Friday, February 26, 2021

ఆలోచనలు ఆశలై... ఆశయాలై.. ఆచరణలుగా

ఆలోచనలు అశలై... ఆశలు ఆశయాలై...
   ఆశయాలు అచరణాలుగా మారి బుడి బుడి అడుగులేస్తున్నప్పుడు... ఆ అడుగుల  నిశబ్ద సవ్వడికు ప్రకృతితోడైతే మహా అద్బుత ఆవిష్కరణలు జరగవా?  ఖచ్చితంగా జరుగుతాయి.  ఆ బుడి బుడి అడుగుల వెంట మన అడుగులూ పడే అవకాశం చిక్కితే, ఆ ప్రకృతి మననూ ఆశీర్వదిస్తే... ఆ అనుభూతి అద్బుతం.. అనిర్వచనీయం. 

ఈ చదువులు మారాలి.

అవును.. 
అ చదువులు మారాలి....
బండెడు పుస్తకాలను బట్టే కొట్టించే చదువులు మారాలి..

పిల్లల సృజనను గుర్తించని చదువులు మారాలి..

చదువుకు సమజానికి మద్య అంతరాన్ని పూడ్చని చదువులు మారాలి...

చదువు సామాజిక హోదా కాదు _ చదువు సామాజిక భాద్యత అని నేర్పని చదువులు మారాలి...

ధర్మబద్దంగా జీవనం నేర్పని చదువులూ మారాలి...

అవునూ..... ఈ కాలం చదువులు మారాలి.

Monday, February 22, 2021

అధ్యాపక్ / ఉపాధ్యాయుడు / Teacher

తరగతి గదిలో దేశ భవిష్యత్తు అన్నారు పెద్దలు..

గుణసంపదగల వ్యక్తుల నిర్మాణం విధాలుగా ల నుండే జరగలి, తద్వార దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవ్వాలి అని ఆశించారు...
అలాంటి పవిత్రమైన, స్పూర్తివంతమైన వృతి ఉపాద్యాయ/ అద్యాపక వృత్తి..

ఒక విద్యార్థి ఎదుగుదలే ఆ దేశ ఎదుగుదలకు కారణముతుంది...
ఆలాంటి ప్రేరణాత్మక వృతిలోకి పూర్తి నిజాయితీగా ఉన్నవారు వస్తే ఆ ఫలితాలు అద్బుతంగా ఉంటాయి.
అవుసరం కొరకు, విలాసాల కొరకు డబ్బులు సంపాదించాలి అనుకునేవారికి అనేక రకాల వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉన్నది.. అలా చేసుకోవాలి అనుకున్నవారిని ఎవ్వరూ వద్దనరు, ఆపలేరు.. కావున రేపటితరం దేశ భవిష్యత్తును నిర్ణయించే దయచేసి  పవిత్రమైన, ప్రేరణాత్మకమైన అద్యాపక  వృత్తిలోకి రాకండి....

ఎవ్వరూ అన్యదా బావించరారు. ఆ వృత్తికి ఉన్న గౌరవన్ని కాపాడుకుందాం. రేపటి తరాన్ని తీర్చిదిద్దుకుందాం.

Tuesday, December 31, 2019

బడి పండగ-ఊరి పండగ

బడికోసం ఊరంతా ఏకమై..
బడి పండగను ఊరి పండగలా చేసిన.....ఊరు.

 అది ఒక చిన్న ఊరు...  హైదరాబాద్ కి దగ్గరలో ఉన్నా ఆశించినంత అభివృద్ది జరగలేదన్న వారితోఁ అందరూ ఏకీభవించాలసిందే..
ఆ ఊరివారందరికి, ముఖ్యంగా యువతకు ఊరి పట్ల అభిమానం ఎక్కువ.. ఇతరుల పట్లా ఆత్మీయత _ అభిమానాలూ ఎక్కువే.

40 సం.రాల క్రితం ఒక ప్రబుత్వ  ప్రాథమిక పాఠశాల ఆ ఊరిలో ప్రారంభించబడింది. ఆ ఊరిలో చదువుకున్న వారంతా అదే బడిలో చదివిన వారే.. ఉన్నత విద్య పక్క   గ్రామాల్లో, ఇతర అందుబాటులో ఉన్న స్థలాల్లో చదివారు. ఎవరికి నచ్చిన, చిక్కిన ఉద్యొగాల్లో, వృత్తుల్లో వారి జీవనం సాగిస్తున్నారు.
కానీ వారి ఆలోచన ఎప్పుడూ ఊరికోసమే... 
తమ పిల్లల భవిష్యత్తు కోసమే.  ఉన్నంతలో ఉన్నతంగా ఆలోచించి  ఊరి అభివృద్దికోసం అన్ని తారతమ్యాలు మరిచి ఆలోచించడం అందరికి ఆదర్శం.
ఇప్పుడు ఆ ఊరి బడి కోసమే తమ ఆలోచన.. *ఆ బడిలో చదివే బుడతలకు మంచి చదువును అందించడమే తమ ఆశయం అంటునారు*.
అందుకోసం ఊరంత ఏకమయ్యారు.
*40 సం.రాల క్రితం నుండి ఆ బడిలో చదివిన అందరినీ ఒకే వేదికగా కలిపారు*
 అప్పటి ఉపాద్యాయులనూ పిలిచి సన్మానాలు చేసారు.. నమ్రతతో నమస్కారాలు, పాదపూజలు చేసారు. ఇవి అన్ని పూర్వవిద్యార్థి సమ్మేళనాలలో జరిగేవే. 
కానీ ఈ ఊరి పూర్వవిద్యార్థి సమ్మేళనంలో ఇంకో గొప్ప నిర్ణయం జరిగింది. అదే ఊరి బడికి ఆసరవ్వాలని..
అనేక వ్యయ ప్రయాసలను భరిస్తూ తమ పిల్లలను దూరంగా ఉన్న పాఠశాలకు పంపుతున్నాం, ఇప్పటి నుండి ఆ నాణ్యమైన విద్య ఊరిబడిలోనే అందిద్దాo. అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేద్దామని సామూహిక నిర్ణయం తీసుకున్నారు..
అవుసరమైతే తమ సమయంలో కొంత_ సంపదలో కొంత ఊరిబడి కోసం అందిద్దాం అని నిర్ణయించి అందరికీ ఆదర్సంగా ఉందాం అనుకున్నారు. 
ఆలోచన అచరణ o కావాలని మనమూ ఆశిద్దాం.. అశీర్వదిద్దాం. అవసరమైతే సహాయమూ చేద్దాం..

ఇలాంటి మంచి ఆలోచన చేసి, ఆచరణలో చూపిన యువకులను అభినందిద్దాం... 
ఆ ఆలోచనల్లో మనకూ కొంత భాగస్వామ్యం ఇచ్చినందికు సంతోసిద్దాం.

జరగాలి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు- అవి కావాలి పల్లె ఆణిముత్యాల అభయహస్తాలు.

ఇంతకూ ఆ ఊరేదంటారా.. 
అది *బేగంపేట్,కందుకూర్ మండలం, రంగారెడ్డి జిల్లా*.

Tuesday, December 10, 2019

కుంగకు - పొంగకూ

కుంగకూ_ పొంగకూ..  తప్పదు.. తప్పూ కాదు.

కంత్రీ పనులు చేసేటోల్లె కాలర్ ఎగరేసి చేస్తున్నారు.. మంచి చేసేటోడు అందరికీ భయపడుతూ పని చేయాలా అనే అలోచనే వద్దు..
నీ పనీ అంతే ఖచ్చితంగా చేయు ఎవరొద్దన్నరు.

అవును అందరినీ సంతృప్తి పరచాలన్న ఒక ఆశమాత్రం తీసేయ్. మన పని అందరికీ మంచిది కావాలన్న అత్యాశను తరిమెయ్. నీ పనిని మాత్రం  నిజాయితీగా చెయ్.. కాస్త అటోఇటో అన్నీ సవ్యంగా జరుగుతయ్. అంతేగా ఎదైన చేస్తేనే గా పొరపాట్లు జరిగేది. ఏమీ చేయకుంటే ఏమీ జరగదు. పొరపాట్లకు కుంగకు_ అభిమానానికి పొంగకు.. నామ్ జప్ తే రహో కామ్ కర్ తే చలో

VOLUNTEER _ కార్యకర్త

చిన్న చిన్న పనులే అప్పుడప్పుడు గొప్ప ఆనందాన్ని, అనుభూతిని జరంత శక్తినీ ఇస్తాయి.

  మన పని కాని ఒక పనికోసం వెచ్చించిన ప్రతీ క్షణం అమూల్యమైనది.. నలుగురు చూసి దండం పెడతరా, దండలేస్తరా అనే యావ ఆ పనిలో ఉన్నోల్లకు ఎప్పుడూ ఉండొద్దు.. నిజాయితీగా చేసేటోల్లకు ఉండదు కూడా.
 కానీ అది పదుగురికి ఉపయోగపడేదే అయితే కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా దాని ఫలితం సమాజానికి అందుతుంది...  అందితీరుతుందీ.
అలాంటి  పలితంలో బాగస్వాములైన వారికి దక్కే అంతర్గత మానసిక శక్తి అద్భుతంగా ఉంటుంది.
పల్లె ఆణిముత్యాల ప్రగతికోసం సిద్దమవుతున్న  *సాధన కుటీర్* కోసం తమ అమూల్యమైన సమయం వెచ్చిస్తున్న కార్యకర్తలకు అదే చెందుతుంది. చెందాలని ఆశిద్దాం.
;~ GSF.

Wednesday, December 4, 2019

బహు పరాక్ - బహుపరాక్

ప్యారే మిత్రో....
బహు పరాక్... బహు పరాక్.

ఈ ఫోటోలలో కనిపిస్తున్న వ్యక్తి 1990 తర్వాత అనేక రకాలైన ....... కార్యక్రమాలు  చేస్తూ తప్పించుకుంటూ అనేక చోట్ల తిరుగుతున్నాడు. 
మన కండ్ల ముందే కదలాడుతూ అనేక రకాల....... కార్యక్రమాలు చేస్తూ అలా ఇలా తిరుగితున్నాడు..
పట్టుకుందామంటె దొరకక, పొరపాటున దొరికినా జారి జారి పోతూ మల్లా  అలాంటి కార్యక్రమాలే చేస్తున్నాడు..
అందుకే అతని 90 సం.రం నుండి సేకరించిన కొన్ని  చిత్రాలను అన్ని.........స్టేషన్లలో పెడుతున్నాము. మన పరిసరాలలోనే సంచరిస్తున్నాడు.
కనిపించినవారు తమ తమ అందుబాటులో ఉన్న ........ స్టషన్లో తెలుపగలరు. ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడదు. అప్పగించిన వారికి మాత్రమే ఇవ్వబడును.
అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం.
(చిత్ర విచిత్రమైన చిత్రాలెన్నో ఇంకా ఉన్నాయి. బాగుండదని అన్నీ చూపట్లేదు😀)