*బలమే మన మిత్రుడు - బలహీనమే మన శత్రువు*.
శత్రువెవడో, మిత్రుడెవడో.. గమనిస్తూ బాద్షాలా బ్రతుకాలి
~~~~~~~~~~~
నీవు ఎదుగుతున్నప్పుడు
ఈర్ష్య, ధ్వేషాలతో కూడిన సమూహం కూడా నీ ప్రక్కనే ఉంటుంది,
జాగ్రత్తగా గమనించాలి..
అందులో...శత్రువు ఎవడో...
మిత్రుడు ఎవడో
తెలుసుకోవడం చాలా కష్టం.. ప్రకృతి మీద బారం.
ఆజాత శత్రువునని నీకు నీవు భావించుకున్నావంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకొన్నట్లే...
పరిస్థితుల ప్రభావంతో.. సమయాన్ని బట్టి
ఎవ్వడు ఏ అవతారన్నైనా ఎత్తెదరు...
అందకే, ఎదుటివాడిపై
వెంటనే ఓ నిర్ణయానికి మాత్రం రారాదు..
ఈ కలియుగంలో...
జగత్ప్రసిద్ది గాంచిన, బాగా ఆరితేరిన నటీ, నటులెందరో! గుర్తించి అవార్డ్స్ ఇవ్వలేము.
ఓ కంట కన్నీరును..
మరోకంట పన్నీరును పంచే
మహానటులే చాలావరకు తారసపడెదరు.. జాగరూకత అవసరం.
ఎ వ్వ డి ఆలోచనా వాడిదే...!
అందరూ వాడి వాడి సమస్యలను,
కష్టాలను మాత్రమే పట్టించుకోవాలనుకొంటాడు తప్పా...
ప్రక్కనున్నోడి ఆపద,
యిబ్బందులను మాత్రం లెక్కచెయడు,
వాడికక్కరలేదు..
అది నిజమే...ఎవరి అవసరాలు వాడివి..
అయినా ఈసడించుకోవద్దు, గుర్తించి మెలుకోవాలి.
ఈ క్షణం నీవు చూసిన ప్రపంచం, మరుక్షణమే మారిపోవును..
ఎప్పటిలెక్క అప్పుడే...
ఆఖరికి నీకళ్లే...
నిన్ను మోసగించినవి అన్నట్లుగా భ్రాంతికి లోనయ్యెదవు. ఏమి ఇబ్బంది పడొద్దు అది సహజం...జాగ్రత్త అవసరం.
జరిగే...మోసాలకు, వింత సంఘటనలకు
ఎటువంటి మొనగాడు అయినా...
లోలోనే కుమిలిపోవడం తప్పా...
ఎవ్వరికీ చెప్పకోలేడు.
అన్నిటికీ సిద్ధపడి పయనించాలని.
ఒకవేళ... చెప్పుకొన్నా..
వెళాకోళం తప్పా
ఎవ్వడు కూడా..
కనీసం నీబాదను వినాలని చూడడు
అందుకే... చెప్పుకొని రెట్టింపు బాదను పొందేకన్నా..
అన్నింటినీ మరచి, మింగేసి *బాద్షాలాగా... బ్రతుకాలి*.
అలా నిలచిన వీరులు, యోధులు ఎందరో...
అనేకంటే అలాంటి వారే యోధులు అనాలేమో...
*బలమే జీవనం - బల హీనమే మరణం.*
~~~~~~~~~~~~~~~~//~~~~~~~~~~~
No comments:
Post a Comment