ఏందో ఏమో.. ఆ రాచకొండ అంటేనే ఒక రకమైన శక్తి తన్నుకొస్తది..
ఆ కొండ ఎక్కితే ఇంకా ఎనెర్జీ వస్తది.
అందునా ""కార్తీక పౌర్ణమి"" రోజున ""అఖండ జ్యోతి" కోసం అంటే ఎక్కడ లేని ఉత్సాహం, శక్తి..
ఎంత దూరం జరగాలనుకున్నా
ఈ ఆద్యాత్మిక కార్యక్రమాలకే ముడిపడుతుంది..
అసలు ఎక్కడి రాచకొండ..
ఎక్కడి మనము..
అసలెందుకు ఈ సంకల్పం కలిపించాడో ఆ శివయ్య..
ఎప్పుడో 400 స.రాల క్రితం రాచకొండ మీద వెలిగిన జ్యోతి నాలుగేండ్ల క్రితం మా "అఖండ" చే ప్రారంభిoచిన శివయ్య..
రెండేండ్లు వైభవంగా జరిగి, రెండేండ్లు చప్పగా..
ఐదో సారికి అద్బుతం జరిగేలా అప్పుడే శక్తి నిచ్చిన శివయ్య.
వచ్చే కార్తీక పౌర్ణమి ఎప్పుడొస్తదా అని ఎదురు చూసేలా శక్తినిచ్చిన శివయ్యకు శిరసా ప్రణామాలు.
సంకల్పానికి సహకరిస్తున్న సహచర మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
మన సంకల్పం పవిత్రమైతే శక్తి వెతుక్కుంటా వస్తది...
____________________________________________
రాచకొండలో అఖండ జ్యోతి..
ఒకప్పటి తెలంగాణ రాజధాని, ఆహ్లాదకరమైన, ప్రకృతి రమణీయంగా ఎనలేని శక్తిని పెంచే మన రాచకొండ.
400 సం.రాల క్రితం రాచకొండలో వెలిగిన జ్యోతిని గత 4 సం.రాల క్రితం ""వీరపట్నం అఖండ" ఆద్వర్యంలో మల్లీ జ్యోతిని వెలిగించారు..
ప్రతీ సంవత్సరం వీరపట్నం పెద్ద చెరువులో "గంగమ్మకి హారతి" ఇచ్చి రాచకొండలో "అఖండ జ్యోతిని" వెలిగించే కార్యక్రామన్ని ప్రారంబించింది వీరపట్నం అఖండ.
ఈ సారి@23.11.2018న కూడా అలాగే వెలిగించారు..
వీరపట్నం అఖండ మరియు రాచకొండ చారిత్రక పర్యావరణ పర్యాటక పరిరక్షణ సమితి(రాచప్ప సమితి) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వచ్చే సంవత్సరం మరింత ఉత్సావంతంగా నిర్వహించాలలని నిర్ణయించారు.
"వీరపట్నం పరిసర 104 గ్రామాలు", మరియు రాచకొండ పరిసర గ్రామాల నుండి ఆఖండ జ్యోతికి తైలాన్ని సేకరించి ఒక మహత్తర కార్యక్రమంగా ఈ ""అఖండ జ్యోతి"" కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించారు.
ఈ కార్యక్రంలో వీరపట్నం అఖండ వ్యవస్థాపక అద్యక్షులు సదావెంకట్ రెడ్డి, పసునూరి శ్రీనివాస్, జల్ల శ్రవణ్ కుమార్ గారు మరియు అజయ్ రెడ్డి రాచప్ప సమితి నుండి సూరపల్లి వెంకటెష్, మరికంటి రవీందర్ రెడ్డి,. పగిడోజు దయాకర చారి పాల్గిన్నారు.
సంకల్పించిన కార్యం చిన్నదా, పెద్దదా అన్నది కాదు విషయం. ఎన్ని అభ్యంతరాలు, అవాంతరాలు ఎదురైనా, సంకల్పించిన కార్యం కోసం కొసదాక కొనసాగడమే అసలైన విజయం...
వీరపట్నం పెద్ద చెరువు నిండి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, రాచకొండ పరిసర ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షింస్తూ సంకల్పించిన మహా కార్యమే ""గంగమ్మకు అఖండ హారతి_శివయ్యకు అఖండ జ్యొతి" కార్యక్రమం.
4 సం.రాల క్రితం కార్తీక పౌర్ణమి రోజు శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపీవిద్యారణ్య పీఠాధీశుకు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ కరకమలములచే ప్రారంభించబడి అందరి సహకారంతో 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తిచేయబడింది.
.4వ సంవత్సరం కూడా తమ అనుకూలతను బట్టి ఆ మహా కార్యాన్ని పూరిచేసిన "~వీరపట్నం అఖండ"" కార్యకర్తల బృందానికి హృదయపూర్వక శుభాభినందనలు...
ఈ ప్రాంత వాసులందరి తరపున ధన్యవాదాలు..
హృదయంతో చేసే ఏ కార్యానికైనా కచ్చితంగా ఆ ప్రకృతి కనుకరిస్తది, అనుకూలిస్తది, ఆశీర్వదిస్తది. ..కాస్త ఆలస్యమైనా ఈ మహాకార్యం యొక్క ఫలితాలు ఖచ్చితంగా అందుతాయి...
No comments:
Post a Comment