Friday, January 28, 2022

భారత్ మాత విగ్రహ వార్షికోత్సవం.

Complete one year for the unveiling of the statue of the #BharathMatha in the #SadhanaKuteer.

మనందరి సుఖ సంతోషాలకోసo, దేశ కీర్తిపతాకాలను జగతిలో శిఖరాన నిలపాలని కాంక్షిస్తూ తమ సర్వస్వం అర్పించిన  #త్యాగమూర్తులను స్మరించుకుంటూ,భావితరాలకు స్పూర్తినందివ్వాలనే సదాశయంతో... మనందరి #నిత్యప్రేరణాశక్తి #భారతమాత విగ్రహన్ని #సాధనకుటీర్ లో ఆవిష్కరించుకుని నేటికి ఒక సంవత్సరం పూర్తి.
మొదటి వార్షికోత్సవ సందర్భంగా
ఈ విగ్రహావిష్కర మహాకార్యంలో ప్రత్యక్షంగా,పరోక్షంగా బాగాస్తులయిన సాధకులకు శుభాభినందనలు...

ఉన్నామమ్మా ఉన్నాము, నిను సేవింపగా వస్తున్నాయి అంటూ తాము ఉన్నతంగా ఎదిగి #భారతమాత సేవలో తరించడానికి సిద్ధమవుతున్న రేపటి తరo సాధకులకు నిండుగా శక్తిని ప్రసాధించాలని కాoక్షిస్తూ..
   శ్రేయోభిలాషులoదరికీ #భారతమాత విగ్రహావిష్కరణ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

:~ #సదావెంకట్
#GSF_సాధనకుటీర్. 

#GSF #SadhanaKuteer _ A place to #Nurture #RuralTalent.

Thursday, January 13, 2022

నీ లక్ష్యానికి నీదే బాధ్యత

నీ సంకల్పానికి, నీ లక్ష్యానికి నీవే భాద్యుడివి. అందులో నిజాయితీ ఉంటే ఆ ప్రకృతి నీ వెంటే.... వాటి సాధనలో ఇతరులపైనే పూర్తిగా ఆధారపడి, వారిని నిoదిoచే అల్ప మనస్సుతో మాత్రం ఏ లక్ష్యాన్ని మోయొద్దు.~

Thursday, January 6, 2022

ఆజ్ కి బాత్ - అజం కర్లో

ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలంటే నీకు నీవు మోసం చేసుకోవద్దు. చేస్తున్న పనికి పూర్తిగా అoకితమవ్వు. పనిచేయడం ద్వారా మరింత మనలోని శక్తి సామర్ధ్యాలే బయటికొస్తాయన్న విషయం గుర్తించాలి.
చేసే పనిలో ఎంత నిమగ్నమయితే అంతగా మన పనికి విలువ చేకూరుతుoది.. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడే పని మొదలుపెడదాం అనుకోక, పరిస్థిలేవైనా పట్టుదలతో, అంకితభావంతో పనిచేయడాన్ని ప్రకృతి గుర్తిస్తుంది.
:~ పదండి ముందుకు.

Tuesday, January 4, 2022

వివేకావాణి శిరసా నమామి

నిశ్సబ్దం నుంచే విప్లవం:
"సముద్రం ఉపరితలంలో తరంగాలతో నాట్యమాడుతుంది. నురగతో నవ్వుతుంది, మెరుస్తుంది. గాలివాన వచ్చినప్పుడు  ఘోష పెడుతుంది.అయినా లోలోపల అగాధాలలో ప్రశాంతంగా, మౌనంగా, శాంతంగా ఉంతుంది.అటువంటి దివ్యమైన, ధార్శనికమైన అంతరాంతరమే లేకపోతే మ కార్యకలాపాలు, లక్ష్యహీనమూ, వ్యర్థమూ అవుతాయి..నిశ్శబ్ద విప్లవాలకు మనం శక్తిస్థానాలుగా నిలిచి, సడిలేని సెలయేరులా ప్రవహించినపుడే ముందు తరాలకు  మార్గదర్శకులం కాగలం.....
మనం ఏ రంగం తీసుకున్నా, ప్రచారానికి దూరంగా పరిశ్రమిస్తున్నప్పుడు తాత్కాలికంగా ఎలాంటి సహకారం లభించకపోవచ్చు. కొన్నిసార్లు సమీపంగా మెలిగే వ్యక్తులు కూడా మన శ్రమను గుర్తించకపోవచ్చు.పైగా ఆటంకాలు సృష్టించచ్చు. అంతమాత్రం చేత నిరుత్సాహ పడాల్సిన పనిలేదు.అశాంతికి గురికావాల్సిన అవసరం లేదు..." సహయోదులు లేని ఒంటరి పోరాటం వల్ల మన శక్తిసామర్ద్యాలు సంపూర్ణంగా బయటికొస్తాయని గుర్తెరిగి ముందడుగు వేయాలి. నిజానికి పటాటోపం, ప్రచారహోరుల మధ్య మన లక్ష్యం చాలా వరకు మసకబారుతుందని మరువకూదదు...
~👍👍👍👍

https://m.facebook.com/story.php?story_fbid=4710977945650277&id=100002143544899

వేపచెట్టు _ వైరస్

వేపచెట్టు మళ్లీ చిగురిస్తుంది..

గత కొన్ని నెలల క్రితం  నుండి వేప చెట్లు ఆకురాలి పూర్తిగా ఎండిపోతున్నాయి.  దేశం అంతా ఇలానే ఉన్నదని సోషల్ మీడియాలో, మీడియాలో   అనేక వార్తలు వచ్చాయి. వేపచెట్లకు ఎదో వైరస్ సోకింది, ఇక ఆ చెట్లు బ్రతకవనీ అన్నారు... సైoటిస్టులు _ #Scientists ఈ విషయంపై పరిశోధనలు కూడా ప్రారంభించారు అనే వార్తలు విన్నాము. ఫలితాలు కోసం వేచిచూద్దాం.
  ఆ లోపు ఒక వార్త.

     #సాధనకుటీర్ లో ఉన్న 10కి పైగా వేప చెట్లకూ ఆకులు రాలిపోయాయి, ఇంకా కొన్నిటికి పోతున్నాయి.....
పూర్తిగా ఆకు రాలిన ఒక చెట్టుకు ఇలా కొత్త ఆకు రావడం ప్రారంభమయ్యింది. మిగతా  వేప చెట్లకు  చిగురించాలని ఆశిద్దాం. మానవ జాతికి ఎంతో మేలు చేసే ఆ వేప  వృక్షజాతి ఆ వైరస్ నుండి పూర్తిగా బయటపడాలని ఆశిద్దాం.

 #IbrahimPatnam  #SadhanaKuteer

శివయ్య _ శివరాయ

శ్రీశైలం పోతే శివయ్యను దర్శిoచడం ఎoత ఆనందం, ఆసరమో ఆ శివరాయని దర్శిoచడం అంతే ఆనందం అంతే అవసరం... కానీ శివయ్య పక్కన ఫొటో పెట్టలేం- శివరాయ పక్కన పోటో ఇలా పెట్టొచ్చో.... both are not same😀...