బడ్డీక బడ్డీక బడ్డీక బడ్డీక బడ్డీక...
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి...
కబట్ కబట్ కబట్ కబట్ కబట్.... ఇలా కూతేదైనా...
బాల్యంలో బహు ఆనందంగా, అన్ని తరాల వారందరూ పైసా ఖర్చు లేకుండా ఆడిన ఆట...
ఆది ఆట మాత్రమే కాదని పరిశీలన, పరిశోధన చేస్తే కాని అర్థం కాదు.
ధైర్యం, సాహసం,తెగింపు లాంటి మానసిక దృడత్వాన్ని పైసా ఖర్చు లేకుండానే మనస్సుకు ఎక్కించే మహత్తర ఆట.
కాలగమనంలో తన ప్రాచుర్యాన్ని కొంత కోల్పోయింది.. పనికి రాని ఆటలతో పసిపిల్లల మనస్సును, బుద్దినీ హరించే ఆటలెన్నో వచ్చాయ్.. మెల్లగా పోతున్నాయి.
కాల నిర్ణయం ఎప్పుడూ నిర్మాణాత్మకంగానే ఉంటుంది.. కాస్త ఆలస్యమైనా మంచివైపే నిలుస్తుంది.
అందుకే మన కబడ్ది ఆట మల్లీ చిగురిస్తుంది.. కొన్ని కొత్త అందాలను అద్దుకొని కొత్త పుంతాలు తొక్కుతూ పూర్వవైభవం సాధించే దిశగా సాగుతుంది....
మనమూ ఓ చెయ్యెద్దాం.. అయిన కాడికి కొంత తోడుందాం. మన పల్లె ఆణిముత్యాల అడ్డా "'సాధన కుటీర్"" లో కొంత ప్రయోగాత్మక ప్రయత్నం చేద్దాం.
మన కబడ్డీ కూతకు .. ఈలేద్దాం...
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డీ......
No comments:
Post a Comment