Wednesday, September 4, 2019

ఆవేదనకు అర్థం ఉంటుంది.

ఆవేదనకు ఒక అర్థం ఉంటుంది... ఆవేదనలో ఒక ఆశా ఉంటుంది...

  కానీ ఆ అవేదన ఒక ఆశయంగా మారి ఆచరణకు పూనుకొంటే అసాధ్యమన్నది ఉండదు అని
చరిత్ర చెపుతున్న నిజం.

*వ్యక్తికంటే వ్యవస్థ గొప్పది. వ్యవస్థ పరిపుస్టత కోసం ఆ వ్యవస్థలోని వ్యక్తి/వ్యక్తులు చేసే నిజయితీగా చేసే కార్యంపై ఆదారపడి ఉంటుంది*.

తప్పక తెలుసుకోవాల్సిన విషయం...
*నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా  లేక కార్యానికైనా ప్రకృతి తప్పక(తలవంచి) సహకరిస్తుంది అనేది చరిత్ర చెపుతున్న నిజం*
ఆ రకంగా ఏ వ్యక్తి చేసినా, ఏ వ్యవస్థ చేసిన సహకరించడం ప్రకృతి ధర్మం...

పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర మొత్తం తిరగేసి చూసినా మనకు కనబడేది అదే...
ముఖ్యంగా *సమాజ హితం కోరి చేసే ఇలాంటి కార్యక్రమాలు, పదిమందిని బాగస్వాములను చేస్తూ చేసే కార్యక్రమాలు తప్పక ఆ ప్రకృతి నియమం పాటిస్తే, విజయాన్ని చాలా తేలికగా అందిస్తుంది*.

అలా కాకుండా *స్వార్థంతో, ఒక వ్యక్తి లేదా ఒక  కుటుంబo కోసం  లేదా ఇతర వ్యక్తిగత అవుసరాలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లయితే దానిలో శాశ్వత విజయం,శాశ్వత ఆనందం లభించదు, ఉండదు.  అదీ కాకుండా ఈర్ష్యా, ద్వేషాలతో ఇతర వ్యక్తులకు, ఇతర వ్యవస్థకు ప్రత్యేన్యాయంగా ఇంకో వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నా ఆ ప్రకృతి సహకరించదు*.

అంతే కాదు, మన ద్వారా జరుగుతున్న పనులకు,
జరిగే నష్టాలను ఇతరులకు ఆపాదించడమూ సరైన విషయమూ కాదు...

*ఒక  సామజిక కార్యాన్ని ప్రారంభించి కొసదాక తీసుకువెల్లే క్రమంలో అనేక పరిణామాలు ఉంటాయి. వ్యక్తులు, వ్యవస్థ లు చివరకు ఆ ప్రకృతికూడా మనకు అనేక రకాల పరీక్షలు పెడుతుంది... వాటికి జవాబుదారిగా ఉంటూనే విజయాన్ని ముద్దాడాలి*
చరిత్రను పరిశీలించి చూస్తే మనకు అదే అనబడుతుంది.. అన్ని రంగాల సామాజిక పనులలో అదే విధానం ఉంటుండి..

*ప్రారంభంలో అవహేళన చేయబడుతుంది, ప్రశ్నించబడుతుంది, అపైన విమర్శించబడుతుంది, వేగంగా తిరస్కరించబడుతుంది.. చివరగా ఒప్పుకోబడుతుంది... ఏ సామజిక కార్యానికైనా  ఇదే పరిణామ క్రమం.. కావున ఒక సామాజిక  కార్యాన్ని  చేయాలని సంకల్పించిన వ్యక్తులకు/వ్యవస్థకు తప్పనిసరిగా ఆ ఓపిక,పట్టుదల అవసరం*.
అలా సాధించిన విజయాల వల్ల ఆ వ్యక్తులకు/వ్యవస్థకూ కీర్తి లభిస్తుంది. అది ఎవరైనా సరే.
అలాంటి కార్యాన్ని చేయాలనుకున్నాప్పుడు చేతి నిండా డబ్బులే ఉండాల్సిన అవుసరం ఏమీ లేదు..గుండె నిండా ధైర్యం, పనిలో నిజాయితి ఉంటే చాలు.

ఇక నందివనపర్తి విషయానికి వస్తే  అదోక ఆధ్యాత్మిక శక్తిని ఆపాదించుకున్న స్థలం. అది కొన్ని వందల సం.రాల చరితే..
   కొంత వనపర్తి మహాసంస్థానం(గద్వాల), కొంత దేవరకొండ మహాసంస్థాన విధానాలకు సంబందించిన ఆనవాళ్ళు మనకు కనబడతాయి. చాలా కుటుంబాలు ఈ రెండు సంస్థానాల పరిదినుండి వచ్చి ఈ పరిసర ప్రాంతాలలో  స్థిరబడ్డాయి. ఈ క్షేత్రంలో వెలసిన ఆలయాల చరిత్ర కూడా అదే.. ఈ ఆలయాల పరిరక్షనకోసమే కొన్ని కుటుంబాల ఆ సంస్థానాల నుండి పంపబడ్డాయి,  వచ్చి స్థిరబడ్డాయి. కాల గమనంలో వచ్చిన మార్పుల కారణంగా కొన్ని అలసత్వాలు, కొంత స్వార్థపూరిత జీవన విదానం, పర్యవేక్షణ లోపం నేడు మనం చూస్తున్న  వ్యవస్థకు కారణం...
కానీ *కాలం తప్పక తన పనిలో తాను ఉంటుంది. తనకు కావాల్సిన యోధుల్ని తనే తయారు చేసుకుంటుంది. తప్పక తన పని తాను చేసుకుంటుంది.  ఆలాంటి పనిలో మనకూ అవకాశం దొరికితే అదృష్ఠవంతులమే*...  దొరికిన ఆ పనిని నిజాయితీగా చేసి అప్పజెప్పడం కూడా అవసరమే..
ఆ పనికోసం ఎవరు నిజాయితీగ పూనుకున్నా కావలసిన  శక్తినీ ఇస్తుంది..
మనం చేయాలసిందల్లా మనం చేస్తున్న పనిలో నిజాయితీని కాపాడుకుకోవడమే.
ఆ *భాద్యత ఎవరు తీసుకున్న విజయం తథ్యం.భాద్యత తీసుకోకుండా ఫలితాన్ని ఆశించడం అత్యాశే*..

*ఒక వ్యవస్థ నిర్వహణలో బాగస్థులైన కొంత మంది వ్యక్తులు, వారివ్యక్తిగత ఉపయోగాలకోసం చేసే తప్పులను వ్యవస్థకు ఆపాదించడం కరెక్ట్ కాదు. వ్యవస్థ కూడా వారిపట్ల కొంత జాగ్రత్త వహించాలి* )

*ఆచరింపక చెప్పే వాక్కులకు హక్కు ఉండొచ్చు కానీ శక్తి ఉండదు*.

*ఒక పనికోసం నిజాయితీగా బాధ్యత తీసుకున్న వారు ఒడిపోయినట్టు చరిత్రలో లేదు. భాధ్యతను తీసుకుందాం, విజయాన్ని ముద్దాడుదాం*.

If needed we are always ready to involve, suggestions & Guidelines to any GOOD CAUSE..

Saturday, May 25, 2019

జయహో సాహసవీర@ Thukaram

కనిపెంచిన వారిని ఒప్పించి, మెప్పించి
కనిపించని గమ్యం చేరేవరకు వెనుకకు తిరగక సాగిన నీ పయనం అమోఘం.. అద్వితీయం... అజేయం..💐💐
సంకల్పం మంచిదైతే ప్రకృతి తప్పక సహకరిస్తుందన్న మాట వాస్తవమైన నిజం..
మనం ఏ స్థితిలో ఉన్నా చేయాల్సిన పనిపట్ల/లక్ష్యం పట్ల కనబరిచే శ్రద్దనే ఆ లక్ష్య సాధకు అజేయ శక్తినిస్తుందన్నదీ అంతే నిజం...

అతిసామాన్య స్థితిలో ఉండి అసాధారణ కార్యం సాధింఛిన నీ విషయంలో ఈ రెండు అంశాలు నిజమని నిరూపించావు👍..
సాధకుడిగా నిత్య సాధన కొనసాగించి, సాహసంతో అనుకున్న అతి పెద్ద లక్ష్యాన్ని సాధించిన నీకు శుభాభినందనలు..
మారుమూల తండానుండి ప్రపంచంలో ఎత్తైన ఎవరెష్ట్ శిఖరాన్ని ముద్దాడాలనుకున్న నీ సాహసమే గొప్పది👍. ఆ కల నేరవేర్చుకోవడం కోసం సాగిన నిరంతర ప్రయత్నం ఇంకా గొప్పది..  కల సాకారం చేసుకుని విజేయుడవై నిలవడం ఒక చరిత్ర.... ఈ నీ ప్రయాణంలో నీకు అండదండలు అందించిన అందరికీ, అన్ని వెళలా సహకరించిన ప్రకృతికి కృతజ్ఞుడవై వెల్లిన దారి మరవక తిరిగి చేరిన నీకు శుభాభినందలతో సుస్వాగతం💐...

ఈ రోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఉహించకు.. నిన్ను పుట్టించిన ఆ దేవుడికి🙏 నీ స్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలు...
అధైర్యపడకు👍.

కారణంలేని కలయిక ఉండదు

ఒక కారణం లేకుండా ఏ కలయిక జరగదు....కొన్ని ప్రకృతి నిర్ణయాలు ఇంకా ఖచ్చితంగా జరుగుతాయి..

అనుమానమే అక్కరలేదు..
మన సంకల్పం మంచిదైతే  శక్తి వెతుక్కుంటా వస్తుందనేది పచ్చినిజం..

సంకల్ప సాకారానికి  ఎవరున్నా,లేకున్నా  చిట్టచివరి వరకు నీ దారిలో అడుగులు నీవు వేస్తే.. ఎవరిని ఎప్పుడు కలపాలో, ఎవరి ఎప్పుడు జరపాలో ఆ ప్రకృతి చూసుకుంటుంది. మనం చేయాల్సిందల్లా మన పనిలో నిజాయితినీ కాపాడుకోవడమే..

Wednesday, May 22, 2019

మంచిపని

నీవు, నేను లేకున్నా ఈ ప్రపంచంలో ఏ ఒక్క మంచిపని ఆగదు...
మనమే తప్పనిసరిగా భాగస్థులం కావాలి.
అదే నీ మనస్సాక్షిగా నీవు చేసే పని..

Wednesday, April 10, 2019

Lokasabha Elections _2019

కాలం తనకు కావాల్సిన యోధుల్ని తనే తయారు చేసుకుంటుంది..
ఒక్కో పనికోసం ఒక్కొక్కర్ని...

ఊహ తెలిసిన నాటినుండి ఊపిరి వదిలేవరకు క్షణం క్షణం_ కణం కణం  దేశంకోసమే ఈ దేహమని ఉగ్గుపాలతో దేశభక్తిని  నేర్చిన నీ కంటే దేశభక్తులెవారున్నారు ఈ రాజకీయాలలో..

నిన్ను నీలాగ తయారు చేయడానికి ఎంతమంది సంస్కారమో, ఎందిరి త్యాగమో, మరెందరో సంఘయోదుల నిశ్సబ్ద  సమయ సమర్పణ. 

అదే కాలం ఈ దేశానికిచ్చిన గొప్ప వరం.
కావాలి తప్పక భారతమ్మ జగజ్జేత.... అత్మవిశ్వాసంతో చెపుతున్నాం తప్పక జరుగుతుంది 155 సం.రాల క్రితం వివేకవాణి..
ఆ నరేంద్రుని స్వప్నం ఈ నరేంద్రునితో సాకారం...
తప్పక జరుగును అఖండభారతం.

భారత్ మాతా కి జై.

Friday, November 23, 2018

రాచకొండలో అఖండ జ్యోతి

ఏందో ఏమో.. ఆ రాచకొండ అంటేనే ఒక రకమైన శక్తి తన్నుకొస్తది..
  ఆ కొండ ఎక్కితే ఇంకా ఎనెర్జీ వస్తది.
అందునా ""కార్తీక పౌర్ణమి"" రోజున ""అఖండ జ్యోతి" కోసం అంటే ఎక్కడ లేని ఉత్సాహం, శక్తి..

ఎంత దూరం జరగాలనుకున్నా
ఈ ఆద్యాత్మిక కార్యక్రమాలకే ముడిపడుతుంది..

అసలు ఎక్కడి రాచకొండ..
ఎక్కడి మనము..
అసలెందుకు ఈ సంకల్పం కలిపించాడో ఆ శివయ్య..

ఎప్పుడో 400 స.రాల క్రితం రాచకొండ మీద వెలిగిన జ్యోతి నాలుగేండ్ల క్రితం మా "అఖండ" చే ప్రారంభిoచిన శివయ్య..

రెండేండ్లు వైభవంగా జరిగి, రెండేండ్లు చప్పగా..

ఐదో సారికి అద్బుతం జరిగేలా అప్పుడే శక్తి నిచ్చిన శివయ్య.
వచ్చే కార్తీక పౌర్ణమి ఎప్పుడొస్తదా అని ఎదురు చూసేలా శక్తినిచ్చిన శివయ్యకు శిరసా ప్రణామాలు.

సంకల్పానికి సహకరిస్తున్న సహచర మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు.

మన సంకల్పం పవిత్రమైతే శక్తి వెతుక్కుంటా వస్తది...
____________________________________________

            రాచకొండలో అఖండ జ్యోతి..

ఒకప్పటి తెలంగాణ రాజధాని, ఆహ్లాదకరమైన, ప్రకృతి రమణీయంగా ఎనలేని శక్తిని పెంచే మన రాచకొండ.

400 సం.రాల క్రితం రాచకొండలో వెలిగిన జ్యోతిని గత 4 సం.రాల క్రితం ""వీరపట్నం అఖండ" ఆద్వర్యంలో మల్లీ జ్యోతిని వెలిగించారు..

ప్రతీ సంవత్సరం  వీరపట్నం పెద్ద చెరువులో "గంగమ్మకి హారతి" ఇచ్చి రాచకొండలో "అఖండ జ్యోతిని" వెలిగించే కార్యక్రామన్ని ప్రారంబించింది వీరపట్నం అఖండ.


ఈ సారి@23.11.2018న  కూడా అలాగే వెలిగించారు..

వీరపట్నం అఖండ మరియు రాచకొండ చారిత్రక పర్యావరణ పర్యాటక పరిరక్షణ సమితి(రాచప్ప సమితి) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


వచ్చే సంవత్సరం  మరింత ఉత్సావంతంగా నిర్వహించాలలని  నిర్ణయించారు.

"వీరపట్నం పరిసర 104 గ్రామాలు", మరియు రాచకొండ పరిసర గ్రామాల నుండి ఆఖండ జ్యోతికి తైలాన్ని సేకరించి ఒక మహత్తర కార్యక్రమంగా ఈ ""అఖండ జ్యోతి"" కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించారు.


 ఈ కార్యక్రంలో  వీరపట్నం అఖండ వ్యవస్థాపక అద్యక్షులు సదావెంకట్ రెడ్డి,  పసునూరి శ్రీనివాస్, జల్ల శ్రవణ్ కుమార్ గారు మరియు అజయ్ రెడ్డి  రాచప్ప సమితి నుండి సూరపల్లి వెంకటెష్,  మరికంటి రవీందర్ రెడ్డి,. పగిడోజు దయాకర చారి పాల్గిన్నారు.


సంకల్పించిన కార్యం చిన్నదా, పెద్దదా అన్నది కాదు విషయం.  ఎన్ని అభ్యంతరాలు, అవాంతరాలు ఎదురైనా, సంకల్పించిన కార్యం కోసం కొసదాక కొనసాగడమే అసలైన విజయం...

వీరపట్నం పెద్ద చెరువు నిండి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, రాచకొండ పరిసర ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షింస్తూ సంకల్పించిన మహా కార్యమే ""గంగమ్మకు అఖండ హారతి_శివయ్యకు అఖండ జ్యొతి" కార్యక్రమం.

4 సం.రాల క్రితం కార్తీక పౌర్ణమి రోజు శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపీవిద్యారణ్య పీఠాధీశుకు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ కరకమలములచే ప్రారంభించబడి అందరి సహకారంతో 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తిచేయబడింది.

.4వ  సంవత్సరం కూడా తమ అనుకూలతను బట్టి ఆ మహా కార్యాన్ని పూరిచేసిన "~వీరపట్నం అఖండ""  కార్యకర్తల బృందానికి హృదయపూర్వక శుభాభినందనలు... 

ఈ ప్రాంత వాసులందరి తరపున ధన్యవాదాలు..

హృదయంతో చేసే ఏ కార్యానికైనా కచ్చితంగా ఆ ప్రకృతి కనుకరిస్తది, అనుకూలిస్తది, ఆశీర్వదిస్తది. ..కాస్త ఆలస్యమైనా ఈ మహాకార్యం యొక్క ఫలితాలు ఖచ్చితంగా అందుతాయి...


Sunday, November 11, 2018

Kabaddi Kabaddi Kabaddi

బడ్డీక బడ్డీక బడ్డీక బడ్డీక బడ్డీక...
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి...
కబట్ కబట్ కబట్ కబట్ కబట్.... ఇలా కూతేదైనా...

బాల్యంలో బహు ఆనందంగా, అన్ని తరాల వారందరూ పైసా ఖర్చు లేకుండా  ఆడిన ఆట...
ఆది ఆట మాత్రమే కాదని పరిశీలన, పరిశోధన చేస్తే కాని అర్థం కాదు.
ధైర్యం, సాహసం,తెగింపు లాంటి మానసిక దృడత్వాన్ని పైసా ఖర్చు లేకుండానే మనస్సుకు  ఎక్కించే మహత్తర ఆట.
కాలగమనంలో తన ప్రాచుర్యాన్ని కొంత కోల్పోయింది..  పనికి రాని ఆటలతో పసిపిల్లల మనస్సును, బుద్దినీ హరించే ఆటలెన్నో వచ్చాయ్.. మెల్లగా పోతున్నాయి.
కాల నిర్ణయం ఎప్పుడూ నిర్మాణాత్మకంగానే ఉంటుంది.. కాస్త ఆలస్యమైనా మంచివైపే నిలుస్తుంది.
అందుకే  మన కబడ్ది ఆట మల్లీ చిగురిస్తుంది.. కొన్ని కొత్త అందాలను అద్దుకొని కొత్త పుంతాలు తొక్కుతూ పూర్వవైభవం సాధించే దిశగా సాగుతుంది....
మనమూ ఓ చెయ్యెద్దాం.. అయిన కాడికి కొంత తోడుందాం.  మన పల్లె ఆణిముత్యాల అడ్డా "'సాధన కుటీర్"" లో కొంత ప్రయోగాత్మక ప్రయత్నం చేద్దాం.
మన కబడ్డీ  కూతకు .. ఈలేద్దాం...
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ......