దైవానికి భయపడకున్నా......
కాలానికి మాత్రం భయపడి తీరాలి.
మనం దైవానికి భయపడకున్నా కానీ,
కాలానికి మాత్రం భయపడి తీరాలి.
ఎందుకంటే...
దైవంతో సహా.. ఈ సృష్టి అంతా
కాలం కనుసన్నల్లోనే నడుస్తుంది.
ధనార్జనతో, జ్ఞానార్జనతో కాకుండా
కాలం యొక్క కరుణ, కటాక్షంతోనే
జీవుల/మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది.
కాలం కడుపులో
ప్రళయాలు ఉన్నాయి l..
విలయాలు ఉన్నాయి...
విపత్తులు ఉన్నాయి,
సంపత్తులు ఉన్నాయి
సంతోషాల సంబరాలు ఉన్నాయి..
కాలం, సత్సంబంధాలు కొన్నింటిని
దృఢమైన బంధాలు కొన్నింటిని,
ఆత్మీయ బంధాలను కొన్నింటిని
జడత్వంతో కూడుకున్న బంధాలు,అనుబంధాలను కొన్నింటిని కలిపి,తమాషా చేస్తుంటది.
ప్రశాంతమైన మనసును,
కాల పరిస్థితులకు అనుసంధానం చేస్తే
మనసు మీద ఉన్న మాయా ముసుగు తొలగి,
వాస్తవ పరిస్థితి ఏంటో అవగాహన అవుతుంది.
ఎందుకంటే
కొన్ని అందినట్లే అంది చేజారి పోతుంటాయి
కొన్నింటిని కలిపినట్లే కలుపుతుంటది.
అంతలోనే, ఆందోళనకు గురి చేస్తుంటది.
*******************//***********
No comments:
Post a Comment