Sunday, May 21, 2023

ధర్మమే గెలుస్తుంది

జై🚩 శ్రీ రాం 
అరాచక శక్తులు బలం పుంజుకుంటున్నపుడు ఆధిపత్యం పొందుదామనుకుంటున్నపుడు 
ధార్మిక విశ్వ శక్తులు పునరేకీకరణ చెందుతాయి..
నర,వానరం దండు అయ్యి కదులుతాయి..

సంజీవని అందుకున్న లక్ష్మణులు రెట్టింపు బలంతో పెద్దన్న భుజం కాస్తారు..

ధర్మ పురుషుడి అనుచరులు అమాంతం ఎగసి పడిన అంజనీ పుత్రులై ప్రభువు పట్ల తమ విధేయతను విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తారు..

అహం నిండిన సహస్ర కంఠ రావణుల కుత్తుకలు తెగి పడతాయి..

యుధ్దం జరుగుతుంది
ధర్మం గెలుస్తుంది
ధర్మమే గెలుస్తుంది 
ఆచంద్ర తారార్కం భారత్ కీర్తి పతాక కాషాయ సూర్యుడే అయి విశ్వానికి వెలుగులు ఇస్తుంది..        

Vaccine మైత్రి పేరుతో చిన్న చిన్న దేశాలకి పెద్దన్న గా వ్యవహరించిన భారత్ ఈ రోజు ఈ గౌరవం పొందడానికి కారణం..
జై శ్రీరామ్ 🚩

(సమ్మిళిత సేకరణ SM)

Saturday, May 20, 2023

Hanuman Trophy _2014

INAUGURATION program of HANUMAN TROPHY-2014
VOLLEYBALL TOURNAMENT @ Nandiwanaparthi. 
Local 2 Sub-Inispectors, 
Vlg Sarpach n  youth were Participated.... 
Started vth energetic match btvn IBP n NWP.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02PQRfx6LKqT3NErZuAC5ib4rqE3iosjeA4JtdQtjPDmSji8iUMfXYriBZWeodcVk3l&id=100002143544899&mibextid=Nif5oz

కాల నిర్ణయo

A Facebook post of 21.05.2019
ఒక కారణమంటూ లేకుండా ఏ కలయిక జరగదు....
కొన్ని ప్రకృతి ప్రసాదిత నిర్ణయాలు ఇంకా ఖచ్చితంగా జరుగుతాయి..
అనుమానమే అక్కరలేదు..
మన సంకల్పం మంచిదైతే  శక్తి వెతుక్కుంటా వస్తుందనేది పచ్చినిజం..

సంకల్ప సాకారానికి  ఎవరున్నా,లేకున్నా  చిట్టచివరి వరకు నీ దారిలో అడుగులు నీవు వేస్తే....ఎవరిని ఎప్పుడు కలపాలో, ఎవరిని ఎప్పుడు జరపాలో ఆ ప్రకృతి చూసుకుంటుంది. మనం చేయాల్సిందల్లా మన పనిలో నిజాయితిని కాపాడుకోవడమే..

Sunday, May 14, 2023

బలమే మిత్రుడు - బలహీనతే శత్రువు

*బలమే మన మిత్రుడు - బలహీనమే మన శత్రువు*.
శత్రువెవడో, మిత్రుడెవడో.. గమనిస్తూ బాద్షాలా బ్రతుకాలి
~~~~~~~~~~~

                       నీవు  ఎదుగుతున్నప్పుడు
ఈర్ష్య, ధ్వేషాలతో కూడిన సమూహం కూడా నీ ప్రక్కనే ఉంటుంది,
జాగ్రత్తగా గమనించాలి..
అందులో...శత్రువు ఎవడో...
మిత్రుడు ఎవడో
తెలుసుకోవడం చాలా కష్టం.. ప్రకృతి మీద బారం.

ఆజాత శత్రువునని నీకు నీవు భావించుకున్నావంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకొన్నట్లే... 
పరిస్థితుల ప్రభావంతో.. సమయాన్ని బట్టి 
ఎవ్వడు ఏ అవతారన్నైనా ఎత్తెదరు...

అందకే, ఎదుటివాడిపై
వెంటనే  ఓ నిర్ణయానికి మాత్రం రారాదు..

ఈ కలియుగంలో...
జగత్ప్రసిద్ది గాంచిన, బాగా ఆరితేరిన  నటీ, నటులెందరో! గుర్తించి అవార్డ్స్ ఇవ్వలేము.

ఓ కంట కన్నీరును..
మరోకంట పన్నీరును పంచే
మహానటులే చాలావరకు తారసపడెదరు.. జాగరూకత అవసరం.

ఎ వ్వ డి ఆలోచనా వాడిదే...!
అందరూ వాడి వాడి సమస్యలను,
కష్టాలను మాత్రమే పట్టించుకోవాలనుకొంటాడు తప్పా...
ప్రక్కనున్నోడి ఆపద,
యిబ్బందులను మాత్రం లెక్కచెయడు,
వాడికక్కరలేదు..
అది నిజమే...ఎవరి అవసరాలు వాడివి..
అయినా ఈసడించుకోవద్దు, గుర్తించి మెలుకోవాలి.

ఈ క్షణం నీవు చూసిన ప్రపంచం, మరుక్షణమే మారిపోవును..
ఎప్పటిలెక్క అప్పుడే...
ఆఖరికి నీకళ్లే...
నిన్ను మోసగించినవి అన్నట్లుగా భ్రాంతికి లోనయ్యెదవు. ఏమి ఇబ్బంది పడొద్దు అది సహజం...జాగ్రత్త అవసరం.
జరిగే...మోసాలకు, వింత సంఘటనలకు
ఎటువంటి మొనగాడు అయినా...
లోలోనే కుమిలిపోవడం తప్పా...
ఎవ్వరికీ చెప్పకోలేడు.
అన్నిటికీ సిద్ధపడి పయనించాలని. 

ఒకవేళ... చెప్పుకొన్నా..
వెళాకోళం తప్పా
ఎవ్వడు కూడా..
కనీసం నీబాదను వినాలని చూడడు
అందుకే... చెప్పుకొని రెట్టింపు బాదను పొందేకన్నా..
అన్నింటినీ మరచి, మింగేసి *బాద్షాలాగా...  బ్రతుకాలి*.
అలా నిలచిన వీరులు, యోధులు ఎందరో...
అనేకంటే అలాంటి వారే యోధులు అనాలేమో...

*బలమే జీవనం - బల హీనమే మరణం.*
~~~~~~~~~~~~~~~~//~~~~~~~~~~~

Thursday, May 11, 2023

సంకల్పశక్తి అన్నీ అధిగమిస్తుంది

జ్ఞానం పెరిగేకొద్ది మనిషికి తన మనసుపై అధికారం వస్తుంది. తన బలహీనతలను అధిగమించడమే జ్ఞానం...
దానితో పాటు....
మనిషి  అవసరాలకు  అవరోధాలుగా  ఉన్న అన్ని అవరోధాలను అధిమించే శక్తిని ప్రకృతి ప్రసాదిస్తుంది.

గ్రహణం వీడాలి @ SAVE JRO

పట్టిన గ్రహణం వీడాలి_. పూర్వవైభవం రావాలి...
Facebook post of 12.05.2019
ఇది పాలకుల పరిహాసమా, పాలితుల చైతన్య లోపమా, అధికారుల అలసత్వమా లేక ఈ ప్రాంత దురదృష్టమా అని ఆలోచిస్తూనే మన చరితను మనమే తిరగ రాసుకునే ప్రయత్నం జరగాలి..

రాష్ట రాజదానికి కూతవేటు దూరంలో ఉండి ఎన్నో ఖగోళశాస్త్ర పరిశోదనలకు, ఎందరో విదేశి శాస్త్రవేత్తలను సైతం ఆకర్షించిన మన #జాపాల_రంగాపూర్ ప్రయోగశాల నేటి స్థితికి అందరం చింతించాలి... అవుసరమైతే బాదితులను చీదరించుకోవాలి.. తప్పదు మరి.
70 సం.రాల క్రితమే, 220 ఎకరాల సువిశాల స్థలంలో, మెండైన సౌకర్యాలు లేకున్నా అనేక వ్యయ ప్రయాసలకోర్చి ఏర్పాటు చేసిన నక్షత్రశాల నిర్లక్షానికి గురికావడం బాదకరమే. 
 ఇన్నాళ్ళు...  ఏవేవో కారణాల చేత, ఎవరో మన అభివృద్దిని అడ్డుకున్నారని అన్నాం, మా ప్రాంతాలు వెనక బడలేదు,  పడవేయబడ్డాయి అన్నాం... ఇప్పుడు అలాంటి వాటిని సరిదిద్దుకునే అవకాశం మనకు దొరికింది.. అతివేగంగా కాకపోయినా ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ది జరగాల్సిందే. జరగడానికి  మెండుగా అవకాశాలూ ఉన్నాయి.. 

220 ఎకరాల్లో ఒక విశ్వవిద్యాలయాన్నే ఏర్పాటు చేయవచ్చు.. అందునా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అతి చేరువలో,  అనుబంధంగా ఉంది #JRO. అనేక రకాల విద్యాసంబంద విషయాలకు నిలయంగా మార్చుకునే పుష్కల అవకాశం ఉన్న ప్రాంతం. అభివృద్ధితో ఈ ప్రాంతపు నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉపాది కల్పించొచ్చు, పరోక్షంగా అనేక మందికి ఉపాది చూపొచ్చు...  ఎందరో రేపటి తరం శాస్త్రవేత్తలను సమాజానికి అందించవచ్చు...ఒక మహా విద్యా క్షేత్రంగా ఈ ప్రాంతాన్ని నిలుపొచ్చు.. 

పాలకులు, పాలితులు, అదికారులు ఈ ప్రాంత అభివృద్ది కోరే అనేకులు ఆ వైపుగా ఆలోచించాలి.. అలోచిస్తారని ఆశిస్తున్నాం..
ఈ ప్రాంత అభివృద్దిని కాంక్షిస్తూ , #జాపాల_రంగాపూర్ #నక్షత్రశాల పూర్వవైభవం కావాలని కోరుతూ త్వరలో ఒక కార్యాచరణ ఉంటుంది.. అవకాశం ఉన్న అందరం బాగస్వాములం అవుదాం.

పట్టిన గ్రహణం వీడాలే.. నక్షత్రశాలకు పూర్వవైభవం  రావాలంటే.. పోరాటం తప్పదేమో.. విధానమే వేరుండాలి.

తెలంగాణీయులకు పోరాటాలే శరణ్యం అని చెప్పిన మాట వాస్తవమే నేమో..
#SaveJRO   #Observatory #OU  #ScienceLab #OsmaniaUniversity   #Scientists

Monday, May 1, 2023

ఆఖరి క్షణం వరకు సమాజహితం

ఒక ఆశయం అంటూ ఉండాలే గానీ జీవితపు ఆఖరి క్షణం వరకు సమాజహితం కోసం ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన ఉంటుంది..
ఆలోచనలు ఆశయం వైపూ అడుగులు పడతాయి.
మనకున్న రెండు కాళ్ళు ఆ నడకకు సహకరించకున్నా ఇంకొకరి సహకారంతో ఆలాంటి పనిలో బాగస్తులమవుతారు కొందరు..
అలాంటి వారి ఆశయానికి ఇంకొందరు ఆసరాగా ఉంటారు.. 
ఉన్నత స్థితలో ఉద్యోగం చేసి, అవసాన దశలో కూడా సమాజానికి కొంత ఆసరవ్వాలని, ఉన్నదానిలో కొంత సమాజహితం కోసం వితరణ చేయాలన్న ఆశయంతో వెతుక్కుంటూ వచ్చిన పెద్దావిడ.. ఆమెకి తోడుగా హితకారులు..
అటు మాతాపితరుల సేవాసదనం ఇటు సాధన కుటీర్ సందర్శన..
నడవలేని వయసులో ఆ ఆలోచన గొప్పది, అది ఆచరణ కోసం పడ్డ నాలుగు కాళ్ళ అడుగులు ఇంకా గొప్పవి..
ప్రణామాలు🙏🙏.