Thursday, March 25, 2021

సాధన కుటీర్ మంత్రిమండలి తీర్మానం

సాధన కుటీర్ మంత్రి మండలి  అల్పాహార సమయంలో జరిగిన సమావేశ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

వారం రోజులను మూడు ముక్కలుగా చేసి 2 2 3 విడగొట్టి శుక్ర, శనివారాలలో హింది, ఆది, సోమ, మంగళ వారాలలో తెలుగు, బుధ, గురు వారాలలో English బాషలలో మాత్రమే మాట్లాడాలని నిర్ణయించడమైనది. 
కాబట్టి సందర్శకులు ఆయా రోజులలో వచ్చేవారు ఆ బాషలోనే మాట్లాడాలి, రానిచో నేర్చుకొని రావలని మంత్రిమండలి తీర్మానించింది. 
దానితో పాటు రాబోయే రెండు నెలలలో కుటీర్ లో సేంద్రీయ వ్యవసాయం, అవకాశం ఉన్న అన్ని స్థలాలలో అన్ని రకాల పూలమొక్కలు పెంచాలని కూడా తీర్మానం జరిగింది. 
ఈ కార్యంలో బాగాస్తులు కావాలని, ఉత్సాహంగా ఉన్నవారికి కూడా అవకాశం ఇవ్వాలని సాధన కుటీర్ మంత్రి మండలి తమ అల్పాహార సమావేశంలో నిర్ణయించింది. 
కావున ఈ అవకాశం ఉపయోగించుకోవలసిందిగా సందర్శకులను ఆహ్వానిస్తున్నది.

అమ్మాయే పూజారి

అమ్మాయే పూజారి..

ఆంజనేయుడి గుడిలో అమ్మాయే పూజారి.

శ్రీకృష్ణ దేవరాయుడి పాలనలో నిర్మించిన పంచముఖి ఆంజనేయుడి ఆలయం, #కృష్ణాపరఠాణ, #తిరుపతి. 

నిత్యం రద్దీగా ఉండే తిరుపతిలోని  #గోవిందరాయస్వామి దేవాలయానికి అతి సమీపంలో, చౌరస్తాలో ఉన్న ఈ ఆలయాన్ని అదికారులు తొలగిద్దామని చేసిన ప్రయత్నాలన్నీ వృదానే అయ్యాయంట. ఆ పంచముఖుడే అదికారులకు పంచ్ లిచ్చి, మాకు ఈ ఆలయ భాద్యతను అప్పజెప్పాడు అంటున్నారు నిర్వహకులు. 
అవుసరం కోసం కుటుంబం అంతా అయన సేవలో ఉంటాం అంటున్నారు. 
మరి మహిళలు ఆలయంలో, అదీ ఆంజనేయుడు ఆలయంలో పూజారిగా ఉండొచ్చా అని అడిగుతే .. ఎందుకుండ కూడదు, ఎవరన్నారు ఉండకూడదని ఎదురు ప్ర|శ్న..
నిజమే కదా భక్తికి, శక్తికి లింగ భేదం లేదని శాస్త్రాలను ఔపాసన పట్టిన మన పెద్దలు ఎప్పుడో చెప్పి ఉన్నారుగా.
అవును అవుసరాలు అవకాశాలు అందించి, అన్నీ నేర్పుతాయి. అన్నీ మరిచి అనుసరించడమే మనం చేయాల్సిన పని. 
మన శిరిషా అదే చేస్తుంది..  అక్క, బావలకు ( హరనాథ్, శాంతి) అండగా ఆంజనేయుడి గుడిలో, అవుసర నిమిత్తం పూజారి.  
B.Tech & Fashion designing చదివి, అదీ ఆంజనేయుడి గుడిలో పూజారిగానా అంటే... అవును తప్పేముంది.. అన్నీ ఆ స్వామివారే చేయించుకుంటున్నాడు మనదేముంది అని సమాదానం. 
అంతేగా మరి, భక్తికి లింగబేదం లేదు_ ఆవుసరాలు అన్నీ నేర్పుతాయి అన్న మాట నిజమే అనిపించింది.

#Tirupathi  #HanumanTemple 
 #NOGenderDiscrimination

Wednesday, March 24, 2021

ఆవగింజంత కాళీ స్థలం లేదు

అవకాశాలు ఊరికే ఎందుకొస్తాయి.. ఆశతోనో, ఆశయంతో ఉన్న కొందరిచే అవి సృష్టించబడతాయి.. ఆలోచనలకు ఆచరణ తోడైతే అద్బుతాయి జరగక ఇంకేం జరుగుతాయి...
ఓ పనిలో నిండా మునిగిన వారికి వయస్సుతో సంబందమే లేదు.. మనస్సుతోనే పని.. అదే ఆపనిలో ఆనందాన్ని ఇస్తుంది. వాల్లు అడవిలో ఉన్నా, జనావాసంలో ఉన్నా వాల్ల పనిలో వారు ఉంటారు అంతే..
 కాన్సర్ రోగులకోసం ఓ రెండెకరాల స్థలంలో ఆవాసం. కట్టకముందంతా అక్కడ బండరాళ్ళే.. ఇప్పుడు #ఆవగింజంత స్థలం #కాళీలేకుండా అన్నీ #మొక్కలే..  #కాయకూరలు, #పండ్లమొక్కలు, #పూలమొక్కలు, #ఔషదమొక్కలు...ఒకటేమిటి అన్ని రకాల మొక్కలు. అన్నీ 
#సేంద్రీయఎరువులతో వాడకమే...ఆ స్థలమే #మాతాపితరులసేవాసదనం  వారిచే నడపబడుచున్న Naturopathy Training center  #క్యాన్సర్ వ్యాదిగ్రస్తుల #ఆవాసం@ #వినోభానగర్, వీరపట్నం. 
అది వృద్దులచే నడపబడుచున్న ఆవాసం..వారు వయసులో మాత్రమే వృద్ధులు..

ఆ కాయకూరల కోసం Gnana Saraswathi   #సాధనకుటీర్ లో   పండియ్యలేమా?  అనే ఆలోచన సందర్సన తరువాత కలిగింది. 
ఇగ పని మొదలుపెట్టడమే..

Tuesday, March 23, 2021

*BHARATH DHARSHAN YATRA*

#BharathDharshanYatra_2021
#TamilNadu Trip. 
Successfully Completed trip with 3280Kms, on road in week days and visited..

1.bhavani nagar 2.madhura
3.palani 4.kanyakumari
5.suchindram.6.thiruchendur
7.dhanuskoti 8. Rameshwaram
9. Srirangam 10.Jambukeshwaram

11.kumbhakonam 12.chidambaram
13. Arunachalam 14.kanchi
15.srikalahasthi
16.thirupathi (No Dharshanam Only Laddus).

 Thx  #God, #Nature & Health to Support our trip..
  Congratulations to team members for Good Cooperation.

అవి కేవలం పూజల కోసమే కట్టన దేవాలయాలు మాత్రమే కావు... అత్యద్భుత #కళాకండాలకు నిదర్శనాలు..
 కొండలమధ్య వెలసిన ఆ దేవదేవతలకన్నా, ఆ దేవతల అనుగ్రహాలను భవిష్యత్తు తరాలకు అందించాలని తపనపడ్డ నాటితరం దార్శనికుల #శ్రద్దాకేంద్రాలు...
 సుమారు 15 ఎకరాలు నుండి మొదలై 100 పైగా ఎకరాలలో, అద్భుత శిల్పకళ ను రాళ్లలో బంధించిన ఆ శిల్పుల #సమర్పణకు #ప్రణామాలు. 

సుమారు 30 అడుగుల ఎత్తు, 
100అడుగుల వెడల్పులతో ఆలయ లోపలి ప్రాకారాలు పూర్తిగా రాళ్లలో నిండిన #శిల్పాలు, 300/100 అడుగుల ఎత్తు, వెడల్పులతో,
ఒక్కో ఆలయానికి నాలుగు #ముఖద్వారాలు, #గోపురాలు..

 అత్యoత వైభవంగా జరిపిన నిర్మాణాలు మాత్రమే కాదు,
ఆ ఆలయాల #నిర్వహణ కూడా అత్యద్బుతం. లక్షలమంది భక్తులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు. అన్ని వర్గాల వ్యవస్థలు, అన్నివేళలా  అందుకు సిద్ధంగా ఉండటం #మాహాఅద్బుతం. 

 తెలుగు రాష్ట్రాల మాదిరిగా 
#ఎక్కువధరతో కొనుకున్న వారికి దగ్గరగా #దైవదర్శనం అన్న నిబంధనలు  లేకపోవడం #ఆనందదాయకం.
ఆలయాలలోని గర్భాలయంలో విద్యుత్ దీపాలు అసలు వాడకుండా,     #తైలదీపాలతో అలంకరణ దర్శనం #ఆలయాలకు అద్భుత ఆధ్యాత్మిక శోభను అందిస్తుంది... 
ఇలాంటి అద్భుత ఆలయాలను నిర్మించిన వారికి, నిర్వహణలో ఉన్నవారికి నమస్సులు..
తమిళనాడులోని ముఖ్య ప్రదేశాలలో వెలసిన ఆలయాలను బృందంతో కలిసి సందర్శించన సందర్బంగా కలిగిన వ్యక్తిగత  భావన/అభిప్రాయం..

#మానవవికాసకేంద్రాలుగా #విలసిల్లినవి #మనఆలయాలు,
 ఆ పరంపరను కొనసాగిద్దాం.

CLICK CLICK

కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలు ప్రత్యేకం..  యాదృచ్చికం కూడా..గమ్మత్తుగా అనిపిస్తాయి...
చిన్న సమన్యయలోపం వల్ల, కొంత ఆలస్యమయ్యి  పోవాల్సినవారం నడకదారిలో కార్తికేయ అలయం గుట్టపైకి వెళ్తున్నాం.. అక్కడక్కడ బయటి కట్టడాలకు మూల దేవతా విగ్రహాలు, వారి ఆయుధాలు, వాహనాలు కూడా ఏర్పాటు చేయబడుతాయి. పలనిలోని కార్తికేయ ఆలయం పైకి వెళ్ళెటప్పుడు కార్తికేయవాహనం, మయూరం ఒక కట్టడం మూల మీద ఇలా నిలబడగానే క్లిక్ క్లిక్..  అచ్చం బొమ్మలా అనిపిస్తుంది ఆ పక్కనే ఉన్న రెండు బొమ్మల్లా..

Wednesday, March 17, 2021

Bharath Dharshan Yatra _ 2021

ఎప్పటికైనా కొంత ముప్పే అని తెలిసినా...  పెద్దలు, దార్శనికులు ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు ఇతర సామజిక చైతన్య ప్రేరణా కేంద్రాలు అన్నీ ఎక్కువ శాతం నదీ 
 ప్రవాహక స్థలాలలో, సముద్రపు అంచున ఏర్పాటు చేయడానికి కారణాలు ఏమై ఉంటాయా? అని అలోచిస్తే.... 
ఆని ఒడుదుడుకులను ఎదుర్కొని, కుంగక_పొంగక జీవితాన్ని నీటి ప్రవాహంలాగే కొనసాగించాలనే సందేశాన్ని వారు ఆచరించి చూపిస్తూ, జనాలకు భోదించేవారని అర్థం చేసుకోవచ్చు. మూడు మహాసముద్రాల సంగమ స్థలం, కన్యాకుమారిలో స్వామి వివేకానంద  3రోజుల ధ్యానంతో ప్రపంచానికే మార్గదర్శన స్థలం వివేకానంద స్పూర్తికేంద్రం మనలాంటి వారికి ఒక ప్రేరణా కేంద్రమే..

Saturday, March 6, 2021

కార్యకర్త.

ప్రతి పనికి సాధన అవసరం. ఆ సాధన కొన్నిసార్లు సామూహికంగా ఉంటుంది . వ్యవస్థలో పరిపూర్ణత రావాలి అంటే వ్యక్తిలో సమర్పణా భావన పెరగాలి. సామాజిక  కార్యానికి కూడా సమయ సమర్పణే మూలాధారం .. అవుసరాన్ని బట్టి , అనుకూలతను బట్టి  సమయ సమర్పణ చేసే వెసులుబాటు మనందరికీ ఉంటుంది ... 
అదే సాధన. మన సమర్పణ భావనను బట్టే మనకు, వ్యవస్థకు విజయాలు అందుతాయి...  అది కార్యకర్త కార్యోన్ముఖుడు కావడానికి చాలా ఉపయోగపడుతుంది..
వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది అని నమ్మిన ప్రతివారికీ,  వ్యవస్థ పరిపుష్టత కోసం  దోహదపడే అవకాశం ఉంటుంది..