కనిపెంచిన వారిని ఒప్పించి, మెప్పించి
కనిపించని గమ్యం చేరేవరకు వెనుకకు తిరగక సాగిన నీ పయనం అమోఘం.. అద్వితీయం... అజేయం..💐💐
సంకల్పం మంచిదైతే ప్రకృతి తప్పక సహకరిస్తుందన్న మాట వాస్తవమైన నిజం..
మనం ఏ స్థితిలో ఉన్నా చేయాల్సిన పనిపట్ల/లక్ష్యం పట్ల కనబరిచే శ్రద్దనే ఆ లక్ష్య సాధకు అజేయ శక్తినిస్తుందన్నదీ అంతే నిజం...
అతిసామాన్య స్థితిలో ఉండి అసాధారణ కార్యం సాధింఛిన నీ విషయంలో ఈ రెండు అంశాలు నిజమని నిరూపించావు👍..
సాధకుడిగా నిత్య సాధన కొనసాగించి, సాహసంతో అనుకున్న అతి పెద్ద లక్ష్యాన్ని సాధించిన నీకు శుభాభినందనలు..
మారుమూల తండానుండి ప్రపంచంలో ఎత్తైన ఎవరెష్ట్ శిఖరాన్ని ముద్దాడాలనుకున్న నీ సాహసమే గొప్పది👍. ఆ కల నేరవేర్చుకోవడం కోసం సాగిన నిరంతర ప్రయత్నం ఇంకా గొప్పది.. కల సాకారం చేసుకుని విజేయుడవై నిలవడం ఒక చరిత్ర.... ఈ నీ ప్రయాణంలో నీకు అండదండలు అందించిన అందరికీ, అన్ని వెళలా సహకరించిన ప్రకృతికి కృతజ్ఞుడవై వెల్లిన దారి మరవక తిరిగి చేరిన నీకు శుభాభినందలతో సుస్వాగతం💐...
ఈ రోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఉహించకు.. నిన్ను పుట్టించిన ఆ దేవుడికి🙏 నీ స్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలు...
అధైర్యపడకు👍.
No comments:
Post a Comment