Sunday, December 24, 2023

జనారణ్యంలో మృగరాజులా...

జన మహా అరణ్యంలో..
 ఓ మృగ మహారాజులా జీవించాలి...
******************************
సంసారిక జీవనం అయినా..
 సన్యాసి ప్రస్థానం అయినా...
ఓ యుద్ధక్షేత్రం లాంటిది.

నైరాస్యం, వైరాగ్యం ఎప్పటికీ దరిచేరనివ్వద్దు.
మన బాధ్యత ఉన్నంతకాలం వరకు...
నిక్కచ్చిగా మన కర్తవ్యాన్ని,
 మనం నిర్వర్తించాల్సిందే... 

అనగదొక్కాలని, 
అవరోధాలు సృష్టించాలని 
మన చుట్టప్రక్కన ఉన్నవాళ్లే  అదనుచూసి మనను
దెబ్బ వేయాలని చూస్తుంటారు..
అన్నింటినీ గమనిస్తూ అడవిలో వేటాడే సింహం లాగా 
మన ఆహార్యం ప్రపంచానికి కనిపిస్తుండాలి.

పరిపరి విధాల జనాలు...
వివిధ భావజాలాల మనస్తత్వాలు...
ఒకడు ఈసరించుకుంటాడు,
మరొకడు పడనివ్వడు,
వేరొకడు కుదరనివ్వడు, 
ఇంకొకడు ఇరకాటంలో పెడుతుంటాడు....

అందరివీ వినాలి, అన్నింటినీ చూడాలి 
అవసరo అనిపిస్తేనే స్పందించాలి..
కొన్నింటిని ఆకలింపు చేసుకోవాలి,
కొందరి మనస్తత్వాలను అవతలికి విసిరేయాలి...
సాధ్యమైనంత వరకు, 
సంఘర్షణకు దూరంగా ఉండాలి
తప్పదనుకున్నప్పుడు తాడోపేడో తేల్చాలి.... 

నీ అతి మంచితనంతో... 
అవతలివాడు నిన్ను బలహీనంగా అంచనా వేస్తే..
నీ మనుగడకే ప్రమాదం, 
అందుకే నీవు మాత్రం...
ఈ జన మహా అరణ్యంలో...
ఓ మృగ మహారాజులా జీవించాలి.

No comments:

Post a Comment