Sunday, December 31, 2023

క్షేత్ర సందర్శన ఆహ్వానం to MLA

హరివర అఖండక్షేత్రం, పెద్దచెరువు కొనకట్ట, వీరపట్నo.
యువత ఉన్నతంగా ఎదిగి, తమ కుటుంబానికి, తమ ప్రాంతానికి నిస్వార్థ సేవ చేయడానికి ప్రేరణా శక్తిగా నిలవడంతో పాటు.....
*వీరపట్నం పరిసర ప్రాంతాలు సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ నిర్మించ తలపెట్టిన 108అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణ స్థలం "హరిహర అఖండక్షేత్రo"లో జనవరి 9వ తేదీ, మంగళవారం  జరిగే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవానికి గౌరవ శాసన సభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారిని ఆహ్వానించిన అఖండక్షేత్ర సమితి సభ్యులు*.
కలిసిన వారిలో అఖండక్షేత్ర   వ్యవస్థాపకులు సదా వెంకట్ గారితో పాటు
 పాండు రంగా రెడ్డి, శ్రీ ఈ వెంకట్ రెడ్డి కౌన్సిలర్, శ్రీ నందు కౌన్సిలర్, శ్రీ రమేష్, చందూ తదితరులు ఉన్నారు.
 
09.01.2024 రోజున  *శ్రీ జగద్గురు శంకరాచార్యులు, హంపీ విరూపాక్ష   విద్యారణ్య మహా సంస్థాన పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ క్షేత్ర సందర్శనకు విచ్చేసి అందరికీ ఆశీస్సులు అందిస్తారు.*.
:~ సదా వెంకట్,
Founder,
 హరివర అఖండ క్షేత్రసమితి & వీరపట్నo అఖండ ట్రస్ట్.

Sunday, December 24, 2023

జనారణ్యంలో మృగరాజులా...

జన మహా అరణ్యంలో..
 ఓ మృగ మహారాజులా జీవించాలి...
******************************
సంసారిక జీవనం అయినా..
 సన్యాసి ప్రస్థానం అయినా...
ఓ యుద్ధక్షేత్రం లాంటిది.

నైరాస్యం, వైరాగ్యం ఎప్పటికీ దరిచేరనివ్వద్దు.
మన బాధ్యత ఉన్నంతకాలం వరకు...
నిక్కచ్చిగా మన కర్తవ్యాన్ని,
 మనం నిర్వర్తించాల్సిందే... 

అనగదొక్కాలని, 
అవరోధాలు సృష్టించాలని 
మన చుట్టప్రక్కన ఉన్నవాళ్లే  అదనుచూసి మనను
దెబ్బ వేయాలని చూస్తుంటారు..
అన్నింటినీ గమనిస్తూ అడవిలో వేటాడే సింహం లాగా 
మన ఆహార్యం ప్రపంచానికి కనిపిస్తుండాలి.

పరిపరి విధాల జనాలు...
వివిధ భావజాలాల మనస్తత్వాలు...
ఒకడు ఈసరించుకుంటాడు,
మరొకడు పడనివ్వడు,
వేరొకడు కుదరనివ్వడు, 
ఇంకొకడు ఇరకాటంలో పెడుతుంటాడు....

అందరివీ వినాలి, అన్నింటినీ చూడాలి 
అవసరo అనిపిస్తేనే స్పందించాలి..
కొన్నింటిని ఆకలింపు చేసుకోవాలి,
కొందరి మనస్తత్వాలను అవతలికి విసిరేయాలి...
సాధ్యమైనంత వరకు, 
సంఘర్షణకు దూరంగా ఉండాలి
తప్పదనుకున్నప్పుడు తాడోపేడో తేల్చాలి.... 

నీ అతి మంచితనంతో... 
అవతలివాడు నిన్ను బలహీనంగా అంచనా వేస్తే..
నీ మనుగడకే ప్రమాదం, 
అందుకే నీవు మాత్రం...
ఈ జన మహా అరణ్యంలో...
ఓ మృగ మహారాజులా జీవించాలి.

Sunday, December 17, 2023

EMINENT PERSONALITY

One more step forwarded.... 
met Another Eminent personality..      
ఇంకో అసాధారణ వ్యక్తిత్వoతో కలయిక..  ఉన్నత స్థాయి హోదాలో ఉన్నా ఎలాంటి అధికార దర్పం చూపక సాధారణంగా ఉండే వ్యక్తి...     
గత 10 ఏళ్లుగా మన పని పట్ల అంతే ఆదరణ చూపే శివధర్ రెడ్డి గారు,IPS... ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్... అయినా వ్యక్తిత్వంలో మార్పు లేదు.
వారు Intelligene Chief అయిన  వారం రోజు తరువాత కలిసిన సందర్భం.

Wednesday, December 13, 2023

పరాన్న జీవులు

ఈ భూమండలంలో అన్నీ  పరాన్న జీవులే...              
ఒక జీవి ఇంకో జీవికి ఆహారం.. అయినా దేవుడు ఊరికే తెచ్చి నోట్లో పెట్టడు.. స్వశక్తితో సేకరించాలని అన్ని జీవులకు కొంత బుద్ది, ఇంకొoత శక్తీ ఇచ్చాడు... వాటిని సక్రమంగా వాడాలి... అది అక్రమం అయినప్పుడే ప్రకృతి రెక్కలు ఇరుస్తది.. నీకు నీవుగా సక్రమంగా చేసే ఎంతటి సాహసానికైనా ప్రకృతి గుప్త సహకారం ఇస్తుంది...అది స్వార్థం, అక్రమంవైపు అడుగులు పడితే... ప్రకృతి WatchDog అయ్యి తన ఉపకరణాలకు ఉప్పందిస్తది.. అప్పుడు ఆ ఉపకరణాలు ఒక్కొక్కటిగా చుట్టుముట్టి స్వార్థపు  రెక్కలు విరుస్తాయి..   సమాజహితం కోరి నిజాయితీగా జరిగే ప్రతీ కార్యానికి, ఆలస్యమైనా సరే ప్రకృతి అండ తప్పనిసరిగా ఉంటుందనేది పచ్చి నిజం.....
ఇలాంటి వాటికి చరిత్రలో లెక్కకు మించి సాక్ష్యాలున్నా, ఇదే సత్యమని చూపే బోలెడు ఉదాహరణలు కళ్ళ ముందు ఉన్నా.... నమ్మక నమ్మి ముందుకే సాగే స్వార్ధపు రెక్కలు విరగడం తథ్యం...జాగ్రత్త అవసరం.

Thursday, November 16, 2023

Hampi Trip -2020

కార్తీక మాసం energy నే వేరు..
 వాతావరణoలో మార్పుతో పాటు, 
 పవిత్రతతోఁ నిండిన  అద్భుత శక్తిని సమాజానికి ప్రసాదిస్తుంది.
మాసం ప్రారంభ రోజునే దక్షిణ కాశీ హంపీ- #Hampi క్షేత్ర సందర్శన...

#పూజ్యశ్రీవిద్యారణ్యభారతిస్వామిజీ సన్నిధిలో, వారి ఆశీస్సులతో...
పుష్కరాలకు మూడు రోజుల ముందే 
తుంగభద్రలో గజరాజు చల్లిన నీటితో #పుష్కరస్నానం తో పాటు #హనుమకు శక్తిని ప్రసాదించిన వీరభద్రస్వామి దర్శనం.. దేశంలోనే ఎత్తైన 16 అడుగుల శ్రీ వీరభద్ర స్వామి దర్శనంతో పాటు #హంపీ క్షేత్రమంతా కలియ తిరగటమే....
ప్రతీ సంవత్సరం #హంపీ సందర్సన చేసినా.... వచ్చిన ప్రతిసారి కొత్తగానే, కొంత శక్తిని తీసుకుపోవడమే.

Wednesday, November 15, 2023

బిర్శా ముండా

త్యాగమూర్తులను స్మరిoచుకుందాం _ భావితరాలకు స్ఫూర్తినందిద్దాం.
బిర్సా ముండా (1875–1900) “బిర్సా భగవాన్” భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఆంగ్లేయ పాలకుల పాలన నుండి భారతదేశాన్ని విముక్తపోరాటాలు చేసిన యోధులలో పేరెన్నిక కన్నవారు బిర్సా  ముండా. *ఈ భూమిపై జీవించినది అతి కొద్ది కాలమైన అనంతమైన చరిత్రను సృష్టించుకున్నారు.* జనజాతి వీరుడు, నవధీరుడు *బిర్సా ముండా జీవించిన కాలం పాతిక సంవత్సరాలే, జనజాతి ప్రజల మనస్సుల్లలో ‘భగవాన్ బిర్సా’  ముండా గా ఈనాటికి జీవిస్తున్న చిరంజీవి ఆయన.* 
బిర్సా ముండా, జార్ఘండ్ లోని ఖుంతీ జిల్లా, ఉలిహతు గ్రామంలో నవంబర్ 15, 1875, గురువారం రోజున జన్మించాడు. తండ్రి సుగుణా ముండా, తల్లి కర్మి హాటు.
అహుబటు గ్రామంలో తన మామయ్య ఇంట్లో ఉంటూ దగ్గర్లోని సాల్గా అనే గ్రామంలోని పాఠశాలలో చేరాడు. సాల్గా గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని, తర్వాత బూర్జు మిషన్ స్కూలుకు మారాడు. అతని ప్రతిభను గమనించి స్కూలు యాజమాన్యం, పశ్చిమసింగ్ భూం జిల్లా కేంద్రమైన చైబాసాలో మరో మిషనరీ పాఠశాలకు పంపించారు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. అక్కడ ఆయన పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ఫలితంగా బ్రిటిష్ పాలకుల అణిచివేత, దోపిడిని అర్థం చేసుకున్నాడు. కాలేజీలో, *స్కూల్లో జరిగే వక్తృత్వం, చర్చా కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ వనవాసీల నీరు, అడవి, భూమిహక్కుల గురించి ఎంతో గట్టిగా వాదించేవారు*.  ఆంగ్లేయులు చేసి అరాచకాల వల్ల ఎదుర్కొంటున్న దుస్థితిని గురించి బాగా ఆలోచించేవాడు. పాఠశాల వయస్సులోనె చరిత్రను దాని పూర్వా పరాలను ఆకలింపు చేసుకొని బ్రిటిష వారు చేసే కుట్రలను కుతంత్రాలను తమ జాతులు వారికి తెలియజేసి, వారిని స్వాతంత్ర పిపాశ కలుగ జేసిన దూర దృష్టి కలవాడు. అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్ పాలకులు, అధిక పన్నులు వసూలు చేసేవారు. పన్ను చెల్లించలేని వారి ఆస్తుల్ని లాక్కునేవారు, ఎదురు తిరిగిన వారిని నానా బాధలు పెట్టేవారు. బ్రిటిష్ వాళ్ళ బాధలు పడలేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటలలోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగి ఇచ్చేయాలని ఒకరోజు ముండాతెగ పెద్దలతో కలిసి బిర్సా, తెల్లదొరలపై ఒత్తిడి చేశారు. దాంతో మిషనరీ పాఠశాల ఆయనను బహిష్కరించింది. దీన్ని సవాలుగా తీసుకున్న, *బిర్సా వారి ఎదుటే నుదుట నామం పెట్టి, జన్యం, ధరించి ఇకపై క్రైస్తవంలోకి ఒక్క ఆదివాసీని కూడా మారకుండా చూస్తానని ప్రతిన బూనారు*. 
అంతకు ముందు జరిగిన సంతాల్ ఉద్యమం, చులార్ ఉద్యమం అతని వ్యక్తిత్వంపై ప్రభావం చూపాయి. బ్రిటీషర్ల వల్ల ముండా సందాల్, ఓరియన్,కోల్, జాతి తెగలు ఎప్పటికైనా ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించిన, బిర్సా ప్రత్యేకంగా 'బిర్సాయిత్' మతాన్ని స్థాపించారు.  ఆయా తెగలకు ఆధ్యాత్మిక విషయాలని బోధిస్తూ, ఐక్యమత్యంగా ఉండవలసిన అవసరాన్ని స్పష్టం చేశారు.  ప్రకృతి వైద్యంతో ఎంతోమంది ఆదివాసీలను కాపాడారు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు, బిర్సా ముండాను ' ధర్తిలాభ ' అంటే దేవుడిగా కొలిచేవారు. *తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్లో తిరుగుబాటు ' ఉల్ గులాన్ ' పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అందులో7,000 మంది పాల్గొన్నరు. భిర్సా ఆచూకీ తెలపాలని ఆదివాసీలను నిర్బంధిస్తూ వారిపై దాడులకు దిగేవారు బ్రిటిష్ వారు. వీటిని సహించని ఆయన అనుచరులు 1900, జనవరి 5న, ఎక్కేడి ప్రాంతంలో ఇద్దరు పోలీసుల్ని చంపేశారు. దీంతో రగిలిపోయిన పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించి చివరికి 1900 ఫిబ్రవరి మూడున జంకో పాయి అటవీ ప్రాంతంలో అరెస్టు చేసి రాంచీ జైలుకి తరలించారు. *"తెల్లవాళ్లు వెనక్కి పోవాలి "అనే నినాదాన్ని తన జాతి వారికి ఇచ్చాడు మహారాణి పాలన పోవాలి మన రాజ్యం రావాలి, అని సదా పరితపించేవాడు. *22ఏళ్ళవయసు లోనే తన జాతివారికి నాయకత్వం వహించిబ్రటిష్  వారిపైయుద్ధం ప్రకటించిన యువకుడు.* పన్ను మాఫీ కోసం ఉద్యమం ప్రారంభించిన మొట్టమొదటి వనవాసి. అతను చేసిన పోరాటాన్ని ఆ రోజుల్లోనే అన్ని పత్రికలు వేనోళ్ళ పొగిడాయి. 
ఎప్పటికైనా తమకు ప్రమాధికారిగా మారతాడని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం భిర్స ముండా ను 1900, జూన్ 9న విష ప్రయోగంతో చంపేసింది. బయటకు మాత్రం మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేసింది. ఆ విధంగా  ఒక విప్లవాత్మకమైన జీవితం ముగిసిపోయింది. 
బిర్సా చేసిన పోరాటం వల్ల 1908లో చోటా నాగపూర్ కౌలు చట్టం అమల్లోకి వచ్చింది. నీరు, అడవి, భూమి పైన వారసత్వ హక్కుల పరిరక్షణ కోసం ప్రారంభమైన పోరాటాలు ఒక దాని తర్వాత ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి.
ఇప్పటికి ఆయన్ని ఝార్ఖండ్, బీహార్, పశ్చామ బెంగాల్, ఒడిస్సా రాష్ట్రాలలో ఆదివాసీలు భగవాన్ బిర్సాముండాగా పూజిస్తున్నాయి. *చనిపోయేటప్పుడు బిర్సాకు కేవలం 25 సంవత్సరాల వయస్సు మాత్రమే.*
బిర్సా ముండా గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారు.  *కేంద్ర ప్రభుత్వం అతని జన్మదినాన్ని" జన జాతీయ గౌరవ దివస్ " గానిర్వహించింది*.

Friday, November 10, 2023

సిరిసిల్ల రాణీ

ఆడిబిడ్డ కదా.. పోరు బాట పట్టింది, అనువుగాని చోటుకు పోయింది, అసలే అక్కడ అధికారమధంతో అంభోతులు ఉన్నరంటా అంటే.. అసలు రమ్మని అడగలే, అక్కడ ఇట్లుంది ఆమె చెప్పలే...నచ్చినట్టుగా పోరు చేస్తున్నది..   అయినా మనసు ఊరుకొలే.... ఈ నికార్సయిన పోరు బిడ్డకు మనవంతు ఇసుమతన్న ఉపయోగపడాలి, అక్కడున్న మనవాల్లను కొందరినైనా జత చేయాలని ఆమెకు చెప్పకుండా నేను సిరిసిల్ల పోతే.. ఒక ఆడబిడ్డకు సారే పెట్టి పంపినట్టే నాకు మా నారాయణ ఇన్ని బట్టలు పెట్టి పంపిండు.. అది నాకు అమితంగా ఇష్టమైన ఖాదీ లుంగీలు - అంగీలు..  ఇట్లా మనకు మల్ల మల్లా బట్టలు రావాలన్నా, మనం పోవలన్నా  అక్కడ మన రాణీ రుద్రమ్మ గెలవాలి... ఖచ్చితంగా గెలవాలి..