ఆడిబిడ్డ కదా.. పోరు బాట పట్టింది, అనువుగాని చోటుకు పోయింది, అసలే అక్కడ అధికారమధంతో అంభోతులు ఉన్నరంటా అంటే.. అసలు రమ్మని అడగలే, అక్కడ ఇట్లుంది ఆమె చెప్పలే...నచ్చినట్టుగా పోరు చేస్తున్నది.. అయినా మనసు ఊరుకొలే.... ఈ నికార్సయిన పోరు బిడ్డకు మనవంతు ఇసుమతన్న ఉపయోగపడాలి, అక్కడున్న మనవాల్లను కొందరినైనా జత చేయాలని ఆమెకు చెప్పకుండా నేను సిరిసిల్ల పోతే.. ఒక ఆడబిడ్డకు సారే పెట్టి పంపినట్టే నాకు మా నారాయణ ఇన్ని బట్టలు పెట్టి పంపిండు.. అది నాకు అమితంగా ఇష్టమైన ఖాదీ లుంగీలు - అంగీలు.. ఇట్లా మనకు మల్ల మల్లా బట్టలు రావాలన్నా, మనం పోవలన్నా అక్కడ మన రాణీ రుద్రమ్మ గెలవాలి... ఖచ్చితంగా గెలవాలి..
No comments:
Post a Comment