Sunday, August 27, 2023

లక్ష్యం దిశగా...... సుదూర o

Article in Today's   #Andrajyothi 
on 28.08.2017.
అభిమానానికి నిండు మనస్సుతో ధన్యవాదాలు...
  అశయానికి, అలోచనలకు అడ్డుచెప్పక పూర్తి స్వేచ్చ నిచ్చిన కుటుంబ సబ్యులకు,
నాలో వున్న మంచి చెడును గమనిస్తూ  అశయానికి అయువునందిస్తున్న  మితృలకు, దారి చూపిన సంఘానికి మరియు నిండు మనసుతో అండగా నిలుస్తున్న  పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

 ఎందరో త్యాగధనుల పుణ్యభూమి ఇది. సమాజ హితంకోరి తమకున్నదంతా దానికోసం ధారపోసిన మహనీయులున్నారు.. ఆస్తులేమి లేకున్నా అనుక్షణం సమాజహితం కోసం నిరంతరం మహాయజ్ఞంలా పనిచేసిన వారూ ఉన్నారు.వారి అడుగుజాడల్లో మనమూ..
  
రేపటి సమసమాజ నిర్మాణంలో బాగస్వాములయ్యే   నేటి చిన్నారులకు అక్షర చైతన్యమే ఆయుధం.. 
సరైన సమయంలో వారికి అవసరమైన సహకారం అందిస్తూ మనందరం అండగా నిలవాలి. ఆ ప్రయత్నం ఎవరు చేసినా మనవంతు సహకారం ఇవ్వాలి... ఆ ప్రయత్నం నిరంతర యజ్ఞంలా సాగాలంతే.. అందులో సమిదలవ్వడం అదృష్టం. 

 అలాంటి ప్రయత్నంలో కొనసాగలనుకున్న నాకు అ భగవంతుడు తగిన శక్తినివ్వాలని, అవకాశం ఉన్న అందరూ  ఆశయానికి అండగా ఉండాలని ఆకాంక్షిస్తూ... 
~: సదా.

Wednesday, August 9, 2023

గమనానికి, గమ్యానికి ఆశే అస్త్రం.

గమనానికి గమ్యానికీ ఆశే అస్త్రం
        సహనం మనకు హితం .. 
కష్టాలు కందిరీగలై వెంటబడి తరుముతున్నప్పుడు
సమస్యల జోరీగలు ఏనుగుల్లా కనిపిస్తున్నప్పుడూ 

ధైర్యం వీడొద్దు, నిరాశకు తావివ్వొద్దు.
ఈ కష్టం, ఈ సమస్య శాశ్వతమనుకోకు 

ఇదీ పోతుందని మర్చిపోకు ....

మనుషుల స్వార్థం మనసుని కలిచేస్తున్నప్పుడు 
మారీచుల ద్రోహం నిన్ను దహించేస్తున్నప్పుడూ 
మంచిని మరువొద్దు, ప్రేమని తుంచొద్దు. 
ఈ స్వార్థం, ఈ ద్రోహం శాశ్వతమనుకోకు.

ఇదీ పోతుందని మర్చిపోకు..

గమనానికి గమ్యానికీ ఆశే అస్త్రం 
  సహనం మనకు హితం ..

మాయదారి ప్రకృతి.

మాయదారి ప్రకృతి  మరో(మహా) కార్యానికి మనసుని ఉసిగొలుపుతున్నది..
ఉన్నపలoగా ఉపకరణాలనూ జోడిస్తున్నది.  వారీ పోరడా ఒంట్లో మరిగే రక్తం చప్పబడకముందే చేయాల్సిన పనిరా అని ఎగతాళి చేస్తున్నది, ఊరి స్తున్నది.. పద పదరా సదా అని తోసేస్తున్నది - పదుగురినీ తోడిస్తాంటున్నది... 
మనకెందుకులే ఊరుకుందామా_  ఉద్యమంగా ముందుగు సాగుదామా? అనేది నిర్ణయిద్దాం.
సమాజహితం కోసం కదాని కొంత ఆలోచన అంతే!.