భయపడ్డావంటే... నీడకూడా నిన్ను భయపెడుతుంది.
....…...................
స్పందించే వాటికి స్పందిస్తుండాలి...
కొన్నింటితో రాజీ పడుతుండాలి..
మరికొన్నింటికి సంఘర్షణతోనే సమాధానం చెబుతుండాలి.
పరిస్థితులు.. మనిషిని లొంగదీసుకోవాలని చూస్తాయి.
కానీ ఎక్కడా తగ్గేదిలేదు,
ఎప్పుడూ నీవు నీలానే ఉండాలి.
ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు భయపడినావంటే...
నీ నీడకూడా నిన్ను భయపెట్టిస్తుంది.
కొన్ని పరిస్థితులు సంతోషాన్ని కలిగిస్తాయి...
మరికొన్ని బాధలను కలిగిస్తాయి...
మరికొన్ని అచేతనానికి గురి చేస్తుంటాయి.
నీవు సాత్వికంగా ఉంటూనే...
అడిగినా,
అడగకున్నా అడుగడుగునా
నీవు ఇతరులకు సహాయపడే వాడివైనప్పటికీ...
జనాలు నిన్ను మెచ్చుకోరు,
నీ విలువైన మాటను ఒప్పుకోరనే సత్యాన్ని గ్రహిస్తూ జీవించాలి.
సమస్యలు,
పెను సవాళ్లను విసురుతుంటాయి,
ప్రేరణను కలిగిస్తుంటాయి,
మరికొన్ని, నీ శక్తి సామర్ధ్యాలకు సాన పెడుతుంటాయి..
పరీక్ష పెడుతుంటాయి.
అవన్నీ కూడా..
నీ పట్టుదలకు సాహసానికి
ఓ ప్రయోగశాల లాంటివి,
తప్పదన్నప్పుడు,
తెగువను చూపాలని గుర్తు చేస్తుంటాయి.
బంధు సమూహాన్ని చూసి ఉప్పొంగిపోవద్దు..
పరిస్థితులకు, మనుషుల ముందు
అలుసు అయినావంటే..
అందరూ రాబందులుగా మారి,
నిన్ను పీక్కతినాలని చూస్తారు.
మనుషులు తమ మనసును... ఊసరవెల్లి రంగుల కన్నా
ఎక్కువగా మార్చుతుంటారు...
జర జాగ్రత్త..
ఆపద,అవసరం పడినప్పుడు ఎవ్వడు ఎటువంటి వాడనేది తెలుస్తుంది.
అందుకే ఎవ్వడి మీద కూడా వెంటనే
నిశ్చితమైన అభిప్రాయానికి రారాదు..
No comments:
Post a Comment