బడికోసం ఊరంతా ఏకమై..
బడి పండగను ఊరి పండగలా చేసిన.....ఊరు.
అది ఒక చిన్న ఊరు... హైదరాబాద్ కి దగ్గరలో ఉన్నా ఆశించినంత అభివృద్ది జరగలేదన్న వారితోఁ అందరూ ఏకీభవించాలసిందే..
ఆ ఊరివారందరికి, ముఖ్యంగా యువతకు ఊరి పట్ల అభిమానం ఎక్కువ.. ఇతరుల పట్లా ఆత్మీయత _ అభిమానాలూ ఎక్కువే.
40 సం.రాల క్రితం ఒక ప్రబుత్వ ప్రాథమిక పాఠశాల ఆ ఊరిలో ప్రారంభించబడింది. ఆ ఊరిలో చదువుకున్న వారంతా అదే బడిలో చదివిన వారే.. ఉన్నత విద్య పక్క గ్రామాల్లో, ఇతర అందుబాటులో ఉన్న స్థలాల్లో చదివారు. ఎవరికి నచ్చిన, చిక్కిన ఉద్యొగాల్లో, వృత్తుల్లో వారి జీవనం సాగిస్తున్నారు.
కానీ వారి ఆలోచన ఎప్పుడూ ఊరికోసమే...
తమ పిల్లల భవిష్యత్తు కోసమే. ఉన్నంతలో ఉన్నతంగా ఆలోచించి ఊరి అభివృద్దికోసం అన్ని తారతమ్యాలు మరిచి ఆలోచించడం అందరికి ఆదర్శం.
ఇప్పుడు ఆ ఊరి బడి కోసమే తమ ఆలోచన.. *ఆ బడిలో చదివే బుడతలకు మంచి చదువును అందించడమే తమ ఆశయం అంటునారు*.
అందుకోసం ఊరంత ఏకమయ్యారు.
*40 సం.రాల క్రితం నుండి ఆ బడిలో చదివిన అందరినీ ఒకే వేదికగా కలిపారు*
అప్పటి ఉపాద్యాయులనూ పిలిచి సన్మానాలు చేసారు.. నమ్రతతో నమస్కారాలు, పాదపూజలు చేసారు. ఇవి అన్ని పూర్వవిద్యార్థి సమ్మేళనాలలో జరిగేవే.
కానీ ఈ ఊరి పూర్వవిద్యార్థి సమ్మేళనంలో ఇంకో గొప్ప నిర్ణయం జరిగింది. అదే ఊరి బడికి ఆసరవ్వాలని..
అనేక వ్యయ ప్రయాసలను భరిస్తూ తమ పిల్లలను దూరంగా ఉన్న పాఠశాలకు పంపుతున్నాం, ఇప్పటి నుండి ఆ నాణ్యమైన విద్య ఊరిబడిలోనే అందిద్దాo. అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేద్దామని సామూహిక నిర్ణయం తీసుకున్నారు..
అవుసరమైతే తమ సమయంలో కొంత_ సంపదలో కొంత ఊరిబడి కోసం అందిద్దాం అని నిర్ణయించి అందరికీ ఆదర్సంగా ఉందాం అనుకున్నారు.
ఆలోచన అచరణ o కావాలని మనమూ ఆశిద్దాం.. అశీర్వదిద్దాం. అవసరమైతే సహాయమూ చేద్దాం..
ఇలాంటి మంచి ఆలోచన చేసి, ఆచరణలో చూపిన యువకులను అభినందిద్దాం...
ఆ ఆలోచనల్లో మనకూ కొంత భాగస్వామ్యం ఇచ్చినందికు సంతోసిద్దాం.
జరగాలి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు- అవి కావాలి పల్లె ఆణిముత్యాల అభయహస్తాలు.
ఇంతకూ ఆ ఊరేదంటారా..
అది *బేగంపేట్,కందుకూర్ మండలం, రంగారెడ్డి జిల్లా*.
No comments:
Post a Comment