Friday, July 29, 2022

గులాబీ వేర్లల్లో భద్రం

అక్రమంగా కూల్చబడ్డ సాధన కుటీర్ వివేక మండపం గోడ ఇటుకల కింద నుండి తీసి, దాచి ఇంకోచోట నాటిన కాశ్మీరీ గులాబీ మొక్కల నుండీ గులాబీలు..
కూల్చిన ఇటుకలు తన కొమ్మలపై పడి నలిపేసిన  తతంగమoతా ఇప్పుడు వేర్లల్లో భద్రంగా దాచుకున్నాం.. ప్రతి ఆదివారం భారత మాతా హారతి అర్పణకోసం మేం సిద్ధం అంటున్న గులాబీలు..

Sunday, July 24, 2022

*పేరు భలమేమో*

ద్రౌపది...
అది పేరుకున్న భలమేమో..
చిన్నప్పుడు బడి తరగతిలో పెబ్బ(Monitor), ఇప్పుడు దేశానికీ పెబ్బ(Rashtrapathi).

ఆ సదృడ సంకల్పం, దృఢ చిత్తం, మానసిక పరిపక్వతనే అందలం ఎక్కించేమో..
ఆ గుణాలన్నీ గొప్పవి, అవి గుర్తించిన గణాలు ఇంకా గొప్పవి..
శుభాకాంక్షలు ద్రౌపది ముర్ము జీ💐..
 ఇవి *దేశానికి మంచి రోజులు, అఖండ భారతానికి పునాదులు..శుభం.*

అందరూ వందనీయులే

అందరూ వందనీయులే🙏...

సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను సందర్శించినప్పుడు ఆశ్చర్యానందాలు కలుగుతయ్....
ఆ దేవ దేవున్ని దగ్గరగా చూస్తున్నందుకు కొంత అనందం... అంతకంటే రెట్టింపు ఆశ్చర్యం ఆ ఎత్తైన కొండల్లో వందల, వేల సంవత్సరాల క్రితమే అద్బుతమైన కళాత్మక దృష్టితో,  శిల్పకళతో చెక్కిక అద్బుత శిల్పాలను చూస్తే కలుగుతుంది.    ఎత్తైన కొండలకు ఎక్కడానికి దారి చెక్కడంతో పాటు  అక్కడకు వచ్చే ప్రతీ వ్యక్తి అవసరాలను తీర్చేవిధంగా చేసిన ఏర్పాట్లు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది.
అవుసరానికి అన్ని వనరులున్న నేటి రోజుల్లోనే పనికి కష్టంగా ఉంటే..  ఏ వనరులు లేని ఆ రోజుల్లో ఆ పెద్దాళ్లు ఎంత కష్టపడ్డారో రేపటి తరంకోసం అనే ఆలోచన. తమ నిండు జీవితాన్ని ఒకే పనికి పూర్తిగా అర్పించి చేస్తే కాని అలాంటి అద్బుత కట్టడాలు జరిగుండవు.. అందుకే అలాంటి సమర్పణా భావంతో చేసిన వారందరూ వందనీయులే ఎప్పటీకి...
లక్శ్యం శిబిర బృందతో కలిసి మన్యంకొండ, యాగంటి, మహానంది వంటి ఫ్రాంతాలను చూసినప్పుడు కలిగిన స్పందన.  ఆవి ఎన్ని సార్లు సందర్శించినా అలాంటి భావనే..

Swimming _ ఈత

ఈతో ఈత ....ఈతో ఈత.

అబ్బబ్బా ఎన్నాళ్ళ కెన్నాల్లకో..
కాదు కాదు..
ఎన్నేండ్లకెన్నేండ్లకో...

తినక ముందు_ యాగంటిలో....
తిన్న తర్వాత_మహానందిలో..

ఈతో...ఈత... మహా ఈత

తనివితీరా గంగమ్మ ఒడిలో పొర్లాడిన రోజులు...

25 ఏండ్ల కింద కొన్ని రోజులు, నెలల  పాటు ప్రతిరోజు అమె ఒడిలో ఎవరు వద్దన్నా ముద్దు ముద్దుగా ఎగిరి దుంకేది..

తిన్నా తినకపోయినా, ఎవరు వద్దన్నా... ఎందరో తిట్టినా ఈతకోసం పొయినమంటే ఇగ రోజంతా అక్కడే..

బావుల నిండా నీల్లే నీల్లు... ఆ నీల్లను చూస్తే మనసేమో ఎగిరి గంతేస్తుండే...ఇప్పటికీ అంతే అనుకొండి.

ఇప్పుడూ అదే జరిగింది.. లక్ష్యం శిబిర బృందంతో యాత్రా.. అంతా యువకులు .. ఊరుకుంటారా..  ఇగ ఈతో ఈత ఈత.

ఒకే రోజు తనవి తీరా గంగమ్మ ఒడిలో పొర్లాట..

ఈత కొడుతున్నంత సేపు మన ఫూర్వులే జ్ఞాపకం

లోకమంతా నీటి కొరతతో ఇబ్బందిపడుతుంటే.. మన రెండు క్షేత్రాల్లో నిండుకుండలా చల్లటి_ తెల్లటి నీళ్ళే నీళ్ళు.. అంతటి గొప్ప బాగ్యాన్ని లోకానికిచ్చిన మన ఋషి మునులకు దండం పెట్టకుండా ఉంటామా..

వారెప్పటికీ వందనీయులే..

ఈత కొట్టడంలో నేనెక్కడనా డౌట్.. జాగ్రత్తగా చూడండి.. తెల్లటి బనియన్ తో ఉల్టా డైఫ్ కొడుతున్న కుర్రోన్ని నేనే... నేనే

@ Yaganti_Kurnool

Kashmir Article 370, 35A

నినదించి, సాధించిన సాధకులకు సదా ప్రణామాలు..
అలాంటి అదృష్టం చాలా అరుదు. అయినా అది అదృష్టమందమా, కాల నిర్ణయమా, సంకల్పబలమా....
అసలు  అది ఊహకందని ఆలోచనే,  అసాధ్యం అని అందరూ అనుకున్న పని... సంకల్పించి,  పిడికిలెత్తి, నినదించిన కలను సాకారం చేసుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు.
ఆ సంకల్పంలో పవిత్రత, నిజాయితీ ఉంటే గాని ఆ ప్రకృతి సహకరించదు..
ఏదేమయినా మన కాశ్మీరం కర్కషుల కబంద హస్తాలనుండి విముక్తి కాబోతుంది. నిత్యం గర్షన ఘోషనలతో రోదించిన ఆ కాశ్మీరపు నేలతల్లి నిత్య మంగళాలతో హారతులు అందుకోనుంది.
ఆ దృశ్యాన్ని అప్పుడే ఊహించిన యుగద్రష్టలకు ప్రణామాలు..
అందాల కాశ్మీరమా కల్లోలమాయే తమ్ముడా అనే పాటనుండి అందాల కాశ్మీరమూ కమనీయమాయె తమ్ముడా అనే పాఠ పాడే సమయం ఆయా హై..

నినదించి, సాధించిన సాధకులకు సదా ప్రణామాలు.

*సత్సంకల్పం*

సమాజ హితంకోరి  జరిగిన సత్సంకల్పాన్ని,  సదాశయాన్ని  అడ్డుకోవడo, నాశనం చేయడం ఎవరి తరమూ కాదు. ఆ సంకల్పo ఎవరిద్వారా జరిగినా,
అది ప్రకృతి ప్రేరేపితం.

నీవు నిరాశ పడకుంటే చాలు.

నీ విజయానికై..ఎవ్వడు నిన్ను పిలిచి తివాచీ పరచడు*.

ఒడివుతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం...
*****************************************
                                
*నీవు నిరాశ పడకుంటే చాలు*...
నిరంతరం ప్రయత్న శీలికి
ఒకటి కాకపోతే..వంద మార్గాలు..
ఆకాశమంత అవకాశాలు..నిరంతరం ఆహ్వానం పలుకును

ఒక్కదానితో తృప్తి పడే అవకాశం దొరికినోడు
అభివృద్ధి కుంటుబడి అక్కడే ఆగిపోవును
వాడిజీవితం ఓ మ్రొక్కుబడిగా సాగుతుండును
కుక్కిన పేనువలె ఓ చోట పడిఉండును

చిన్నపాటి అవకాశాన్ని అదృష్టంగా భావించినావంటే..
నీ బ్రతుకు బానిస వలె బంధీ కాబడును
అలాకాకుండా...
నిత్యం అప్పుడే రెక్కలు తొడిగిన సీతాకోకచిలుక వలే
పరవశం చెందుతూ ప్రకృతిలో ని అందాలను తిలకిస్తున్నట్లుగా...సమాజంలో తిరుగాడుతుండాలి

నీ విజయానికై ఎవ్వడూ కూడా
మరీ నిన్ను పిలిచి పిలిచి తివాచీ పరచడు
అవకాశం దొరికితే...
తనవాడు,మనవాడనకుండా నవ్వుతూనే
హేళన చేయచూసెదరు

*అతిగా ఎదురుచూడని మనిషి...    అనవసరంగా సహాయాన్ని అర్తించని మనిషి, క్రమక్రమంగా తను శక్తివంతుడిగా ఎదుగుతూ*.. *తనతోపాటు ఓ నలుగురిని ఉద్ధరించడమే
తన కర్తవ్యంగా భావిస్తూ ఆ దిశవైపు... నిశ్చబ్ధంగా తన నిర్ణయం ప్రకారం పయనించును*

చెదరని చిరునవ్వే...
తన చిరునామాగా తెలుపుతూ
నివురు కప్పిన నిప్పు వలే...
*లోలోపల మనసులో నిప్పును నిరంతరం రాజేస్తూ.. విజయాన్ని ముద్దాడే వరకు*.
*నీకు నీవే రాజీలేని పోరాటాన్ని కొనసాగించాలి*
ఓ బ్రహ్మాండమైన సామ్రాజ్యాన్ని/ వ్యవస్థను స్థాపించాలి.

*ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం*...
గెలువాలనుకున్నవాడు పోరాటం నుండి తప్పుకోడు, పోరాటంలో ఉన్నవాడు ఎప్పటికైనా గెలుస్తాడు.

:~ జయమగుగాక.
~~~~~~~~~~~~~ 

Friday, July 22, 2022

శరనుకోరు తల్లిని

చరణాలకు  ప్రణమిళ్ళీ శరనుకోరు తల్లిని🙏...
సంఘర్షణ సమయానికి శక్తి వరము లిమ్మనీ...
శక్తి వరము లిమ్మనీ...

*జీవితం ఓ సాధన*


*కష్టాన్ని నిలువరించే సులభోపాయాలేమీ లేవు, అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవు*.
నష్టం అనగానే కన్నీళ్లు ఉంటాయి, కలతపడటమూ ఉంటుంది. *దానికి నివారణోపాయం మనోధైర్యంతో ఎదుర్కోవడమే 
సంయమనంతో సమాధానపడటమే.*
అప్పుడు స్థిరంగా పాతుకుపోతుందనుకుని భయపడిపోయిన *మేరు పర్వతమంత కష్టమైనా కదిలిపోతుంది,ఎగిరిపోతుంది.*  *కష్టం కాలంలాంటిది. కదలడమే దాని లక్షణం. కదిలిపోవడమే దాని స్వభావం. కాలంతోపాటు ఆ కాలంలో సంభవించిన కష్టమూ కదిలిపోతుంది.*

జీవితం చాలా విలువైంది 
నిజానికి విలువ కట్టలేనిది 
జీవితంలోని ప్రతిక్షణం కూడా
ఏ కష్టం దాని విలువను తగ్గించగలదు?.

మనం లోతుగా ఆలోచించాలి.
కష్టాలు, కన్నీళ్లు... 
ఇవన్నీ అధిగమించగలిగినవి          *కాలం అంటే క్షణాల కూర్పు. క్షణాల మార్పు. ఏ శక్తీ ఏ క్షణాన్నీ ఆపలేదు.* *కరిగిపోయేదాని కోసం, కదిలిపోయే దానికోసం మన ప్రయాణం మన ప్రగతి ఆగిపోకూడదు.*

ఏ కష్టం కోసమైనా సరే
జీవితం తాలూకు ఏ క్షణాన్ని పోగొట్టుకోకూడదు.      కాలంలో సంభవించిన ఏ కష్టమైనా సరే              దానితోపాటు కదిలిపోతూనే ఉంటుంది.
కొత్త క్షణం వస్తుంది.
దానితోపాటే కొంత సుఖం రావచ్చు.
కొత్త సుఖం రావచ్చు. పోనీ...
కనీసం కొత్త కష్టమైనా రావచ్చు.
వచ్చి స్థిరపడిపోతుందని భయపెట్టిన
కష్టం కంటే కొత్త నష్టం కొంత మేలుకదా ?
అలవోకగా వచ్చిన కష్టానికి అవగాహనలేక...          ఆయాసపడి ఆగిపోతే- లోకంలో భగవంతుడిచ్చిన
జీవితాన్ని పూర్ణంగా జీవించేవాడే ఉండేవాడు కాదు.
లోకంలో విజేత అనేవాడు ఒక్కడూ ఉండేవాడు.
కాదు. మార్పు ప్రకృతి సహజం *
రుతువులు మారతాయి *
రాత్రింబవళ్లు మారతాయి 
సూర్యచంద్రులూ. మారనిదేదీ లేదు.
మార్పే జీవితం! జీవితం అంటే కూడా మార్పే...
పిల్లలు పిల్లకాలువలో వేసిన
కాగితపు పడవలా కాలం కదిలిపోతుంది.
మనం పిల్లల్లా వినోదంగా చూడాలి.
వాళ్లకు తెలుసు. పడవ చాలా కష్టపడి చేశామని         నీళ్లలో వదిలేస్తే కాసేపటికి మునిగిపోతుందని  తడిసిపోతుందని. అయినా ......
క్రీడావినోదం కావాలంటే
ఆ కష్టానికి వెరవకూడదు.
ఆ నష్టానికి బెదరకూడదు. సిద్ధపడే ఉండాలి.
పిల్లలు మునిగిపోతున్న పడవకేసే చూస్తూ            బాధపడుతూ కూర్చోరు. పరుగున వెళ్లి
మరో కాగితం తెచ్చుకొని మరో పడవ తయారుచేస్తారు.
టైటానిక్‌ చేసినంత ఉత్సాహంతో.
మనం పిల్లలపాటి చేయమా ?
ఆ మాత్రం అనర్థాలను
ఆటంకాలను అధిగమించలేమా ?
దేవుడు ఈ క్షణాన్ని యథాతథంగా అనుభవించమన్నాడేగానీ క్షణంలోనే
స్థిరంగా ఉండిపొమ్మని చెప్పలేదు 
అది సుఖమైనా, కష్టమైనా 
కష్టాన్ని కదిలిపోతున్న
క్షణంతోపాటు మరచిపోవాలి.
కదిలిపోతున్న క్షణాన్ని మనం
మూర్ఖత్వంతో ఆపివేస్తున్నాం.
పదేపదే ఆ క్షణాన్ని, అది ఇచ్చిపోయిన కష్టాన్ని నెమరువేసుకుంటూ అనుభవిస్తున్నాం.
అది సరికాదు.

మనముందు ఎవరూ ఆపలేని
మరో అద్భుత క్షణం ఉంది. 
మరెన్నో అమృత క్షణాలున్నాయి 
వాటికి అవకాశం ఇస్తూ గడిచిపోయిన
క్షణాన్ని సంతోషంగా సాగనంపుదాం.
*నెమరువేసే అలవాటు పశువులది. మనది కాదు*
 నెమరేయాలనిపిస్తే  సంతోషాలను నెమరేసుకో.. నీకు ఉత్సాహo వస్తుంది... ఇంకొందరికి స్ఫూర్తి దొరుకుతుంది.

చరణాలకు  ప్రణమిళ్ళీ శరనుకోరు తల్లిని🙏...
సంఘర్షణ సమయానికి శక్తి వరము లిమ్మనీ...
శక్తి వరము లిమ్మనీ...

అవార్డులు_దైవ నిర్ణయం.


దైవ నిర్ణయాన్ని శిరసావహించాలసిందే..    ఒక బడిలో ఒక్క విగ్రహం పెడతాం అంటే అడ్డుకుoటే... ఒకే ముహూర్తానికి 108 బడుల్లో 108 సరస్వతి మాత విగ్రహాలు పెట్టె శక్తినిచ్చి మాచే రికార్డులు అందుకునేలా చేసిన అమ్మవారు🙏... అడ్డoకులలోనే  అందనంత ఎత్తుకు ఎదికే అవకాశాలను ఇస్తుంది ప్రకృతి. అవకాశం అందిపుచ్చుకోవడమే సాధకుని లక్షణం కావాలి.

సమాజకార్యo - ఉపకరణం

సమాజాహితం కోరి సంకల్పించిన ప్రతీ కార్యానికి ఉపకరణాలను ఆ ప్రకృతే వెతుక్కుంటుంది, తయారు చేసుకుoటుంది, పని పూర్తిచేసుకుoటుంది..
ఆ ఉపకరణాలలో  మనమూ ఉంటే, అదో అద్భుత అవకాశమే..

Wednesday, July 13, 2022

వీరపట్నం పెద్దచెరువు మాట

చిరుజల్లులను స్వాగతిస్తూ, నిండుగా పారే వాగులకై ఎదురుచూస్తూ, చిన్న అలలను పైకి ఎగదోస్తూ మహా సముద్రంలా మాయ చేస్తున్న మన #వీరపట్నం #పెద్దచెరువు.
    రెండేళ్ల క్రితం కురిసిన వానకు నీటితో నిండుగా మారిన  #పెద్దచెరువు ఈ సారి కురిసే వానలకు పొంగి పొర్లుతూ మనందరికీ ఆనందాన్ని పంచాలని, ఇంకో పదేళ్ళకు కావలసిన జలదారను తన పరిసరాలను పంచాలనీ ఆశిద్దాం.
బోలో #గంగామాతాకిజై.
************************

ఇప్పుడు కురుసుతున్న వానలకు సoతోషపడుతూ.... మనతో
మన పెద్దచెరువు మాట-మoతి.

ఒరేయ్... బాబులూ..
ఎన్నో ఏళ్లుగా ఎండిన నేను, రెండేళ్ల క్రితం కురిసిన వానలతో నా ఒడిని నింపుకున్నా... నాతో పాటు మీరూ ఆనంద పడుతున్నారుగా....
అయినా ఎదో వెలితిరా బాబులు..

ఎన్నో ఎకరాల్లో ఉన్న నన్ను ఎక్కడికక్కడా, కొద్ది కొద్దిగా, మెల్ల మెల్లగా కబ్జాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లే.. అది మీకే నష్టoరా అని చెప్పినా అర్థం అవుతలేదు.

నా కడుపున మొలిసిన కలుపు మొక్కలు@ అవే #సర్కారుతుమ్మలు కొట్టండిరా, నేను నా ఒడి నిoపుకుని *మన బెస్తల వృత్తికి ఊతమిస్తా* అని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలే,  ఇప్పుడు చూడండి మా #వరుణడు, #గంగమ్మ  పదురుకుని ఎలా ఆడుకుంటున్నారో...

దూరంగా, అక్కడక్కడా పడ్డ వర్షపు నీరు వాగుల గుండా అచ్చి నా ఒడిన దాచుకుంటా ఉంటే, అక్కడక్కడ మోసంతో  ఆ వాగులనూ మూస్తిరి, ఆ మోసం ఎల్లకాలం అట్లనే సాగదురా అంటే వినకుంటిరి...
మా వరుణుడికి ఒక్కసారి గట్టిగా కోపం వస్తే మీ మోసాలకు మొదటికే మోసం వస్తది.....
మీ వల్ల చుట్టుపక్కలున్న  అమాయక రైతులకే నష్టం ఎక్కువ జరుగుతదoటే వినకపోతిరి... ఎందుకంటే చుట్టుపక్కల  భూమ్మీద పడ్డ గoగమ్మ ఎవరి మాట వినకా, పారుకుంటా, పారుకుంటా, పారుకుంటా...  నా ఒడిలోకే వచ్చి చేరుతది.
ఆ విషయం మీకూ ముందే చెప్పారు పెద్దలు *బెహతా హువా పానీ కుధీ అప్నా రాస్తా బనాలేతా* అని..
ప్రవహిoచే గంగమ్మను  అవడం ఎవరి తరమూ కాదు, దారి చూపడం కూడా కష్టమే.. అందుకే  మీరు ముందే జాగ్రత్త పడాలి మరి...
అయినా అతి కష్టంగా, నా ఒడిన చేరిన నీటితో మీకే ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తానని తెలిసినా..... నా ఒడిలోని నీటిని కాపాడలేకున్నారు మీరు..   
అక్కడక్కడా పొక్కలుపడి నీరు  జారిపోతున్నా.. ఆపుకుని, కాపాడుకుందామన్న సోయిలో మీరు లేరు....

#ఒక్కTMC కూడా పట్టవు నీ ఒడిన అన్న ఎగతాలా    లేక          నీ చుట్టూతా నీ సాయంతో చేసే వ్యవసాయం బంద్ చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నామన్నా పొగరా*...
అది ఏదైనా మీకే నష్టంరా బాబులు..

నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటేనే మీకూ  ఆనందం, ఆహ్లాదం పంచుతా..

పైనుండి మా శివయ్య పంపిన ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టి, నా పొట్టన దాచుకుంటే మీకే కాదు,  రేపటి మీ తరానికీ ఓ నీటి గుమ్మినవుతా... చరిత్రలో చిరస్తాయిగా ఈ ప్రాంతానికి ఓ పేజీ ఇప్పిస్తా...

అందుకే ఆ శివయ్య అనుగ్రహించి పంపే ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టి నా ఒడిలో నింపoడి....దాచoడి......కాపాడుకోoడీ.
కాదు, లేదు, కూడదు అంటే ఇగ మీ ఇష్టం

:~ మీ #వీరపట్నం #పెద్దచెరువు.

Friday, July 1, 2022

అంజీర్ చెట్టు @ కుటీర్

*రెoడేళ్ళ క్రితం సాధన కుటీర్ లో బండరాళ్ళ మధ్య నాటిన అంజీర్ మొక్క, చెట్టయి కాయలు కాయడం మొదలు పెట్టింది. ఎండిన అంజీర్ తినడమే కానీ, ఆ చెట్టును- పండును ప్రత్యoక్షగా చూడటo ఇదే మొదటిసారి.*
అన్ని కాయలు చెట్టు కొమ్మలకి కాస్తే, ఈ అంజీర్ చెట్టు మొదట్లో కాయ కాసింది.. మొత్తం తెలవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనేమో.
బండరాళ్లలో నాటుతున్న ఈ మొక్కలు ఎదగడo చాలా కష్టం అన్నవారు ఆశ్చర్యపోయే విషయమే ఇది.
Credit goes to SADHAKS @ Sadhana Kuteer.

ఆవగింజoత ధర్మనిష్ఠ- గుండెనిండా నమ్మకం చాలు.

నమ్ముకున్న #దేవుడికి గుడి కట్టాలంటే గుమ్మినిండా సంపదే ఉండాల్సిన అవసరమేమి లేదు -  #గుండెనిండానమ్మకం, #ధర్మoపట్ల ఆవగింజoత #నిష్ఠ ఉంటే చాలు....  అనే మాటలకు ప్రత్యక్ష ఉదాహరణగా ఈ లింగాలగుట్ట కోదండం గారు...

కడుపేదరికo  వెంటాడుతున్నా, వెంట ఎవరూ లేకున్నా తమ ఆరాధ్య దేవతలకోసం కట్టిన గుడులకు నాయకత్వం వహించిన కోదండం గారు...

#శ్రీశైలం వెళ్లే దారిలో, క్షేత్రానికి 18 కిలో మీట్లర్ల ముందే ఉన్న  #లిoగాలగుట్టవద్ద పాతాలగంగమ్మ తీరాన నమ్ముకున్న నలుగురి దేవతలకు నాలుగు చిన్న చిన్న #గుడులు కట్టి, తనతో పాటు తనవాళ్లకు #సనాతనధర్మం పట్ల  నిష్ఠ ఉండేలా చేస్తున్న మన కోదండానికి అందరం దండం పెట్టాలసిందె..
అక్షరం జ్ఞానం అసలేమాత్రం లేకున్నా ఆ దైవ కృపతో అందరికీ దీక్షలిస్తూ, #దైవంపట్లభక్తిని, #ధర్మంపట్లనిష్ఠను పెంచుతూ తమ పనుల్లో నిమగ్నమయ్యే మార్గాన్ని చూపుతున్నాడు..
తన ఒడిలో నిత్యం ఓలలాడిస్తూ తమ జీవితానికి భరోసానిచ్చిన ఆ #గంగమ్మతల్లిని నిత్యం ఆరాదించేoదుకు #పాతాళగంగ ఒడ్డున  
 ఓ చిన్న గుడిని నిర్మించే పనిలో ఉన్నాడు మన కోదండం గారు.
ఎంత బీదరికంలో ఉన్నా తన పరిచయంలోకి వచ్చిన వ్యక్తికి తమ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిపంపుతుంది మా ఆవిడ, ఆమె సహకారం నాకు ఈ పనుల్లో కొండంత అంటూ ఆమె గురించి చెపుతూ అనందపడడం గమనించిన అంశం..
వాళ్ళవిడ సహకారం  గురించి #కోదండం గారు  చెపితే, ఆ లింగాలగుట్టకు కోదండం గారు చేస్తున్న సేవలు చెప్పడానికి పక్కనే ఉన్నాయన చూపిన ఉత్సాహం ఆయనకు పని పట్ల ఉన్న శ్రద్ధను తెలిపింది.
  పాతాళగంగ ఒడ్డున ఉన్న #లింగాలగుట్టలో సుమారు 400 కుటుంబాలు  చేపల  వ్యాపారంతో జీవనోపాధి పొందుతున్నారు..
అందుకోసo ఓ రెండేళ్ల క్రితం గంగమ్మతల్లి కలలో కొచ్చి ఎదో చెప్పినట్టు అనిపిస్తే, అది ఆమె ఆజ్ఞగా బావిoచి చిన్న గుడి కట్టాలనే సంకల్పంతో పని మొదలెట్టాడు...
#పాతాలగంగ అడుగుబాగాన ఉన్న మెట్ల నుండి 25 పీట్ల ఎత్తులో #గంగమ్మ ఉండేలా, ఓ నాలుగు పిల్లర్లు, రాళ్లలో వేసి వృత్తాకారంలో అమ్మవారికి ఓ గూడు(గుడి) కట్టే పనిలో ఉన్నాడు*..
అన్ని మంచిపనులు వచ్చినట్టే మన కోదండo గారికి ఎదురయ్యాయి, ఆటవిశాఖ వారితో ఎలాగోలా నెట్టుకొచ్చి అసంపూర్తిగా ఉన్న గుడిలో అమ్మవారిని అలా కూర్చోబెట్టాడు...
ఇక అసలు సమస్య, అందరికీ తెలిసిన సమస్య ఆర్ధిక సమస్య..
వచ్చిపోయే భక్తులు కొందరి సహాకారంతోపాటు నా శ్రమతో ఇక్కడి వరకు నెట్టుకొచ్చా..
*అమ్మవారి అనుగ్రహంతో, మీ లాంటి సహృదయులు ఎవరైనా సహకారం మిగతాది పూర్తి చేసి గంగమ్మవారి ఈ చిన్న ఆలయాన్ని లోకార్పణం చేసి, ఇక్కడికి వచ్చే యాత్రికులకు వసతికోసం ఆలోచిస్తా* అని కథంతా చెపుతూనే మా బృందానికి రెండు సార్లు చాయ్ తాపాడు..
అద్భుతం....
*గత 50 ఏళ్లుగా  నమ్మిన వృత్తిపట్ల నిజాయితీగా ఉంటూ, ఆ వృత్తిలో కొనసాగే తనవారికోసం కూడా ఆలోచించే మన #కోదండo గారి కోసం, వారి ద్వారా జరుగుతున్న పనికోసం మనo కూడా కొంత ఆలోచిద్దాం, అవకాశం చేసుకుని ఆ పనికి కొంత సహకారం చేద్దాం..                     ఇది వారి  నెంబరు.. #కోదండం_9493067793.

29వ తేదీ #వీరపట్నం వాహిని బృందంతో శ్రీశైలం వెళ్లి వచ్చేటప్పుడు ఈ కోదండంగారి పని పరిచయం జరిగింది.

~: *సనాతన్ ధర్మకో జయహో*.