నినదించి, సాధించిన సాధకులకు సదా ప్రణామాలు..
అలాంటి అదృష్టం చాలా అరుదు. అయినా అది అదృష్టమందమా, కాల నిర్ణయమా, సంకల్పబలమా....
అసలు అది ఊహకందని ఆలోచనే, అసాధ్యం అని అందరూ అనుకున్న పని... సంకల్పించి, పిడికిలెత్తి, నినదించిన కలను సాకారం చేసుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు.
ఆ సంకల్పంలో పవిత్రత, నిజాయితీ ఉంటే గాని ఆ ప్రకృతి సహకరించదు..
ఏదేమయినా మన కాశ్మీరం కర్కషుల కబంద హస్తాలనుండి విముక్తి కాబోతుంది. నిత్యం గర్షన ఘోషనలతో రోదించిన ఆ కాశ్మీరపు నేలతల్లి నిత్య మంగళాలతో హారతులు అందుకోనుంది.
ఆ దృశ్యాన్ని అప్పుడే ఊహించిన యుగద్రష్టలకు ప్రణామాలు..
అందాల కాశ్మీరమా కల్లోలమాయే తమ్ముడా అనే పాటనుండి అందాల కాశ్మీరమూ కమనీయమాయె తమ్ముడా అనే పాఠ పాడే సమయం ఆయా హై..
నినదించి, సాధించిన సాధకులకు సదా ప్రణామాలు.
No comments:
Post a Comment