#శ్రీరామనవమి_2021 @ #రాచకొండ
రాచకొండలో రాతిరేళ #రాములోరికళ్యాణం #కమణీయం, రమణీయం...
గత నాలుగేండ్లుగా ఈ రాచకొండ రాములోరు మాకు ఆహ్వానం పంపుతానే ఉన్నాడు, మేమూ తప్పక పోతానే ఉన్నాము.
#కార్తీకపౌర్ణమి రోజున రాచకొండలో అఖండజ్యోతి వెలిగిస్తున్నందుకు శివపార్వతులే పిలుస్తరేమో అనుకున్నాం.. సీతారాములూ పిలుస్తున్నారు...సంతోషం*.
కానీ... పోతే ఊరికే కూర్చునే రకాలు కావుగా మనవాల్లవి, ఏదో ఒక పనిలో ఖచ్చితంగా ఉండాలంతే...
నిర్వాహకులు పని చెప్పకపోతే, మనవాల్లే ఆ పనిని దొరికించుకునే రకాలు.. మనవాళ్ళు ఎప్పుడూ అంతేగా..
ఈ సారి కూడా అంతే..
#శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే.......
#శ్రీరామజయరామజయజయరామ* స్మరణతో రాచకొండను మారుమ్రోగించారుగా..
అంతచేసి పెళ్ళి భోజనం చేయకుండా వస్తారా! అస్సల్ రారు, వస్తే వండుకుని తినాలెగా మరి. అందుకే మాంచి పెళ్ళి భోజనం ఆరగించి వస్తిమి.
కరోనా కాదుకదా దాని బందుగణం మొత్తం చుట్టుముట్టినా కొన్ని పనులు ఆగవు గాక ఆగవు. కాకుంటే కొంత ఉత్సాహం తక్కువైతదీ అంతే..
కట్టలకు కట్టలు పైసలు పంచి, తినిపించి, తాపించి ఎన్నికల సభలలకు బలవంతంగా పాల్గొని కరోనాను అంటించుకున్న దానికంటే... ఎవరి బలవంతం మీద రాకుండా, పిలవకనే వచ్చి, రామకళ్యాణానికి కట్నాలు, కానుకలు సమర్పించి సేవలో పాల్గొనేంత శక్తినిచ్చిన ఆ దైవానికి మొక్కకుండా ఉంటామా.. అదే సనాతన ధర్మం యొక్క శక్తి.
ప్రతీసారి రాత్రి 11కు ప్రారంభమై తెల్లవారులు కొనసాగే కళ్యాణo తదనంతర భోజనాలు, భజన కార్యక్రమాలు కరోనా కారణంగా 9 వరకే ముగిసాయి.
#శ్రీరామనవమి -2021 @ #రాచకొండ.
No comments:
Post a Comment