చిన్న చిన్న పనులే అప్పుడప్పుడు గొప్ప ఆనందాన్ని, అనుభూతిని జరంత శక్తినీ ఇస్తాయి.
మన పని కాని ఒక పనికోసం వెచ్చించిన ప్రతీ క్షణం అమూల్యమైనది.. నలుగురు చూసి దండం పెడతరా, దండలేస్తరా అనే యావ ఆ పనిలో ఉన్నోల్లకు ఎప్పుడూ ఉండొద్దు.. నిజాయితీగా చేసేటోల్లకు ఉండదు కూడా.
కానీ అది పదుగురికి ఉపయోగపడేదే అయితే కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా దాని ఫలితం సమాజానికి అందుతుంది... అందితీరుతుందీ.
అలాంటి పలితంలో బాగస్వాములైన వారికి దక్కే అంతర్గత మానసిక శక్తి అద్భుతంగా ఉంటుంది.
పల్లె ఆణిముత్యాల ప్రగతికోసం సిద్దమవుతున్న *సాధన కుటీర్* కోసం తమ అమూల్యమైన సమయం వెచ్చిస్తున్న కార్యకర్తలకు అదే చెందుతుంది. చెందాలని ఆశిద్దాం.
;~ GSF.
No comments:
Post a Comment