Monday, May 1, 2023

ఆఖరి క్షణం వరకు సమాజహితం

ఒక ఆశయం అంటూ ఉండాలే గానీ జీవితపు ఆఖరి క్షణం వరకు సమాజహితం కోసం ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన ఉంటుంది..
ఆలోచనలు ఆశయం వైపూ అడుగులు పడతాయి.
మనకున్న రెండు కాళ్ళు ఆ నడకకు సహకరించకున్నా ఇంకొకరి సహకారంతో ఆలాంటి పనిలో బాగస్తులమవుతారు కొందరు..
అలాంటి వారి ఆశయానికి ఇంకొందరు ఆసరాగా ఉంటారు.. 
ఉన్నత స్థితలో ఉద్యోగం చేసి, అవసాన దశలో కూడా సమాజానికి కొంత ఆసరవ్వాలని, ఉన్నదానిలో కొంత సమాజహితం కోసం వితరణ చేయాలన్న ఆశయంతో వెతుక్కుంటూ వచ్చిన పెద్దావిడ.. ఆమెకి తోడుగా హితకారులు..
అటు మాతాపితరుల సేవాసదనం ఇటు సాధన కుటీర్ సందర్శన..
నడవలేని వయసులో ఆ ఆలోచన గొప్పది, అది ఆచరణ కోసం పడ్డ నాలుగు కాళ్ళ అడుగులు ఇంకా గొప్పవి..
ప్రణామాలు🙏🙏.

No comments:

Post a Comment