Tuesday, January 4, 2022

వేపచెట్టు _ వైరస్

వేపచెట్టు మళ్లీ చిగురిస్తుంది..

గత కొన్ని నెలల క్రితం  నుండి వేప చెట్లు ఆకురాలి పూర్తిగా ఎండిపోతున్నాయి.  దేశం అంతా ఇలానే ఉన్నదని సోషల్ మీడియాలో, మీడియాలో   అనేక వార్తలు వచ్చాయి. వేపచెట్లకు ఎదో వైరస్ సోకింది, ఇక ఆ చెట్లు బ్రతకవనీ అన్నారు... సైoటిస్టులు _ #Scientists ఈ విషయంపై పరిశోధనలు కూడా ప్రారంభించారు అనే వార్తలు విన్నాము. ఫలితాలు కోసం వేచిచూద్దాం.
  ఆ లోపు ఒక వార్త.

     #సాధనకుటీర్ లో ఉన్న 10కి పైగా వేప చెట్లకూ ఆకులు రాలిపోయాయి, ఇంకా కొన్నిటికి పోతున్నాయి.....
పూర్తిగా ఆకు రాలిన ఒక చెట్టుకు ఇలా కొత్త ఆకు రావడం ప్రారంభమయ్యింది. మిగతా  వేప చెట్లకు  చిగురించాలని ఆశిద్దాం. మానవ జాతికి ఎంతో మేలు చేసే ఆ వేప  వృక్షజాతి ఆ వైరస్ నుండి పూర్తిగా బయటపడాలని ఆశిద్దాం.

 #IbrahimPatnam  #SadhanaKuteer

No comments:

Post a Comment