Sunday, July 24, 2022

నీవు నిరాశ పడకుంటే చాలు.

నీ విజయానికై..ఎవ్వడు నిన్ను పిలిచి తివాచీ పరచడు*.

ఒడివుతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం...
*****************************************
                                
*నీవు నిరాశ పడకుంటే చాలు*...
నిరంతరం ప్రయత్న శీలికి
ఒకటి కాకపోతే..వంద మార్గాలు..
ఆకాశమంత అవకాశాలు..నిరంతరం ఆహ్వానం పలుకును

ఒక్కదానితో తృప్తి పడే అవకాశం దొరికినోడు
అభివృద్ధి కుంటుబడి అక్కడే ఆగిపోవును
వాడిజీవితం ఓ మ్రొక్కుబడిగా సాగుతుండును
కుక్కిన పేనువలె ఓ చోట పడిఉండును

చిన్నపాటి అవకాశాన్ని అదృష్టంగా భావించినావంటే..
నీ బ్రతుకు బానిస వలె బంధీ కాబడును
అలాకాకుండా...
నిత్యం అప్పుడే రెక్కలు తొడిగిన సీతాకోకచిలుక వలే
పరవశం చెందుతూ ప్రకృతిలో ని అందాలను తిలకిస్తున్నట్లుగా...సమాజంలో తిరుగాడుతుండాలి

నీ విజయానికై ఎవ్వడూ కూడా
మరీ నిన్ను పిలిచి పిలిచి తివాచీ పరచడు
అవకాశం దొరికితే...
తనవాడు,మనవాడనకుండా నవ్వుతూనే
హేళన చేయచూసెదరు

*అతిగా ఎదురుచూడని మనిషి...    అనవసరంగా సహాయాన్ని అర్తించని మనిషి, క్రమక్రమంగా తను శక్తివంతుడిగా ఎదుగుతూ*.. *తనతోపాటు ఓ నలుగురిని ఉద్ధరించడమే
తన కర్తవ్యంగా భావిస్తూ ఆ దిశవైపు... నిశ్చబ్ధంగా తన నిర్ణయం ప్రకారం పయనించును*

చెదరని చిరునవ్వే...
తన చిరునామాగా తెలుపుతూ
నివురు కప్పిన నిప్పు వలే...
*లోలోపల మనసులో నిప్పును నిరంతరం రాజేస్తూ.. విజయాన్ని ముద్దాడే వరకు*.
*నీకు నీవే రాజీలేని పోరాటాన్ని కొనసాగించాలి*
ఓ బ్రహ్మాండమైన సామ్రాజ్యాన్ని/ వ్యవస్థను స్థాపించాలి.

*ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం*...
గెలువాలనుకున్నవాడు పోరాటం నుండి తప్పుకోడు, పోరాటంలో ఉన్నవాడు ఎప్పటికైనా గెలుస్తాడు.

:~ జయమగుగాక.
~~~~~~~~~~~~~ 

No comments:

Post a Comment