Sunday, December 31, 2023

క్షేత్ర సందర్శన ఆహ్వానం to MLA

హరివర అఖండక్షేత్రం, పెద్దచెరువు కొనకట్ట, వీరపట్నo.
యువత ఉన్నతంగా ఎదిగి, తమ కుటుంబానికి, తమ ప్రాంతానికి నిస్వార్థ సేవ చేయడానికి ప్రేరణా శక్తిగా నిలవడంతో పాటు.....
*వీరపట్నం పరిసర ప్రాంతాలు సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ నిర్మించ తలపెట్టిన 108అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణ స్థలం "హరిహర అఖండక్షేత్రo"లో జనవరి 9వ తేదీ, మంగళవారం  జరిగే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవానికి గౌరవ శాసన సభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారిని ఆహ్వానించిన అఖండక్షేత్ర సమితి సభ్యులు*.
కలిసిన వారిలో అఖండక్షేత్ర   వ్యవస్థాపకులు సదా వెంకట్ గారితో పాటు
 పాండు రంగా రెడ్డి, శ్రీ ఈ వెంకట్ రెడ్డి కౌన్సిలర్, శ్రీ నందు కౌన్సిలర్, శ్రీ రమేష్, చందూ తదితరులు ఉన్నారు.
 
09.01.2024 రోజున  *శ్రీ జగద్గురు శంకరాచార్యులు, హంపీ విరూపాక్ష   విద్యారణ్య మహా సంస్థాన పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ క్షేత్ర సందర్శనకు విచ్చేసి అందరికీ ఆశీస్సులు అందిస్తారు.*.
:~ సదా వెంకట్,
Founder,
 హరివర అఖండ క్షేత్రసమితి & వీరపట్నo అఖండ ట్రస్ట్.

Sunday, December 24, 2023

జనారణ్యంలో మృగరాజులా...

జన మహా అరణ్యంలో..
 ఓ మృగ మహారాజులా జీవించాలి...
******************************
సంసారిక జీవనం అయినా..
 సన్యాసి ప్రస్థానం అయినా...
ఓ యుద్ధక్షేత్రం లాంటిది.

నైరాస్యం, వైరాగ్యం ఎప్పటికీ దరిచేరనివ్వద్దు.
మన బాధ్యత ఉన్నంతకాలం వరకు...
నిక్కచ్చిగా మన కర్తవ్యాన్ని,
 మనం నిర్వర్తించాల్సిందే... 

అనగదొక్కాలని, 
అవరోధాలు సృష్టించాలని 
మన చుట్టప్రక్కన ఉన్నవాళ్లే  అదనుచూసి మనను
దెబ్బ వేయాలని చూస్తుంటారు..
అన్నింటినీ గమనిస్తూ అడవిలో వేటాడే సింహం లాగా 
మన ఆహార్యం ప్రపంచానికి కనిపిస్తుండాలి.

పరిపరి విధాల జనాలు...
వివిధ భావజాలాల మనస్తత్వాలు...
ఒకడు ఈసరించుకుంటాడు,
మరొకడు పడనివ్వడు,
వేరొకడు కుదరనివ్వడు, 
ఇంకొకడు ఇరకాటంలో పెడుతుంటాడు....

అందరివీ వినాలి, అన్నింటినీ చూడాలి 
అవసరo అనిపిస్తేనే స్పందించాలి..
కొన్నింటిని ఆకలింపు చేసుకోవాలి,
కొందరి మనస్తత్వాలను అవతలికి విసిరేయాలి...
సాధ్యమైనంత వరకు, 
సంఘర్షణకు దూరంగా ఉండాలి
తప్పదనుకున్నప్పుడు తాడోపేడో తేల్చాలి.... 

నీ అతి మంచితనంతో... 
అవతలివాడు నిన్ను బలహీనంగా అంచనా వేస్తే..
నీ మనుగడకే ప్రమాదం, 
అందుకే నీవు మాత్రం...
ఈ జన మహా అరణ్యంలో...
ఓ మృగ మహారాజులా జీవించాలి.

Sunday, December 17, 2023

EMINENT PERSONALITY

One more step forwarded.... 
met Another Eminent personality..      
ఇంకో అసాధారణ వ్యక్తిత్వoతో కలయిక..  ఉన్నత స్థాయి హోదాలో ఉన్నా ఎలాంటి అధికార దర్పం చూపక సాధారణంగా ఉండే వ్యక్తి...     
గత 10 ఏళ్లుగా మన పని పట్ల అంతే ఆదరణ చూపే శివధర్ రెడ్డి గారు,IPS... ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్... అయినా వ్యక్తిత్వంలో మార్పు లేదు.
వారు Intelligene Chief అయిన  వారం రోజు తరువాత కలిసిన సందర్భం.

Wednesday, December 13, 2023

పరాన్న జీవులు

ఈ భూమండలంలో అన్నీ  పరాన్న జీవులే...              
ఒక జీవి ఇంకో జీవికి ఆహారం.. అయినా దేవుడు ఊరికే తెచ్చి నోట్లో పెట్టడు.. స్వశక్తితో సేకరించాలని అన్ని జీవులకు కొంత బుద్ది, ఇంకొoత శక్తీ ఇచ్చాడు... వాటిని సక్రమంగా వాడాలి... అది అక్రమం అయినప్పుడే ప్రకృతి రెక్కలు ఇరుస్తది.. నీకు నీవుగా సక్రమంగా చేసే ఎంతటి సాహసానికైనా ప్రకృతి గుప్త సహకారం ఇస్తుంది...అది స్వార్థం, అక్రమంవైపు అడుగులు పడితే... ప్రకృతి WatchDog అయ్యి తన ఉపకరణాలకు ఉప్పందిస్తది.. అప్పుడు ఆ ఉపకరణాలు ఒక్కొక్కటిగా చుట్టుముట్టి స్వార్థపు  రెక్కలు విరుస్తాయి..   సమాజహితం కోరి నిజాయితీగా జరిగే ప్రతీ కార్యానికి, ఆలస్యమైనా సరే ప్రకృతి అండ తప్పనిసరిగా ఉంటుందనేది పచ్చి నిజం.....
ఇలాంటి వాటికి చరిత్రలో లెక్కకు మించి సాక్ష్యాలున్నా, ఇదే సత్యమని చూపే బోలెడు ఉదాహరణలు కళ్ళ ముందు ఉన్నా.... నమ్మక నమ్మి ముందుకే సాగే స్వార్ధపు రెక్కలు విరగడం తథ్యం...జాగ్రత్త అవసరం.