Tuesday, January 30, 2024

కార్యకర్తల సమావేశం@ అఖండ

హరివర అఖండక్షేత్రం
వీరపట్నం, రంగారెడ్డి జిల్లా.
హరివర అఖండక్షేత్ర సమితి సభ్యుల సమావేశం.
తేదీ: 30.01.2024, స్థలం  AMR Convention Hall, శేరిగూడ

 హరివర అఖండక్షేత్రoలో నిర్మించ సంకల్పించిన 108 అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణ శంకుస్థాపన 30.03.2024, శనివారం జరిగే సందర్భంగా.. 
క్షేత్రసమితి ఆధ్వర్యంలో వివిధ ముఖ్యమైన కార్య విభాగాల సన్నాహాక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ.అమర లింగన్న గారు (ధర్మ జాగరణ సంస్థ, కర్ణాటక,ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాల ప్రముఖ్) హాజరై మార్గదర్శనం చేయడం జరిగింది.
***************
ఈ సందర్భంగా సమావేశాన్ని  ఉద్దేశిస్తూ ముఖ్య అతిథి శ్రీ అమర లింగన్న గారు విగ్రహ నిర్మాణ సంకల్పం యొక్క విశిష్టతను మరొకసారి గుర్తు చేశారు. ఈ సంకల్పంతో జరిగే పనివలన భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఈ క్షేత్రం గురుంచి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుందని తెలియజేశారు. ప్రస్తుతం మనం అత్యంత అనుకూలమైన వాతావరణంలో ఉన్నాము కనుక సంకల్పం యొక్క కార్యంలో అందరం అధిక సమయం ఇచ్చి త్వరగా కార్యసిద్ధి కోసం పూర్తి తయారీ చేసుకోవాలని, అఖండ క్షేత్రసమితి ఇచ్చే ప్రతి పనికి సిద్దంగా ఉండాలని సూచించారు. అదే విధంగా హరివర అఖండక్షేత్రం ఇప్పటి వరకు కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఒడిదుడుకులు ఎదర్కొని, వాటిని నివారించుకొని ఇప్పుడు పూర్తి పనిలోకి అడుగుపెడుతోందని తెలిపారు. కార్యం ప్రారంభం తర్వాత వచ్చే సమస్యలకు ఏ మాత్రం వెనుకడుగేయకుండ, చేసే ప్రతి పనిలో కార్యం యొక్క లక్ష్యం పై దృష్టి సారించి వ్యక్తిగత సమస్యలను కూడా సమతుల్యం చేస్తూ దైవ కార్యంలో నిమగ్నమవ్వాలని దీనికి ఉదాహరణగా రామ కార్యంలో హనుమంతుడు కూడా ఒకానొక సందర్భంలో లంక చేరినప్పుడు కొద్దిపాటి నైరాశ్యం వచ్చిన తనకు తాను స్ఫూర్తిని నింపుకొని అప్పజెప్పిన పనిని సమర్దవంతంగా నిర్వహించిన తీరును వివరించారు. దైవ కార్యంలో సమయం ఇచ్చి నిబద్దతతో పనిచేసే కార్యకర్తలకు భగవంతుని యొక్క అనుగ్రహం వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందని ఉటంకించారు. ఈ మహసంకల్పంలో పనిచేసే ప్రతి కార్యకర్త హనుమంతుని గుణగణాలను ఎప్పటికప్పుడు నెమరువేస్తు , లక్ష్యం పూర్తయ్యే వరకు సంపూర్ణ హృదయంతో పనిచేయాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.

సమావేశం ప్రారంభంలో వీరపట్నం అఖండట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారు మాట్లాడుతూ సమావేశానికి హాజరైన వివిధ ముఖ్యమైన కార్య విభాగాల సభ్యులతో ఆయా విభాగాల కార్యనిర్వహణ, తీరుతెన్నలు, వాటికి కావలసిన కార్యకర్తల గణాన్ని పెంచుకోవాలని ,ఈ సంకల్పంలో భాస్వామ్యులను చేయవలసిన వివిధ రంగాలలో వున్న విశిష్టత వ్యక్తులను కూడా గుర్తించాలని సూచించారు. కుల-వర్గ, రాజకియాలకు అతీతంగా ఈ మహా కార్యంలో అందరినీ బాగస్తులను చేస్తాము, సమయానుకూలంగా అందరి సేవలను ఉపయోగించు కావాలని తెలిపారు.

 సమావేశంలో క్షేత్ర సమితి సభ్యులు, వివిధ మండలాల ప్రముఖులు, ప్రచార విభాగం సభ్యులు, సాంకేతిక విభాగం సభ్యులు పాల్గొనడం జరిగింది.
:~ హరివర అఖండ క్షేత్రసమితి & వీరపట్నo అఖండ ట్రస్ట్.

Wednesday, January 10, 2024

హరివర అఖండక్షేత్రం on 09.01.2024

హరివర అఖండ క్షేత్రాన్ని దర్శిoచుకున్న గౌరవ శాసన సభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు
*ఆశీస్సులు అందించిన పూజ్యశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ.*

*https://m.facebook.com/story.php?story_fbid=899881655127877&id=100014092788608&mibextid=Nif5oz*

*108 అడుగుల హనుమాన్ విగ్రహ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని మల్ రెడ్డి రంగారెడ్డి గారు తెలిపారు.*

   వీరపట్నం పెద్దచెరువు కొనకట్టన ఉన్న 
శ్రీ హరివర అఖండ క్షేత్రంలో 13వ మాసం పవనమాన హోమం మరియు 189వ వారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమానికి  హాజరై హనుమాన్ దైవ  దర్శినం చేసుకున్న శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డిగారు.
వారు మాట్లాడుతూ...
*ఇక్కడ జరిగిన హనుమాన్ విగ్రహ  సంకల్ప విషయం పూజ్య విద్యారణ్య స్వామీజి 10సంవత్సరాల క్రితం నాకు చెప్పి, మీరు పూర్తిగా సహరిoచాలి  అన్నారు, అప్పటి నుండి నాకు ఆ విషయం జ్ఞాపకo ఉన్నది.*  *అదే విధంగా ఈ క్షేత్రంలో జరిగిన అన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించారు, నేను వచ్చాను.*  
ఈ అఖండక్షేత్ర నిర్వహకుల శ్రద్ద అద్భుతంగా ఉంటుంది.
*ఈ హరివర అఖండ క్షేత్రంలో వెలిసే హనుమాన్ విగ్రహం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప క్షేత్రం కావాలి, అందుకు నా సంపూర్ణ సహకారం అందిస్తాను.* అవుసరాల కోసం ఈ క్షేత్ర పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమి CM గారితో మాట్లాడి ఇప్పిస్తానని ఎమ్మెల్యే రంగారెడ్డి గారు తెలిపారు. 
*పూజ్య స్వామీజీ మాట్లడుతూ ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ అంతా శుభం జరుగుతుంది. ఈ 108 అడుగుల హనుమాన్ విగ్రహ నిర్మాణం జరిగిన తరువాత ఈ ప్రాంతానికి  అన్ని రకాలుగా శుభం జరుగుతుందన్నారు*

*హరవర అఖండ  క్షేత్రసమితి వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారు మాట్లాడుతూ.. ఆంజనేయుడు ఆదర్శంగా యువత ఎదగాలి, వీరపట్నo పరిసర ప్రాంతాలు సుభిక్షంగా సస్యశ్యామలoగా ఉండాలని కాంక్షిస్తూ 108 అడుగుల ఆంజనేయుడి విగ్రహం అందుకు స్ఫూర్తిగా నిలవాలని గత 12 ఏండ్ల క్రితం జరిగిన సంకల్పం జరిగింది.*  *పెద్ద చెరువు చుట్టుపక్కల ఉన్న 108 గ్రామాల వ్యవక్తులను బాగస్వామ్యo ఈ విగ్రహ నిర్మాణం జరుగుతుంది..ఏ తారతమ్యం చూపక అందరూ ఈ నిర్మాణంలో బాగస్తులు అయ్యేలా కార్యాచరణ ఉంటుందని అన్నారు*.
ఈ రోజు జరిగిన పారాయణ కార్యక్రమంలో అందరి అభ్యర్థన మేరకు 
 పూజ్య విద్యారణ్య భారతి స్వామీజీ *విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మార్చ్ 30, 2024 తేదీని ప్రకటించారు.*

అనంతరం హరివర అఖండక్షేత్రం తరపున  
శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారికి సన్మానం చేసి జ్ఞాపికను అందించారు, వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ జరిగింది.
కార్యక్రమంలో స్థానిక మునిసిపల్ చైర్మన్ స్రవంతి, ZPTC మహిపాల్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల నాయకులు, అఖండ క్షేత్ర సభ్యులు రమేష్, చందూ తదితరులు పాల్గొన్నారు.

*https://m.facebook.com/story.php?story_fbid=pfbid02Kmzyv75cj2cz2ywGtwkPMbdhPDhx26xtpa9qdqZBdXf5QhTr5vJK4HLuZSxs28Npl&id=100014092788608&mibextid=Nif5oz*
:~ *హరివర అఖoడ క్షేత్రసమితి* & *వీరపట్నo అఖండ ట్రస్ట్.*