Thursday, November 8, 2018

పల్లె ఆణిముత్యాల పలకరింపు

పల్లె ఆణిముత్యాలకు పలకరింపు::

మన సంకల్పమే మన ఆయుధం✊

తమ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని "పది"లో సంకల్పం చేసిన పల్లె ఆణిముత్యాలు... ఆ సంకల్ప సాధన లో కొనసాగుతున్నారని భావిస్తున్నా.

అవుసరానికి అన్నీ ఉండి అనుకున్నది  సాధించలేని ఎంతో మంది.. కానీ తమ వెనుకేం లేదు, ముందేం లేదు అయినా ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తా అనుకుంటూ, సాధించి చరిత్రలో కొందరు..
ఆ కోవకు చెందిన వారే మన పల్లె ఆణిముత్యాలు.
అప్పుడెప్పుడో చిన్నప్పుడు .. పదిలో'  మదిలోకొచ్చిందని సంకల్పం చేసిన అనుకోవద్దు.
అదే గొప్ప శక్తి మనకు... ఆ పదిలో తీసుకున్న సంకల్పం సాకారమై ...పది పదింతలై. మనం పంచే దాక ఎదగాలి.

  అవును, సంకల్పానికి లింగ ""భేదం లేదు""  అనుకున్నది ఎన్ని అడ్దంకులు వచ్చిన, ఎన్ని ఆటుపోట్లు వచ్చిన సాధించాలనే ""దృడ చిత్తానికే"" ప్రకృతి సహకరిస్తది.. తల వంచుతది.
పల్లె అణిముత్యాలుగా చేసిన సంకల్పం.. ఆ పల్లెలకు ప్రగతి రథ చక్రాలుగా నిలవాలి.
అంతలేదు అనుకుంటే, కనీసం మన ఇంటి రథ చక్రాలుగా నన్న మారాలి.

కావున అప్పుడు చేసిన సంకల్పానికి కటిబద్దులై సాధన కొనసాగించండి. తప్పక  మన సంకల్పం  సాకారం అవుతది.
అందుకే అంటారు పెద్దలు మన సంకల్పం మంచిది/గొప్పదైతే సహాయం వెతుక్కుంటూ వస్తుందని.
ఆశతో ఉందాం, మన ఆశయానికి అండగా ఉండే అందరి సహకారం తీసుకుందాం. ఆశయం నెరవేరాక అంతే త్వరగా తిరిగిచ్చేద్దాం ( లేకుంటె లావైపోతాం).

:~ సదాశయంతో @సదా.

1 comment: