Thursday, October 24, 2019

Bhajan @ భజన

చిన్న ప్రారంభమే...రేపెపుడో పెద్దదిగా అవుతుంది..

భజన::: మనకు తెలియకుండానే ఆ వైబ్రేషన్స్  మనలోని షట్ చక్రాలను శుద్ది చేసి ఆద్యత్మికంగా భగవంతునికి దగ్గర చేస్తుంది.

అంతే కంటే ఎక్కువగా ఎన్నో వ్యక్తిగత ఉపయోగాలను చేకూరుస్తుంది..@సమిష్టి తత్వం, ఏకాగ్రత, తన్మయత్వంతో పాడటం, నలుగురితో కలిసి పనిచేసే గుణం, నిష్టతో చేసే భజన మన ఒంటిలో ప్రసరణవేగం ద్వారా రక్త శుద్ది చేస్తుంది, గాయకులు కాని మనచేత పాటలు పాడిస్తుంది....
అన్నిటికంటే ముఖ్యంగా ఆస్తి-అంతస్తులు,
చిన్నా- పెద్ద,  కుల_వర్గాల తారతమ్యం చూపక అందరినీ ఒక్కరిగాచేయిస్తుంది.

అందుకే పూర్వం నుండి భజనలకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇచ్చారు..
ఇది కేవలం వయసు మల్లిన వారు చేయాలని/చేస్తారని, ఏ పని లేనివారు చేయాలని/చేస్తారని అనుకుంటే పొరపాటే. అందరం చేయాలసిందే.
అందుకే జ్ఞానసరస్వతి సేవాసమితి యువజన విభాగం కొన్నాల్ల క్రితం ఆగిన భజనను మల్లీ పున: ప్రారంభించింది. 
వారికి మనందరి తరపున శుభాభినందనలు తెలుపుదాం. 
చిన్న ప్రారంభమే రేపెపుడో పెద్దదిగా అవుతుంది..

No comments:

Post a Comment