చిరుజల్లులను స్వాగతిస్తూ, నిండుగా పారే వాగులకై ఎదురుచూస్తూ, చిన్న అలలను పైకి ఎగదోస్తూ మహా సముద్రంలా మాయ చేస్తున్న మన #వీరపట్నం #పెద్దచెరువు.
రెండేళ్ల క్రితం కురిసిన వానకు నీటితో నిండుగా మారిన #పెద్దచెరువు ఈ సారి కురిసే వానలకు పొంగి పొర్లుతూ మనందరికీ ఆనందాన్ని పంచాలని, ఇంకో పదేళ్ళకు కావలసిన జలదారను తన పరిసరాలను పంచాలనీ ఆశిద్దాం.
బోలో #గంగామాతాకిజై.
************************
ఇప్పుడు కురుసుతున్న వానలకు సoతోషపడుతూ.... మనతో
మన పెద్దచెరువు మాట-మoతి.
ఒరేయ్... బాబులూ..
ఎన్నో ఏళ్లుగా ఎండిన నేను, రెండేళ్ల క్రితం కురిసిన వానలతో నా ఒడిని నింపుకున్నా... నాతో పాటు మీరూ ఆనంద పడుతున్నారుగా....
అయినా ఎదో వెలితిరా బాబులు..
ఎన్నో ఎకరాల్లో ఉన్న నన్ను ఎక్కడికక్కడా, కొద్ది కొద్దిగా, మెల్ల మెల్లగా కబ్జాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లే.. అది మీకే నష్టoరా అని చెప్పినా అర్థం అవుతలేదు.
నా కడుపున మొలిసిన కలుపు మొక్కలు@ అవే #సర్కారుతుమ్మలు కొట్టండిరా, నేను నా ఒడి నిoపుకుని *మన బెస్తల వృత్తికి ఊతమిస్తా* అని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలే, ఇప్పుడు చూడండి మా #వరుణడు, #గంగమ్మ పదురుకుని ఎలా ఆడుకుంటున్నారో...
దూరంగా, అక్కడక్కడా పడ్డ వర్షపు నీరు వాగుల గుండా అచ్చి నా ఒడిన దాచుకుంటా ఉంటే, అక్కడక్కడ మోసంతో ఆ వాగులనూ మూస్తిరి, ఆ మోసం ఎల్లకాలం అట్లనే సాగదురా అంటే వినకుంటిరి...
మా వరుణుడికి ఒక్కసారి గట్టిగా కోపం వస్తే మీ మోసాలకు మొదటికే మోసం వస్తది.....
మీ వల్ల చుట్టుపక్కలున్న అమాయక రైతులకే నష్టం ఎక్కువ జరుగుతదoటే వినకపోతిరి... ఎందుకంటే చుట్టుపక్కల భూమ్మీద పడ్డ గoగమ్మ ఎవరి మాట వినకా, పారుకుంటా, పారుకుంటా, పారుకుంటా... నా ఒడిలోకే వచ్చి చేరుతది.
ఆ విషయం మీకూ ముందే చెప్పారు పెద్దలు *బెహతా హువా పానీ కుధీ అప్నా రాస్తా బనాలేతా* అని..
ప్రవహిoచే గంగమ్మను అవడం ఎవరి తరమూ కాదు, దారి చూపడం కూడా కష్టమే.. అందుకే మీరు ముందే జాగ్రత్త పడాలి మరి...
అయినా అతి కష్టంగా, నా ఒడిన చేరిన నీటితో మీకే ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తానని తెలిసినా..... నా ఒడిలోని నీటిని కాపాడలేకున్నారు మీరు..
అక్కడక్కడా పొక్కలుపడి నీరు జారిపోతున్నా.. ఆపుకుని, కాపాడుకుందామన్న సోయిలో మీరు లేరు....
#ఒక్కTMC కూడా పట్టవు నీ ఒడిన అన్న ఎగతాలా లేక నీ చుట్టూతా నీ సాయంతో చేసే వ్యవసాయం బంద్ చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నామన్నా పొగరా*...
అది ఏదైనా మీకే నష్టంరా బాబులు..
నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటేనే మీకూ ఆనందం, ఆహ్లాదం పంచుతా..
పైనుండి మా శివయ్య పంపిన ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టి, నా పొట్టన దాచుకుంటే మీకే కాదు, రేపటి మీ తరానికీ ఓ నీటి గుమ్మినవుతా... చరిత్రలో చిరస్తాయిగా ఈ ప్రాంతానికి ఓ పేజీ ఇప్పిస్తా...
అందుకే ఆ శివయ్య అనుగ్రహించి పంపే ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టి నా ఒడిలో నింపoడి....దాచoడి......కాపాడుకోoడీ.
కాదు, లేదు, కూడదు అంటే ఇగ మీ ఇష్టం
:~ మీ #వీరపట్నం #పెద్దచెరువు.
No comments:
Post a Comment