని రచించాడు.

Wednesday, February 15, 2023

జై భవాని - వీర శివాజీ

అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండి విన్న వీర గాథలు, ఉగ్గు పాలతో తాగిన ధర్మ నిష్ఠను కలగలిపి ఎదుగుతూ...
 ఊహ తెలిసినప్పటి నుండి ఊపిరి పోయే వరకు కర్తవ్యంగా సాగించిన యోధుడు శివాజీ.
అర నిమిషం కూడా వృధా చేయక
క్షణం క్షణం ధర్మ రక్షణ కోసమే నిలిచిన ధర్మ వీరుడాయన. శత్రువుల ద్వారా వచ్చిన ప్రతీ ఆపదను తన యుక్తికి ఆ దైవ కృప తోడై చావు నోట్లో నుండి బయట పడ్డ సందర్భాలు అనేకo.
అవి చదివితేనే ఎంతో భయంగా ఉన్నది, అనుభవించిన వారి, సంగతి? దగ్గరగా చూసిన వారి సంగతి... అందుకే 400ఏండ్లయినా శివాజీ అనే పేరు వింటేనే ఒళ్ళుకు పూనకం వస్తుంది.  రేపటి హిందూస్తాన్ కోసం ఆయన చేసిన పోరాటం అనిర్వచనీయం...
ఆయన ఆశయం కోసం మనo కొంతైనా ఆచరణలో చూపితే ధన్యమే..
గత కొన్ని రోజులుగా చదివిన ఈ కాస్త సాహిత్యంతో ఎంతో ప్రేరణ దొరికింది..
శివాజీ ధర్మం కోసం చేసిన పోరాటం, త్యాగంలో నేటి తరంగా మనకూ కొంతైనా అవకాశం ఇవ్వాలని దైవాన్ని కోరుదాం.

జై భవాని               వీర శివాజీ.