Monday, May 24, 2021

అద్భుత కళ @ అమ్మవారి విగ్రహం

అద్బుతం..
ఆ కాళా నైపుణ్యం..

మరయంత్రంతో పోటీగా మనిషి హస్తం... ఇంకా అంటే అంతకు ఎక్కువే..
అచ్చువేసినట్టే అమ్మవారి విగ్రహం..

ఆ విగ్రహంలో అమ్మవారు ఆవహిస్తే అచ్చంగా ఆమే రూపమే.. అది మహా అద్బుతమే..

అ స్థలంలో అమ్మవారి విహ్రహo   వేయించాలనే ఆలోచన వచ్చినప్పుడే...
వేస్తే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అనుకున్నా...
ఆ శిల్పికి ఒకటికి 10 మార్లు వేయాల్సిన బొమ్మ చిత్రం చూపించి జాగ్రత్తలు చెప్పాను. అవి జాగ్రత్తలు అనేకంటే భయపెట్టడం అనొచ్చోమో. అంతలా జాగ్రత్త చేప్పాను..  ఇక ఆ విగ్రహం తయారు చేయడం మెదలు పెట్టీన రోజు నుండి ప్రతీ రెండు రోజులకు వస్తున్న మార్పులు గమనిస్తూన్నాము.
ఆ విగ్రహం పూర్తయ్యాక కొంత సంతోషం,  మనం చెప్పిన మాదిరిగానే అచ్చం అలాగే చేశాడు శిల్పి..
ముఖ్యంగా ముఖ వర్చసు మీద కొoత ఆందోళన ఉండేది ఎలా చేస్తారో అని.. అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఒక్క ముఖమేమిటీ ప్రతీ చిన్న విషయాల పట్ల జాగ్రత్త పడి అమ్మవారి విగ్రహo చేశారు..

ఆ తరువాత ఆ విగ్రహనికి వేయాల్సిన రంగులూ మనమే నిర్ణయం చేసాము. ఆ బొమ్మే కేవలం మన ఆలయానికే ఉంటుంది.
ఎప్పుడు రంగులు పూర్తి చేస్తారా అన్నంత ఆతృత ఉండేది...

ఎట్టకేలకూ విగ్రహం బాగ రావడమే కాక రంగులూ బాగా వేశారు..
ఆలయ గర్బగుడిలో వెలసిన అమ్మవారిని దర్శించుకునే కంటే ముందే, గుడి మెట్లదగ్గరే ఈ అమ్మవారు దర్శనం ఇస్తుంది..
ఇంతా చెప్పి ఇదెక్కడా అని అడిగేంత అవాకాశం ఏమీ ఇవ్వను..

*ఇది మన జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి అలయంలో...
అందర

*ఇంత శ్రద్ధతో, చాలా ఓపికగా తమ అద్భుత కళా నైపుణ్యంతో అమ్మవారి విగ్రహాన్ని అందించిన ఆ  కళాకారుల కళను గౌరవిస్తూ, వారిని అబినందిద్దాం, ప్రోత్సహిదాం*.

జూన్ 5వ తేది ఆలయ బ్రహ్మోత్సవాల సందర్బంగా వచ్చినప్పుడు దగ్గరగా దర్సిద్దాం..

*బోలో సరస్వతి మాతకి జై*.

;~ సదా వెంకట్.

Friday, May 21, 2021

వ్యవసాయ క్షేత్రం @ తారమతిపెట్

లాక్ డౌన్ అందించిన మరో అవకాశం.
*అద్బుత #వ్యవసాయక్షేత్ర సందర్సన*

అక్కడ ప్రతి #మొక్క, ప్రతి #చెట్టూ, ప్రతీ #తీగ, ప్రతి #రాయి, ప్రతి బొమ్మ ...ఒకటేమికి అక్కడ అన్నీ అద్భుతాలే.. అదొక #శ్రద్దాక్షేత్రం.

ఈ లాక్ డౌన్ సమయంలో పూజ్యశ్రీ #విద్యారణ్యభారతిస్వామిజీ తో పాటు కలిసి ఆ క్షేత్రం సందర్శించే అవకాశం రావడం ఒక అద్భుతం.

ముప్పై సంవత్సరాల #సాధన... 
ప్రకృతి సేవకుడై,
అదే యావతో నిరంతర శ్రమ. 
మట్టిని, శ్రమను నమ్మి, అదే ఆశను ఆశయంగా చేసుకుని సాధనతో  #మట్టిలోమాణిక్యాలు తీస్తు ఎందరికో మార్గదర్శకుడైన #శ్రామికుడు,..

  ఉన్నత విద్యార్హతలు కలిగి, ప్రకృతి మీద ఉన్న మమకారంతో 
17 ఎకరాల పొలంలో ఏమాత్రం 
కాలి స్థలం లేకుండా అన్ని రకాల #పూలమొక్కలను, #పండ్లమొక్కలను నాటి, వాటిని మొక్కలుగా చూసి, వాటిని పూర్తి #సేoద్రీయఎరువులతో వృక్షాలుగా, మహా వృక్షాలుగా మలచిన #మహాసాధకుడు.
తన నిరంతర శ్రమకు ఎన్నో అవార్డులు వచ్చినా,  ఆయన శ్రద్దముందు అవన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి. 

 ఎప్పడూ బిజీగా ఉంటూ, ఒక్క నిమిషం కూడా వృధా చేయక తన క్షేత్రాన్ని అద్భుతoగా తీర్చిదిద్ది, అదొక ప్రయోగశాలగా మార్చిన    వారి కృషి అభినందనీయం. అందుకే అదొక సందర్శనశాలగా మారింది. రేపటి తరం సాధకులకు దిక్ఛూచి అయ్యింది. ఆయన జీవితం నేటి విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా మారింది...
ఆ సాధకుడు #నాగరత్నంనాయుడు, ఆ క్షేత్రం తారమతిపేట్, అబ్దుల్లాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా.

link:  https://www.theweekendleader.com/Success/2371/model-farmer.html

Thursday, May 20, 2021

రాచకొండలో అఖండజ్యోతి శివ అనుగ్రహమే

ఒక కారణమంటూ లేకుండా ఏ కలయిక జరగదు....

కొన్ని ప్రకృతి ప్రసాదిత నిర్ణయాలు ఇంకా ఖచ్చితంగా జరుగుతాయి..

 అనుమానమే అక్కరలేదు..
మన సంకల్పం మంచిదైతే  శక్తి వెతుక్కుంటా వస్తుందనేది పచ్చినిజం..

సంకల్ప సాకారానికి  ఎవరున్నా,లేకున్నా  చిట్టచివరి వరకు నీ దారిలో అడుగులు నీవు వేస్తే....ఎవరిని ఎప్పుడు కలపాలో, ఎవరిని ఎప్పుడు జరపాలో ఆ ప్రకృతి చూసుకుంటుంది. మనం చేయాల్సిందల్లా మన పనిలో నిజాయితిని కాపాడుకోవడమే..

Wednesday, April 28, 2021

సలేశ్వరం యాత్ర @2013

పాలమూర్ - సలేస్వరం యాత్ర...సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే సాగే  ఈ యాత్రను/ ఆలయాన్ని  సందర్శించాలన్నగత 4సం.రాల నుండి ఉన్న  కోరిక ఈ సంవత్సరం పూర్తయ్యింది. పాలమూర్ జిల్లాలో ఉన్న ఈ సలేస్వరాలయాన్ని ప్రతి ఒక్కరు దర్సించాల్సినదే ....   భాగ్యనగర్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం దర్శించినకా కలిగే తృప్తి . ఆనందం వర్ణనాతీతం . 40O అడుగుల లోతున.. లోయ ప్రాంతంలో  చిన్న లింగాకారంలో వెలసిన దైవాన్ని దర్శించిన ఆనందం కన్నా... కొన్ని వందల సంవత్సరాల క్రితమే.. తమ భవిష్యత్ తరాల వారికి భారతీయ వారసత్వ సంపదను అందించే క్రమంలో వాళ్ళు చూపిన శ్రద్ద పట్ల అందరూ ఆశ్చర్య పడాల్సిందే. వాలందరికీ కృతజ్ఞులమై ఉండాల్సిందే...సాదారణ రోడ్డు మార్గం నుండి లోయ ప్రాంతంవైపు  సాగే సుమారు 6  కిలోమీటర్ల రహదారి ప్రయాణం మాత్రం వర్ణనాతీతం ... కచ్చితంగా అది స్వీయ అనుభూతి పొందాల్సిందే. అందునా ఉత్సాహ వంతులైన మిత్రబృందం ఉంటె ఇక ఆ ఆనందం ఇంకా మధురం. దారి పొడుగునా ఉన్న రమణీయమైన అందాలను తిలకిస్తూనే... ఎన్ని వ్యయ ప్రయాసలని భరించి ఆ రహదారిని చూపిన/చేసిన  వారిని  అభినందించకుండా ఉండలేము..భవిస్యత్తు తరాల వారికి సంసృతీ సంప్రదాయాలను అందించటానికి వాల్లు పడ్డ శ్రమ పట్ల ఆశ్చర్యం కలుగుతుంది ... హ్రుదయం ఉన్నవారికేవరికైనా తాముకూడా ఏమైనా చేయాలనిపిస్తుంది..... 

Wednesday, April 21, 2021

రాచకొండలో రామనవమి-2021

#శ్రీరామనవమి_2021 @ #రాచకొండ

రాచకొండలో రాతిరేళ #రాములోరికళ్యాణం #కమణీయం, రమణీయం...

గత నాలుగేండ్లుగా ఈ రాచకొండ రాములోరు మాకు ఆహ్వానం పంపుతానే ఉన్నాడు, మేమూ తప్పక పోతానే ఉన్నాము.

 #కార్తీకపౌర్ణమి రోజున రాచకొండలో అఖండజ్యోతి వెలిగిస్తున్నందుకు శివపార్వతులే పిలుస్తరేమో అనుకున్నాం..  సీతారాములూ పిలుస్తున్నారు...సంతోషం*.

కానీ... పోతే ఊరికే కూర్చునే రకాలు కావుగా మనవాల్లవి, ఏదో ఒక పనిలో ఖచ్చితంగా ఉండాలంతే...
 నిర్వాహకులు పని చెప్పకపోతే, మనవాల్లే ఆ  పనిని దొరికించుకునే రకాలు.. మనవాళ్ళు ఎప్పుడూ అంతేగా..  
ఈ సారి కూడా అంతే..

 #శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే.......

#శ్రీరామజయరామజయజయరామ*  స్మరణతో రాచకొండను మారుమ్రోగించారుగా..
అంతచేసి పెళ్ళి భోజనం చేయకుండా వస్తారా! అస్సల్ రారు, వస్తే వండుకుని తినాలెగా మరి. అందుకే మాంచి పెళ్ళి భోజనం ఆరగించి వస్తిమి.

కరోనా కాదుకదా దాని బందుగణం మొత్తం చుట్టుముట్టినా కొన్ని పనులు ఆగవు గాక ఆగవు. కాకుంటే కొంత ఉత్సాహం తక్కువైతదీ అంతే..
 కట్టలకు కట్టలు పైసలు పంచి, తినిపించి, తాపించి ఎన్నికల సభలలకు బలవంతంగా పాల్గొని కరోనాను అంటించుకున్న దానికంటే... ఎవరి బలవంతం మీద రాకుండా, పిలవకనే వచ్చి,  రామకళ్యాణానికి కట్నాలు, కానుకలు సమర్పించి సేవలో పాల్గొనేంత శక్తినిచ్చిన ఆ దైవానికి మొక్కకుండా ఉంటామా.. అదే సనాతన ధర్మం యొక్క శక్తి.
ప్రతీసారి రాత్రి 11కు ప్రారంభమై తెల్లవారులు కొనసాగే కళ్యాణo తదనంతర భోజనాలు, భజన కార్యక్రమాలు కరోనా కారణంగా 9 వరకే ముగిసాయి. 

#శ్రీరామనవమి -2021 @ #రాచకొండ.
:~ జై శ్రీ రాం.

Tuesday, April 13, 2021

*మనిషి సృజనాత్మకతకు ఆది, అంతం లేదుగా*... ఉన్న బుర్రను వాడుకోవాలేగాని, ఈ భూమండలంలో తన ద్వారా జరగని పని ఏమీ లేనట్టుంది. పుట్టిన ఆది మానవుడు జంతువులతో సహవాసం చేసి వాటిని మచ్చిక చేసుకుని వాటితో జీవనం కొనసాగిస్తే, అంతరిక్షంలో గూడు కట్టుకునేలా తన విజ్ఞానాన్ని పెంచుకున్నా కూడా...జంతువుల, పక్షుల సాంగత్యాన్ని వదులుకోలేకున్నాడు... వాటి గొంతుకలను మట్టి మూకుడల్లో బందించి అమ్ముకుంటున్నాడు.. ఆ బుర్ర అమోఘం కదా. *ఒక మట్టి పాత్రలో మంచినీల్లు కలిపి ఊదితే అచ్చo పిచ్చుకల శబ్దాలు*. మట్టి పాత్రలో ఊదితే వచ్చే ఒక్క పిచ్చిక గొంతును చూసి మనం మురిసితే... మరి *తన గొంతితోనే అన్ని జంతువుల, పక్షుల గొంతుకలను పలికిన వీరప్పన్ ఎంత మురిసిండాలే* 😂 అది ఎంత విజ్ఞానం అయ్యిండాలి.ఏమైనాగాని.. *అన్నిటినీ వాడుకుంటున్న మనిషిని విజ్ఞానవంతుడనాలో, స్వార్ధపరుడనాలో ఆలోచించాలి*.తిరుపతిలో శ్రీవారి పాదాల వద్ద కొనుక్కున్న ఈ సాధనం భలే ఆలోచనను పెంచింది.

Tuesday, April 6, 2021

పిచ్చుక గూడ్లు_మన బంగ్లాలు

అనగనగనగనగా ఓ ఊరుందీ.. ఆ ఊరి చివరలో ఓ   పే  ద్ద మర్రి చెట్టుంది.ఆ చెట్టుకు చాలా పెద్ద పెద్ద కొమ్మలతో  పెద్దగా పరుచుకుని ఉన్నది. అన్ని కొమ్మలున్నా, నా గూడు బాగా ఉండాలని, ఎత్తులో ఉండాలనుకుని ఓ పక్షి  చాలా రోజులు కష్టపడి ఆ చెట్టు చిటారి కొమ్మన ఓ గూడు కట్టుకున్నదీ... కట్టెటప్పుడు అది పడ్డ కష్టం వర్ణణాతీతం...  దాని గూడు దానికి దానికి బహు అందంగా,సురక్షితంగా ఉన్నా, మనలాంటి వారు ఆ చెట్టుకిండ కూర్చుని పైకిచూస్తే అది పిచ్చుకంత పిట్టుగూడులాగే కనిపిస్తుంది.. అయినా అది నిజమే..
ఇక్కడా అంతే.. సేమ్ టూ సేమ్.
నా 4 అంతస్తుల ఇళ్ళు, నా డూప్లెక్స్, నా ఇంట్లో కిరాక్ మార్బుల్స్ వాడినా,  నా ఇంట్ళో మాంచి గార్డెన్ పెట్టినా అని మురిసిపోయే మనలాంటి వారం...ఆ పిట్టగూడుని కిందనుండి పైకి చూసినట్టుగా.. మన భవ్యమైన ఇండ్లను ఎత్తులోనుండి, అది దేవుని కొండలపైనుండి చూస్తే.. ఆ పిట్టగూడుకన్నా అద్వాన్నంగా కనిపిస్తాయి. ..
అందుకే ఈ దేవుల్లందరూ కొండల పైనుండి మనకు జ్ఞాపకం చేస్తుంటారు.. @తిరుమల కొండ నుండి తిరుపతి బైక్ పైన వచ్చేటప్పుడు ఈ ఆలోచనతో ఫోటో క్లిక్ క్లిక్. ఆ లైటులేకుంటే అస్సలే కనబడం మన అందమైన ఇండ్లు. *అందుకే సూస్క మురువద్దు..బీదలను మరవద్దు.