Friday, December 2, 2022

*ప్రణామ్ to ఖుదీరాం బోస్*

Pranaam to #KudhiRamBose
పిరికివాళ్ళ, స్వార్ధపరుల త్యాగాన్ని #భారతమాత  స్వీకరించదని నినదించి...
#భారతమాత సేవ చేస్తాను అని #సంకల్పం తీసున్నరోజు ఎంత అందంగా, ఎంత ఆనందంగా ఉన్నానో... ఉరి తీసే ఒక్క నిమిషం ముందు కూడా అంతే అందంగా, అంతే ఆనందంగా ఉన్నానా లేదా అని అద్దంలో చూసుకుని మరి ఉరివేయించుకున్న  #కుధీరాంబోస్ మనకు ప్రేరణ కావాలి.
కానీ ఇప్పుడు #దేశంకోసం ఆత్మత్యాగం  అవసరం లేదు.. మన మన విభాగాలలో కసితో  #దేశంకోసం పనిచేయడానికి #కుధీరాంభోస్ మనకు #స్పూర్తి కావాలి. ఈ రోజు ఆయన #జన్మదినం సందర్భంగా కొంత #ప్రేరణ తీసుకుందాం. 

నేనే తోపుగా #సమాజంకోసం పని చేస్తున్నా అని నాకు ఎప్పుడైనా  అనిపించినప్పుడు, నేను #కుధీరాంభోస్ #త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటా.. అప్పుడు నా పని పెద్ద జీరోలాగ కనబడుతది.
 #ప్రణామ్.

Wednesday, November 30, 2022

దేనికైనా సమయం రావాలి


Post of  01.12.2013


దేనికైన సమయం రావాలి మరి.....
పుట్టి పెరిగిన ఊరికి కేవలం 30km ల దూరంలొ ఉండి నిత్యం కదలాడే స్థలానికి అతి సమీపాన ఉన్న అతి పురాతనమైన/ మహిమాన్వితమైన ఆలయ దర్శనం 30సం.రాలకు జరగటం. 
ప్రతీ సంవత్సరం కార్తీక పౌర్ణమి నుండి 15 రోజులపాటు సాగే "జాతరకు" వెల్లాలని ప్రయత్నించిన ప్రతీసారి యేదో ఒక ఆటంకం..
ఇక కుదురదు అని మరిచిపొయిన సందర్భం....... అనుకోకుండా  కొంతమంది మిత్రులతో కలిసి చాలా ప్రశాంతమైన దర్శనం. ఇదే కదా మరి దేనికైన టైం రావాలి అంటే ..

Thursday, November 24, 2022

అరటి పండ్ల గొడవ

అరటిపండ్ల కోసం అమ్మా కొడుకుల దబాయింపు.... ఎక్కడ దాసావో చెప్పు అని ఆఫీస్ లోకి దూసుకొచ్చిన కొడుకు వీరూ, బయటనుoడి అమ్మ భువీ వత్తాసు. అర డజను మాకిచ్చి మిగతావి దాస్తారా అను కొడుకు వీరూ రుబాబుతో.. గజ గజ వణుకుతూనే బిస్కట్లు అల్పాహారంగా తిన్న మ్యాక్సి... ఎంత వారించినా వినకపోతే ఉన్న నాలుగు అరటి పండ్లుఇచ్చి, సర్ది చెప్పితే తిని తప్పుకున్న అమ్మా కొడుకులు.. పెద్ద ప్రమాదమే తప్పందన్న ఆనందంలో ఆఫీస్ సిబ్బంది😂

Thursday, November 17, 2022

Hampi Trip-2020




అవును ఇక్కడి #ప్రతీరాయి #మౌనంగా మాట్లాడుతుంది....

 #చరిత్రకు #మౌనసాక్షిగా నిలుస్తాయి ఇక్కడి రాళ్లు.. ..
ఇక్కడ రాళ్లలో మహత్తు ఉన్నది.....అవి మార్గాలు  చూపుతాయి.. 
త్రేతాయుగపు సుందర రామాయణ చరితను చరిత్రకు అందించే అద్బుతాలు ఆ రాళ్లలోనే నిగూడంగా నిక్షిప్తం....
   #భారతీయ గత వైభవ ఆనవాళ్ళను గుర్తుచేస్తూ భవిష్యత్తుకు దారిచూపుతాయి... అవును ఇక్కడి రాళ్ళకు రతనాలతో సమాన గుర్తింపు ఉండెనట...
#గుడులను_ గుడుల్లోని #దేవతల ఆశీర్వాదాలను, #శాస్త్రాలు_శాసనాలు, నదులు-జీవనదులకు,
దారులు_రహదారులన్నిటికీ ఇక్కడి రాళ్లే దివిటీలు..
ఇక్కడ నేలపై పారే నీటికే కాదు, కొండలపై #జీవనదులుల్లా పారే నీటికీ ఇక్కడి రాళ్ళే  
 సజీవ సాక్షాలు..రతనాల రాశుల వ్యాపారాలకు ఇక్కడి రాళ్ళే సిపాయిలుగా నిలిచాయంట....
ఈ రాల్లను రమణీయంగా  మలిచేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయక,  ఆ బండరాళ్ళను బద్రపరచి, సజీవ సాక్షులుగా మలుచుటకు జీవితాలను దారపోసిన ఆ #కళాహృదయాలు ఎంత గొప్పవో......
అందుకే ఇక్కడ ప్రతీ రాయి మౌనంగా మాట్లాడుతుంది..  చరిత్రకు 
#మౌనసాక్షిగా నిలుస్తుంది.

రాల్లకే కాదు ఇక్కడి జంతువులకూ, ఈ నేల పట్ల శ్రద్ద ఎక్కువే అని చరిత్ర చెప్పిన పాఠం. ఇక్కడి కుందేళ్ళు వేటకుక్కలను సైతం తరిమితే.....  
ఆ స్ఫూర్తితోనే #విద్యారణ్యస్వామిజి భారతజాతి #పూర్వవైభవం కోసం ప్రతిన చేసి, #విజయనగరసామ్రాజ్యానికి బీజం వేశాడు..
అలాంటి ఈ నేలను  ఎన్నిసార్లు సందర్సించినా.. ప్రతీసారి కొత్త శక్తిని తోడిచ్చి పంపుతుంది...మౌనంగానే గత చరిత్రను నెమరేయిస్తాయి......
ఆ రమణీయ రత్నాల రాళ్ళ నగరమే #హంపీక్షేత్రం, #కర్ణాటక....
ఇప్పటికైనా #భారతప్రభుత్వo ఈ క్షేత్ర #గతవైభవాన్ని గుర్తించి, రేపటి #చరిత్రకు సజీవ సాక్షంగా నిలుపవచ్చు.
#HampiTrip2020 #HAMPI  #హంపీ #PM0 #govtofindia #IndianHeritage

Wednesday, November 16, 2022

HAMPI TRIP-2020

*HAMPI TRIP 2020*
కార్తీక మాసం energy నే వేరు..
 వాతావరణoలో మార్పుతో పాటు, 
 పవిత్రతతోఁ నిండిన  అద్భుత శక్తిని సమాజానికి ప్రసాదిస్తుంది.

మాసం ప్రారంభ రోజునే @17.11.2020
 దక్షిణ కాశీ హంపీ- Hampi క్షేత్ర సందర్శన...

#పూజ్యశ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ సన్నిధిలో, వారి ఆశీస్సులతో...
పుష్కరాలకు మూడు రోజుల ముందే 
తుంగభద్రలో గజరాజు చల్లిన నీటితో
పుష్కరస్నానంతో పాటు హనుమకు శక్తిని ప్రసాదించిన వీరభద్రస్వామి దర్శనం🙏🏼.. దేశంలోనే ఎత్తైన 16 అడుగుల శ్రీ వీరభద్ర స్వామి దర్శనంతో పాటు హంపీ క్షేత్రమంతా కలియ తిరగటమే....
ప్రతీ సంవత్సరం హంపీ సందర్సన చేసినా.... వచ్చిన ప్రతిసారి కొత్తగానే, కొంత శక్తిని తీసుకుపోవడమే.

Sunday, November 13, 2022

ఆశయ సాధనలో ఆవగింజంత కూడా అధైర్యం, అశ్రద్ద ఉండొద్దు.


*ఆశయ సాధనలో ఆవగింజoత అధైర్యం, అశ్రద్ద ఉండొద్దు*.

ఈ సృష్టిలో దేవతలు సైతం సాధకుల ప్రయత్నానికి @భలవంతులకే సహకరిస్తారు.
*********************
                              
        
ఓ మహాకార్యం నెరవేర్చేందుకై ప్రారంభించే ప్రయాణంలో  ఎదురుపడే పిల్లుల,ఎలుకల, చిన్న చిన్న కీటకాల గురించి అస్సలు ఆలోచించవద్దు,
దారిలో కుక్కలు,నక్కల మొరుగుల గురించి అసల్ చింతవద్దు..
విశ్వాసం, ధైర్యం అనే నిజమైన ఆయుధాలతో అడుగు ముందు ముందుకే పడుతుండాలి.. 

కావాలని మనకు అడ్డం వచ్చి,
ఆటంకపరిచే వాళ్లుoటారు..
వాడు ఎవడైనా సరే అల్పులని చూడక, బలవంతులని చూడక,గురువని చూడక..
పూర్తి అవగాహనతో, నిండు విశ్వాసంతో 
విజయభేరిని మోగించాలంతే..
అడుగులు ముందు ముందుకే పడుతుండాలి. 

మన మహా విజయాన్ని ముద్దాడే వరకు..
ముందూ-వెనక చూడకుండా తుఫానులా దూసుకుపోతూనే ఉండాలి..
ఒక్కసారి మనం విజయశిఖరాన్ని చేరుకున్నాక,
మన విజయోత్సవ సంభరాల ఘోషను చూసి, అక్కడక్కడ ఉన్న కుక్కలు-నక్కలు చెల్లాచెదురై భయంతో పారిపోవాల్సిందే...

ఈ సృష్టిలో ఖలేజా ఉన్నోడిదే కాలం చెల్లుబాటు అవుతుంది. ఖలేజాకి అంద- చందాలు, ఆస్తి-అంతస్తులచే పనేలేదు. గుండె నిండా ధైర్యం ఉన్నోడు 
ఎటువంటి కాల పరిస్థితులనైనా వాడికి అనుగుణంగా తిప్పుకోగలడు, మలుపుకోగలడు...
అఖంఢమైన వాడి ఆలోచన పంతాను అందరి మనసులో నాటించకోగలడు..

*మెండైనా ఆత్మ విశ్వాసం, గుండె నిండా ధైర్యంతో పాటు నైతిక, ధార్మికమైన మనసున్న వ్యక్తిని మానవ సమాజం ఎప్పటికైనా గుర్తించి, బ్రహ్మరథం పట్టాలని ఎదురు చూస్తూనే ఉంటుంది..
దేవతలు సైతం అనుగ్రహిస్తారు.
ఒక మహా లక్ష్యoకోసం ...
ఎన్నెన్నో ప్రయత్నాలతో,విఫలాలతో..అలసిపోయి,చితికిపోయిన మనిషికి, అవకాశం దొరికితే చాలు
పూర్తి అనుభవ జ్ఞానముతో..
 దానిని ఉర్రూతలాడే ఉత్సాహంతో... విజయంతో ఊరేగే వరకు నిద్రపోడు, విజయాన్ని ముద్దాడే వరకు నిరుత్సాహంగా కనిపియ్యడు... కనిపియ్యవద్దు.
అది కార్య సాధకుల లక్షణం..
(సమ్మిళిత సేకరణ)
*********************

Thursday, November 10, 2022

సంకల్పం పట్ల నిజాయితి


పడిపోతామని కూర్చుంటే నడవడం తెలియదు,
ఓడిపోతామని ప్రయత్నం మానేస్తే గెలవటం తెలియదు,
ఫలితాన్ని మనం కాదు నిర్ణయించేది... మన సంకల్పం నిర్ణయిస్తుంది..
సంకల్ప సాకార ప్రయత్నo నిజాయితీగా సాగితే ప్రకృతి అండగా ఉంటుంది. తేడా వస్తే తోసేస్తుంది. సంకల్పదారులెవరు అనేది ప్రకృతికి అనవసరం. సంకల్పం పట్ల ఉన్న నిజాయితీ-నిబత్తతను మాత్రం భూతద్ధంలో కొలుస్తుంది.ఇది చరిత్ర చూపిన మార్గమే కొత్తదేమి కాదు.

Tuesday, November 1, 2022

#మనోధైర్యం_మహాపర్వతం.


                             
మన మనో ధైర్యం ఓ మహా పర్వతం అయినప్పుడు...
కష్టాలు, బాధలు మనను ఢీ కొట్టినంత  మాత్రాన మనకేమి  నష్టం లేదు, కష్టం లేదు, వాటన్నింటినీ
గుట్టను ఢీకొన్న గొర్రెపొట్టేల్ గా భావించాలి.

ఎన్ని తుఫానులు వచ్చినా... 
ఎన్ని వరదలు ఉప్పొంగినా...
ఎన్ని ఉప్పెనలు వెల్లువలా వచ్చినా... 
మహాపర్వతం లాంటి మనోధైర్యం ఉన్నోడికి, ఇవి లెక్క కానేకావు. 
ఎవ్వడు ఎదురుపడ్డా ఏమీ చెయ్యలేడు, 
ఎవ్వడు అడ్డు వచ్చినా మన మనోధైర్యాన్ని వెంట్రుకంత కూడా సడలించలేడు, కదిలించలేడు 

అనుభవాలతో కాలానుగుణంగా..
తనకు తాను సంస్కరించుకుంటూ..
 ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ..
*మనసును మర్ధన చేసుకుంటూ కాలం కనుసన్నలలో మెలిగే వాడి ఆత్మస్థైర్యం..ఎల్లప్పుడ ఓ అద్భుతాన్ని తలపిస్తుంది*. 

*పాపాలను,మోసాలను ఎరుగని మనిషి ఎవ్వడిని ప్రాధేయపడరాదు*,
ఎక్కడా రాజీ పడరాదు 
ఎన్నటికీ తల వంపు పనులు చేయరాదు.

*మహా పర్వతం లాంటి మనోధైర్యం ఉన్నోడు మహాసంద్రాలనే ఈదాలని చూస్తాడు* తప్పా,
పిల్ల కాలువలు ఈదాలని మాత్రం చూడడు 
వాడి గురించి ఎవ్వడైనా... 
ఈర్ష,అసూయలతో తలపెట్టే వంచనలను కుట్రలను, కుతంత్రాలనన్నింటినీ...
ప్రశంసా పత్రాలలాగా మలచుకొని తనేంటో... తన సత్తా ఏంటో ప్రపంచానికి ఓనాడు తప్పక పరిచయం చేసి తీరుతాడు
******************
(సమ్మిలిత సేకరణ)

Thursday, October 27, 2022

సీతాఫలం @2022

అసలు చూపియ్యకుండానే తిందామని ఉండే, కానీ చెట్టుమీద పండినవి ఎలా ఉంటాయో చాలా మందికి తెలువదనీ చూపియ్యడం అంతే.. ఈ పండ్లు చూడ్డానికి ఎంత బాగున్నాయో, ముట్టుకుంటే చిట్లిపోతాయి అన్నoత మక్కినయ్😀... అందులో ఒకటి తిన్నాకే రుచి కూడా చెపుదామని ఆగి, తిన్నాక చెపుతున్న😂..  చెట్టుమీద మక్కిన పండు ఇంత రుచా😋.. ఇంకో రెండు ఉన్నాయ్.. ఇక్కడ ఎలకలేక్కువ అట్లనే కోతులలాంటి మనుషులు ఎక్కువే.. కనిపిస్తే కథమే.. మిగిలిన ఆ రెండూ కనబడకుండా దాసడమే పెద్ద టాస్క్... హల్మారో లో దాసి, నెత్తికింద 🗝️పెట్టుకుంటా.. పొద్దున లేవగానే ఆ రెండు మెల్లగా తిందాం😀.

Wednesday, October 26, 2022

Hampi Trip-2022

ప్రతీ సంవత్సరం లాగానే ఈ సారి కూడా #హంపీ సoదర్శన సంపూర్ణం ...
పూజ్య #విద్యారణ్యస్వామిజీ #చాతుర్మాస్యదీక్షలో ఉన్న సమయంలో దర్శించుకోవడం 2008 నుండి ప్రారంభమైoది.. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం వెళ్లే అలవాటు కూడా అయింది. 
 పోయిన ప్రతీసారి కొత్త అనుభూతి, కొత్త శక్తితో రావటమూ అంతే...
తుంగభద్రా నది ఒడ్డునే ఉన్న #హంపీమఠం లో బస, ఉన్నన్నాళ్ళు పూజ్య #స్వామిజీతో పాటు #కోతి-కొండoగలకు(బయట వాటికి వైరం-ఈ క్షేత్రం లో కలిసే ఉంటాయి) పక్షులకు ఆహారం ఇవ్వడం,తుంగభద్రా నదిలో #లక్ష్మి_గజస్నానం ప్రతీసారి కొత్త అనుభూతే..
ఇగ ఆలయాల సందర్సనతో అక్కడి రాళ్ళలో దాగిన గత వైభవాన్ని చూసిన ఎవరికైనా ఒకింత #ఆశ్చర్యం, ఒకింత #బాధ అంతకు మించి #కోపం కలగక ఉండదు.
మొదటి రెండు మనవాళ్లు ఎంతో శ్రమకు ఓర్చి, వారి శక్తి యుక్తులను ఉపయోగించి వారి #వైభవాన్ని రమణీయంగా రాళ్ళలో బందిoచి, భావితరాలకు అందిoచాలానే తాపత్రయానికి ఆశ్చర్యం,  ఆ శ్రమ, #కళానైపుణ్యం నాశనం జరిగిన విధానం చూసి భాద...
బానిసత్వానికి దూరమై ఇన్నేళ్లయినా ఇప్పటికీ #హంపీ క్షేత్రానికి పూర్వ వైభవo తేలేకుండా ఉన్నoదుకు కోపం  అందరికీ వస్తుంది..
ఇలా ప్రతీ ఏడు అనుకుంటానే గడుస్తున్నా.. ఎక్కడో ఓ మూలన కొంత ఆశ.. రాబోయే కొన్ని సంవత్సరాలలో #హంపీ క్షేత్రం పూర్వవైభవాన్ని సంతరిoచుకుoటుందని..
ఆశతో ఉందాం.
అన్నీ సందర్శిoచడం ఒకవైపయితే సామాజిక కార్యకర్తలకు ప్రేరకుడు, చిరంజీవి మన #అంజన్న జన్మస్థలం #అంజనాద్రి సందర్సన ఇంకోవైపు😀.
ఈ సారి కొత్తగా హంపీ క్షేత్రానికి 40kms దూరంలో ఉన్న, 7వ శతాబ్దoలో కట్టిన అతి పురాతనమైన, శక్తివంతమైన, మహిమాన్వితమైన #సoడూర్ #సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సoదర్శన.

Thursday, October 6, 2022

మా ఊరి చెరువు @2022


మా ఊరి చెరువు... దాని పేరు కాముని చెరువు.. ఓ పదయిదు ఎకరాల్లో ఉంటుందంతే.. FTL కలిపితే ఓ 50ఎకరాలంట..

అప్పుడెప్పుడో చిన్నప్పుడు.. అంటే 1987 lo ఎనిదవ తరగతిలో ఉన్నప్పుడు చెరువు నిండి అలుగు పారుతుందoటే ఉరుక్కుoటా వచ్చి చూసినట్టు జ్ఞాపకం..మధ్యలో 2006లో నిండితే చూడడం కుదురలే.

మల్లా ఇప్పుడే చూడడం.. అదీ అనుకోకుండా, అలా అందరితో కలిసి చూడడం.. గంగా పూజ చేయడం, అందునా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో కావడం కొంత అదృష్టంగా బావించాలి.






Sunday, September 4, 2022

తెలంగాణలో ఎంటరైన కొత్త IBC Officer.. చమటలు కక్కుతున్న చవటలు.. ఆధారాలతో అదిరిపోయే అడుగులు  వేస్తున్న ఆఫీసర్..
 ఆయన్ని చూస్తే  అమాయకంగా, చిన్నగా కనిపిస్తున్నా...
ఆ బ్రవున్ కలర్ కొత్త కళ్ళద్దాల నుండి చూసే ఆయన చూపు & వెనకవైపు బిగుతుగా కట్టిన జుట్టు నుండి నేరుగా విషయం మీదిగే పోతున్నదని దూరముండి దగ్గరగా చూసిన పరులు చెబుతున్న మాట..
ఎంటరైన మొదటిరోజే అమ్యామ్యాగాళ్లకు అనూహ్య ఆర్డర్లు ఇచ్చిన ఆఫీసర్ లిస్టులో ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు..

*కెమెరామెన్ శరవణ్ తో చేతులు వెనక్కి కట్టుకున్న రాము & టీమ్* frm DEKETHLON @ Super Bazar భాగ్యనగర్😂😂.

ఆశ, ఆశయం.... ఆత్మవిశ్వాసం.

*ఆశ,ఆశయం గల్లంతైనా కానీ..ఆత్మవిశ్వాసాన్ని మాత్రం  సడలనివ్వొద్దు.*
**********************************
                                          
 కలలు కన్న ప్రపంచం  చెదిరిపోతే పోనీ...
*ఆశలు గల్లంతైనా పర్వాలేదు, ఆశయం నెరవేరుతుందా లేదా తెలియకపోతే పోనీ*...
కానీ... 
ఆత్మ విశ్వాసాన్ని మాత్రం ఇసుమంతా కూడా సడలనివ్వొద్దు..

*సాదించాలనే పట్టుదల కించిత్ కూడా సడలరాదు* 

ప్రశాంతమనుకున్న ఆకాశం...
ఒక్కసారిగా.. ఉరుములు,పిడుగులను కురిపిస్తది,
ఆకర్షణీయమైన, అనుకూలం అనుకున్న
వాతావరణ పరిస్థితులు, అకస్మాత్తుగా ప్రతికూలంగా ప్రత్యక్ష మవుటాయి..

*కాలమయినా, మనుషుల మనోగతం అయినా విశ్లేషణకు అందవు*. 
వాటిని అర్థం చేసుకొనేలోపలే..
స్వరూపం, స్వభావం మారిపోయి,
మనసును యిరకాటంలో పడివేస్తాయి*. 

విజ్ఞత,విజ్ఞానం విశ్వసనీయతలు ఏవీకూడా
కాలపరిస్థితులను అంతసులువుగా అంచనావేయడానికి ఎల్లప్పుడూ పనికిరావు..

కొన్నిసార్లు...
 *ప్రకృతి ప్రకోపానికి ఈ సృష్టిలోని జీవ,నిర్జీవాలే బెంబేలెత్తక తప్పదు*. 
మనిషులం అయినందున...
ఒడుపు,ఓపిక, వైరాగ్యం,ఆవేధనలను..
పరిస్థితులు/కాలం మనకు తప్పక ఎప్పుడో ఓసారి పరిచయం చేయక  చేస్తాయి.
  వాటిని తట్టుకుని నిలబడితే విజేతవు... 
కాదు,లేదు, వద్దు, కూడదు అనుకుoటే అది మన ఇష్టమే, తప్పిదమే.
అంతేగాని నా దురదృష్జం, నా ఎదుగుదలకు ఎవరో అడ్డము, నిలువు అని ఇంకెవరినో నిందించే/ అనుమానించే పనిలో ఉండొద్దు.
*నిజాయితీగా జరిగే పనికి కలిగే ప్రతీ ఆటంకం ఒక మెట్టులాంటిది. అది ప్రకృతి నిర్ణయం. చింతించక స్వాగతించి పద పదరా అని ముందుకే సాగడo సాధకుని పని*.
సాగవోయి సోదరా సమరశీల యోధుడా ఆగని ఈ పయనంలో తుది విజయం మనదిరా అని పెద్దలు చెప్పినంత ఆత్మవిశ్వాసం మనందరికీ (సాధకులకు) అవసరం.
శుభం.
 (సంకలనం)
******************************************

Tuesday, August 30, 2022

*కాల పరీక్షలు*

కాలo పెట్టె పరీక్షలు కఠినమైనవి....
కొన్ని సమయాల్లో ఎవరికీ చెప్పలేని, చెప్పుకొలేని, చెప్పొద్దనిపించే స్థితిలో కాలం గడపాల్సి ఉంటుంది.
అన్ని కార్యాలు ఆర్ధిక సంబందమైనప్పుడు రెండగులు ముందుకు పడితే, ఓ నాలుగడుగులు వెనక్కి పోతుంటాయి.
 అదే కాలం పెట్టె పరీక్ష.
పని ఎంత సామాజికమైనా కాలo పెట్టె పరీక్షలో పోరాడి గెలవాలిసిందే.
కొన్ని సందర్భాలలో క్షణం క్షణం, రూపాయి రూపాయి విలువైనది అనేంత వత్తేస్తది కాలo..
కానీ అన్ని పరీక్షలకు నిఠారుణ నిలబడితే ఇగ ప్రణాo అంటుంది.

Sunday, August 28, 2022

Facebook Reminder

చాలా ప్రేరణా వాక్యాలు ,స్ఫూర్తి వచనాలు వినుంటాo.. లక్ష్యం ఆశయoగా మారినప్పుడు, ఆ ఆశయంకోసం నిజాయితీతో సాధన సాగినప్పుడు అవనిలో ఎన్ని అవాoతరాలు ఎదురైన లక్ష్య చేదన తధ్యం..తధ్యం.. తధ్యం.. మా హమే శక్తి దే🙏🏼- న రుకు నే కా న ఝకు నే కా.

Friday, August 26, 2022

ఆటంటేనే ఆనందం

ఆటంటేనే ఆనందం....
ఆనందం కోసమే ఆట అనేది మాట..
అంతేకాదు ఆటతోనే జీతం, జీవితం,గౌరవం అన్నీ ఉంటాయి అని చిన్నప్పుడే వాళ్లకు తెలిస్తే ఆటే జీవిత ఆశయoగా ఎదుగుతారేమో... అన్నిటికీ కొంత దిశ  అవసరం.. అలాంటి దిశలు అందక చాలా మంది ప్రతిభలు ఆదిలోనే అంతమయ్యాయి.. అవసర సమయంలో కొందరికైనా అలాంటి దిశ అందించే ప్రయత్నం చేద్దాం. అదే ఆశయంతో GSF_ SSA

Sunday, August 21, 2022

*ఎవరు చెక్కిన బొమ్మనో*

ఎవరు చెక్కిన బొమ్మనో.. 
యే హస్త వాసినో..
శిలలపై #శిల్పాలు చెక్కినారు మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు అంటే ఊరికే అనుకుంటాం...కానీ దగ్గరగా చూస్తేనే వాటి అద్భుతాలు తెలుస్తాయి. 
తాము సూచిన సంస్కృతిని, సాంప్రదాయాలను వచ్చేతరాలకు అందించాలని, ఆ తరం వారు పడ్డ తిప్పలెన్నో... వాటిని కాపాడటం కోసం తమకు అందుబాటులో ఉన్న ప్రతీ వస్తువును అస్రంగా వాడారుగా.
.. అదే అద్భుతం.

రాచకొండ దారిలో రాయికి అద్బుతంగా వినాయకున్ని చెక్కిన ఆ అదృశ్య #శిల్పిని #వినాయకచవితి నాడు జ్ఞాపకం చేసుకుందాం. 

జై బోలో విఘ్నేశ్వర భగవానకీ జై.

#Rachakonda #రాచకొండ

(Photo Cap.by me in 2015)

Wednesday, August 17, 2022

రాచకొండ సందర్సన 18.08.2014

ప్రకృతిలో పులకరింత..
చాలా కాలం నుండి ఉన్న బలమైన   కోరిక...
 మిత్రులతో  రాచకొండ గుట్టల్లో..  వర్షంలో on 18.08.2014.
" రాచకొండ ఒక గొప్ప చారిత్రక_పర్యాటక కేంద్రం" 
అభ్యంతరం లేకుండా అభివృద్ది చేస్తే తెలంగాణకే ఒక మణిహారంలా ఉంటుంది.
 "రాచకొండ కేంద్రంగానే తెలంగాణ పాలన సాగిందంటారు...
గోల్కోండ కన్నా ముందుగానే నిర్మింఛబడ్ద  ఈ కోట పాలకుల అలసత్వం వల్ల శితిలావస్థలో ఉన్నదిప్పుడు.
రాజుల సొమ్ము రాల్లపాలు అన్నట్టే *వేల ఎకరాలల్లో నిర్మింపబడ్డ రాతి కట్టడాలు, మందిరాలు, కొండల్లొ కూడా తవ్వించిన చెరువులు చరిత్రకి దూరంగా జరిగాయి.
కాకతీయుల కాలంలో నిర్మించబడి  తెలంగాణాలో  చక్కటి పరిపాలనా కేంద్రంగా విలసిల్లిన ఈ రాచకొండకి పూర్వ వైభవం అందించే విదంగా ప్రయత్నం జరిగితే, ఇదొక గొప్ప చారిత్రక_పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుంది...ఆ రకమైన ప్రయత్నాలు ఇప్పటి తెలంగాణా ప్రభుత్వం చేయాలని-చేస్తుందని అశిద్దాం...

Saturday, August 13, 2022

అఖండ భారత్ దివస్ -2022

Akhanda bharath diwas

 

బాధ్యత

తీసుకున్న బాధ్యత చిన్నదా, పెద్దదా అనేది విషయం కాదు. 
అది ఏదైనా అనుకున్న పని, అనుకున్న సమయానికి పూర్తి చేస్తే, అది మన బాధ్యత పట్ల మనకున్న శ్రద్ధను, గౌరవాన్ని తెలియజేస్తుంది...
ఎవరన్నా లేకున్నా మన పనిలో మనo చివరి వరకూ సాగితే మిగతాది ప్రకృతి బాధ్యత..
 *బాధ్యతను గౌరవిoచడం సాధకుడి మొదటి లక్షణం కావాలి*.

Friday, July 29, 2022

గులాబీ వేర్లల్లో భద్రం

అక్రమంగా కూల్చబడ్డ సాధన కుటీర్ వివేక మండపం గోడ ఇటుకల కింద నుండి తీసి, దాచి ఇంకోచోట నాటిన కాశ్మీరీ గులాబీ మొక్కల నుండీ గులాబీలు..
కూల్చిన ఇటుకలు తన కొమ్మలపై పడి నలిపేసిన  తతంగమoతా ఇప్పుడు వేర్లల్లో భద్రంగా దాచుకున్నాం.. ప్రతి ఆదివారం భారత మాతా హారతి అర్పణకోసం మేం సిద్ధం అంటున్న గులాబీలు..