పట్టిన గ్రహణం వీడాలి_. పూర్వవైభవం రావాలి...
Facebook post of 12.05.2019
ఇది పాలకుల పరిహాసమా, పాలితుల చైతన్య లోపమా, అధికారుల అలసత్వమా లేక ఈ ప్రాంత దురదృష్టమా అని ఆలోచిస్తూనే మన చరితను మనమే తిరగ రాసుకునే ప్రయత్నం జరగాలి..
రాష్ట రాజదానికి కూతవేటు దూరంలో ఉండి ఎన్నో ఖగోళశాస్త్ర పరిశోదనలకు, ఎందరో విదేశి శాస్త్రవేత్తలను సైతం ఆకర్షించిన మన #జాపాల_రంగాపూర్ ప్రయోగశాల నేటి స్థితికి అందరం చింతించాలి... అవుసరమైతే బాదితులను చీదరించుకోవాలి.. తప్పదు మరి.
70 సం.రాల క్రితమే, 220 ఎకరాల సువిశాల స్థలంలో, మెండైన సౌకర్యాలు లేకున్నా అనేక వ్యయ ప్రయాసలకోర్చి ఏర్పాటు చేసిన నక్షత్రశాల నిర్లక్షానికి గురికావడం బాదకరమే.
ఇన్నాళ్ళు... ఏవేవో కారణాల చేత, ఎవరో మన అభివృద్దిని అడ్డుకున్నారని అన్నాం, మా ప్రాంతాలు వెనక బడలేదు, పడవేయబడ్డాయి అన్నాం... ఇప్పుడు అలాంటి వాటిని సరిదిద్దుకునే అవకాశం మనకు దొరికింది.. అతివేగంగా కాకపోయినా ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ది జరగాల్సిందే. జరగడానికి మెండుగా అవకాశాలూ ఉన్నాయి..
220 ఎకరాల్లో ఒక విశ్వవిద్యాలయాన్నే ఏర్పాటు చేయవచ్చు.. అందునా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అతి చేరువలో, అనుబంధంగా ఉంది #JRO. అనేక రకాల విద్యాసంబంద విషయాలకు నిలయంగా మార్చుకునే పుష్కల అవకాశం ఉన్న ప్రాంతం. అభివృద్ధితో ఈ ప్రాంతపు నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉపాది కల్పించొచ్చు, పరోక్షంగా అనేక మందికి ఉపాది చూపొచ్చు... ఎందరో రేపటి తరం శాస్త్రవేత్తలను సమాజానికి అందించవచ్చు...ఒక మహా విద్యా క్షేత్రంగా ఈ ప్రాంతాన్ని నిలుపొచ్చు..
పాలకులు, పాలితులు, అదికారులు ఈ ప్రాంత అభివృద్ది కోరే అనేకులు ఆ వైపుగా ఆలోచించాలి.. అలోచిస్తారని ఆశిస్తున్నాం..
ఈ ప్రాంత అభివృద్దిని కాంక్షిస్తూ , #జాపాల_రంగాపూర్ #నక్షత్రశాల పూర్వవైభవం కావాలని కోరుతూ త్వరలో ఒక కార్యాచరణ ఉంటుంది.. అవకాశం ఉన్న అందరం బాగస్వాములం అవుదాం.
పట్టిన గ్రహణం వీడాలే.. నక్షత్రశాలకు పూర్వవైభవం రావాలంటే.. పోరాటం తప్పదేమో.. విధానమే వేరుండాలి.
తెలంగాణీయులకు పోరాటాలే శరణ్యం అని చెప్పిన మాట వాస్తవమే నేమో..
#SaveJRO #Observatory #OU #ScienceLab #OsmaniaUniversity #Scientists
No comments:
Post a Comment