సాధన కుటీర్ మంత్రి మండలి అల్పాహార సమయంలో జరిగిన సమావేశ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
వారం రోజులను మూడు ముక్కలుగా చేసి 2 2 3 విడగొట్టి శుక్ర, శనివారాలలో హింది, ఆది, సోమ, మంగళ వారాలలో తెలుగు, బుధ, గురు వారాలలో English బాషలలో మాత్రమే మాట్లాడాలని నిర్ణయించడమైనది.
కాబట్టి సందర్శకులు ఆయా రోజులలో వచ్చేవారు ఆ బాషలోనే మాట్లాడాలి, రానిచో నేర్చుకొని రావలని మంత్రిమండలి తీర్మానించింది.
దానితో పాటు రాబోయే రెండు నెలలలో కుటీర్ లో సేంద్రీయ వ్యవసాయం, అవకాశం ఉన్న అన్ని స్థలాలలో అన్ని రకాల పూలమొక్కలు పెంచాలని కూడా తీర్మానం జరిగింది.
ఈ కార్యంలో బాగాస్తులు కావాలని, ఉత్సాహంగా ఉన్నవారికి కూడా అవకాశం ఇవ్వాలని సాధన కుటీర్ మంత్రి మండలి తమ అల్పాహార సమావేశంలో నిర్ణయించింది.
కావున ఈ అవకాశం ఉపయోగించుకోవలసిందిగా సందర్శకులను ఆహ్వానిస్తున్నది.
No comments:
Post a Comment