గమనానికి గమ్యానికీ ఆశే అస్త్రం
సహనం మనకు హితం ..
సమస్యల జోరీగలు ఏనుగుల్లా కనిపిస్తున్నప్పుడూ
ధైర్యం వీడొద్దు, నిరాశకు తావివ్వొద్దు.
ఈ కష్టం, ఈ సమస్య శాశ్వతమనుకోకు
ఇదీ పోతుందని మర్చిపోకు ....
మనుషుల స్వార్థం మనసుని కలిచేస్తున్నప్పుడు
మారీచుల ద్రోహం నిన్ను దహించేస్తున్నప్పుడూ
మంచిని మరువొద్దు, ప్రేమని తుంచొద్దు.
ఈ స్వార్థం, ఈ ద్రోహం శాశ్వతమనుకోకు.
ఇదీ పోతుందని మర్చిపోకు..
గమనానికి గమ్యానికీ ఆశే అస్త్రం
సహనం మనకు హితం ..
No comments:
Post a Comment