Wednesday, June 29, 2022

శ్రీశైలం ట్రిప్ @ 2022.

శ్రీశైలం పోతే... ఆ శివయ్య అనుగ్రహం కోసం ఎంత ఆరాటపడుతామో.. అంతే ఆరాటంతో ఆ శివరాయ@ శివాజీ నుండి ప్రేరణ శక్తిని పొందాలని ఆశిస్తాం...
శివాజీ ధర్మపోరాటానికి భ్రమరాంభదేవి ఖడ్గం అందించి, శక్తిని ప్రసాధించిన పవిత్రస్థలం..
 అoదుకే  ఆ శివాజీ స్ఫూర్తి కేంద్రం తప్పక సదర్శిస్తాo... అందరూ సందర్శించాలి కూడా.  
శివాజీ జీవిత ముఖ్య ఘట్టాల వివరాలు 3D చిత్రాలతో ఆధునీకరించిన  స్ఫూర్తికేంద్రం ఆహ్వానం పలుకుతున్నది.

వీరపట్నం వాహినితో శ్రీశైల స్ఫూర్తికేంద్ర సందర్సన. @ 29.06.2022.
*********************
రాబోయే  అనేక తరాల నేతలకు, ఈ దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చాలని కోరుకునే వారందరికీ, శివాజీ ఒక ప్రేరణా శక్తి, ఒక మార్గదర్శి... ప్రణమిల్లుదాం... అనుసరిద్దాం..

Monday, June 27, 2022

మoచితనం, ఓర్పు, సహనం,

మంచితనాన్ని చేతగానితనంగా అనుకున్నప్పుడు, ఓర్పును-పోరు చేయలేని నిట్టూర్పు అనుకున్నప్పుడు, సహనాన్ని- సత్తాలేని ఉత్త  ఓపిక అనుకున్నప్పుడు,
అన్ని మంచి గుణాలను అవహేళనగా భావిస్తున్నప్పుడు...
వాటి శక్తిని ప్రదర్శించకపోతే ఆ గుణాలు మనను కూడా వదిలిపోతాయి..
అందుకే ధర్మంపట్ల చులకన భావం ఏర్పడ్డప్పుడు శక్తి ప్రదర్శన తప్పనిసరి.
రాముని వారసులమే అయినా కృష్ణుని అనుయూయులం అని గుర్తించుకోవాలి.
ఎవరికి ఏ భాషలో చెపితే బాగా అర్థం అవుతదో అదే బాషల చెప్పాలి.. అదే ధర్మం పట్ల నిష్ట. అనుసరిద్దాo.. ఆచరిద్దాం...   దేవాలయాలు కేవలం పూజలు, యజ్ఞ, హోమ- యాగాలకు మాత్రమే నిలయాలు కాదు, కాకూడదు..  ధర్మనిష్టా కేంద్రాలు, శ్రద్దా కేoద్రాలు, అవసరార్ధుల ఆపన్నాహస్తాలు కావాలి.     *మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం*. 

Sunday, June 19, 2022

*ఉన్నప్పుడు ఉట్లపoడగా- లేనప్పుడు లొట్ల పండగ*

గూట్లో దీపం- నోట్లో ముద్ద...
ఉన్నప్పుడు ఉట్లపండగ లేనప్పుడు లొట్లపండగ... పెద్దల ఈ
రెండు మాటలను ఈ రోజు నా తిండికి అన్వయిoచుకోవచ్చు..

ఒకటి ఈ 6 గం.లకే రాత్రి తిండి కథం.ఎప్పుడూ రాత్రి 10కి చేసేటోళ్లం ఈరోజు ఇట్లా... పొద్దుమూకే కథం.
ఎప్పుడు సాధకులు వంతులవారిగా వంట చేస్తే ఒక్క కూర,  ఇంత పచ్చిపులుసు అంతే..
ఇప్పుడు వంటలకు ఒకరు వచ్చారు.. దాని పర్యవసానమే ఈ 4 రకాల కూరల్, చట్నీ, మూడు కూరల్ @ గోకరకాయా, బెండకాయ, మీల్ మేకర్😀  & చపాతీలు..
ఉన్నప్పుడే ఉట్ల పండగ మరి. కానియ్యాలే మరి...

Saturday, June 18, 2022

*సమాజానికి తిరిగి ఇవ్వడం*

చిన్న వయసులోనే అనుకున్నది సాధించడం, అందుకు తగ్గ సాధన చేయడం...
ఎదుగుతున్న క్రమంలో పొందిన సాయం తిరిగి సమాజానికి ఇచ్చేయడo అదృష్టం.. అది కొద్ది మందికే సాధ్యం..
ఆ కొందరిలో మనమూ, మనోళ్లుoటే మనకూ కొంత గర్వం...
అతికష్టమైన ఎవరెస్టు శిఖరాలకు అతితక్కువ వయసులో అధిరోహించిన తుకారాo.. తాను అనుభవించిన కష్టాల జ్ఞాపకంతో ఎదుగుతున్న ఆణిముత్యాలకు తనవంతు సహకారం ఇవ్వడం ప్రారంభిడం అభినందనీయం. గత సంవత్సరం జూన్ 18న
పల్లె ఆణిముత్యాల పండగ పేరున సాధన కుటీర్ ప్రారంభమైన రెండో  ఏడాది ముగ్గురు సాధకులకు ప్రోత్సాహం అందివ్వడం మనందరికీ స్ఫూర్తిదాయకo, గర్వకారణం, ఆచరనీయం...

GSF తరపున తుకారంకి శుభాబినoదనలు, శుభాకాంక్షలు💐

Friday, June 10, 2022

వ్యక్తి - వ్యవస్థ

*ఆజ్ కి బాత్ అజం కర్లో*

తన ప్రతి పనిని, ప్రతీ పరిచయాన్ని నమ్మిన వ్యవస్థ/ సంస్థ ఎదుగుదలకు నిస్వార్థంగా, నిజాయితీగా ఉపయోగించే వ్యక్తుల వల్లే ఆ వ్యవస్థ/సంస్థకు జీవం....
 వ్యవస్థలో చేరి ప్రతి పరిచయాన్ని తన స్వంత అవసరాలకు, ప్రతి పనిలో తన స్వంత లాభం ఎతుకులాడే స్వార్ధపరులూ ఉంటారు. వారితో వ్యవస్థకు ఎప్పటికీ నష్టమే... వారెక్కువకాలం వ్యవస్థలో ఇమడలేరు. అయినా.
 ఇరువైపులా జాగరూకత అవసరం.

ఆజ్ కి బాత్ అజం కర్లో



రామునికి
కష్టం వచ్చిందని 
రావణుని
సంహారం వెంటనే జరుగలేదు ...

సృష్టి అనబడే
కాలచక్రం కూడా 
శివాజ్ఞ కోసం
ఎదురు చూసింది...
అక్షరాలు పొందిక ఓదార్పు మత్తులాగా ఉన్నా అదే పచ్చినిజం కూడా.. జగమెరిగిన సత్యమే అది.

Thursday, June 9, 2022

ప్రకృతి _ జొర్రీగా

ఈ ప్రకృతికి వేరే  పనేముoడదు..
లేని ఆలోచనలు బుర్రల్లో  చొప్పించి, సంకల్పాలుగా మలచి, ఆచరణ వైపుగా ముందుకు తోస్తది. బుడి బుడి అడుగులు వేస్తూ తూలుతున్నప్పుడు ఎదో ఒక చేతివేలిచ్చి దారిన పెడుతది. నడకలో పట్టు సాధించి వడి వడి అడుగులేస్తున్నప్పుడు పరిగెత్తమని ఉసిగొల్పుతది..  నాతో కాదు, కూడదు అని నస పెడితే ఇంకోని బుర్రలో  జొర్రుతది..కానీ తన పని ఆపదే.. ఆపదు గాక ఆపదు.
ఒక కొత్త కార్యానికి జొర్రీగలా చెవి కొరుకుతున్న ప్రకృతి.. అవునందామా... మరి కాదందామా అనే ఆలోచన కూడా పదుగురితో చేదాం😀...