అద్బుతం..
ఆ కాళా నైపుణ్యం..
మరయంత్రంతో పోటీగా మనిషి హస్తం... ఇంకా అంటే అంతకు ఎక్కువే..
అచ్చువేసినట్టే అమ్మవారి విగ్రహం..
ఆ విగ్రహంలో అమ్మవారు ఆవహిస్తే అచ్చంగా ఆమే రూపమే.. అది మహా అద్బుతమే..
అ స్థలంలో అమ్మవారి విహ్రహo వేయించాలనే ఆలోచన వచ్చినప్పుడే...
వేస్తే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అనుకున్నా...
ఆ శిల్పికి ఒకటికి 10 మార్లు వేయాల్సిన బొమ్మ చిత్రం చూపించి జాగ్రత్తలు చెప్పాను. అవి జాగ్రత్తలు అనేకంటే భయపెట్టడం అనొచ్చోమో. అంతలా జాగ్రత్త చేప్పాను.. ఇక ఆ విగ్రహం తయారు చేయడం మెదలు పెట్టీన రోజు నుండి ప్రతీ రెండు రోజులకు వస్తున్న మార్పులు గమనిస్తూన్నాము.
ఆ విగ్రహం పూర్తయ్యాక కొంత సంతోషం, మనం చెప్పిన మాదిరిగానే అచ్చం అలాగే చేశాడు శిల్పి..
ముఖ్యంగా ముఖ వర్చసు మీద కొoత ఆందోళన ఉండేది ఎలా చేస్తారో అని.. అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఒక్క ముఖమేమిటీ ప్రతీ చిన్న విషయాల పట్ల జాగ్రత్త పడి అమ్మవారి విగ్రహo చేశారు..
ఆ తరువాత ఆ విగ్రహనికి వేయాల్సిన రంగులూ మనమే నిర్ణయం చేసాము. ఆ బొమ్మే కేవలం మన ఆలయానికే ఉంటుంది.
ఎప్పుడు రంగులు పూర్తి చేస్తారా అన్నంత ఆతృత ఉండేది...
ఎట్టకేలకూ విగ్రహం బాగ రావడమే కాక రంగులూ బాగా వేశారు..
ఆలయ గర్బగుడిలో వెలసిన అమ్మవారిని దర్శించుకునే కంటే ముందే, గుడి మెట్లదగ్గరే ఈ అమ్మవారు దర్శనం ఇస్తుంది..
ఇంతా చెప్పి ఇదెక్కడా అని అడిగేంత అవాకాశం ఏమీ ఇవ్వను..
*ఇది మన జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి అలయంలో...
అందర
*ఇంత శ్రద్ధతో, చాలా ఓపికగా తమ అద్భుత కళా నైపుణ్యంతో అమ్మవారి విగ్రహాన్ని అందించిన ఆ కళాకారుల కళను గౌరవిస్తూ, వారిని అబినందిద్దాం, ప్రోత్సహిదాం*.
జూన్ 5వ తేది ఆలయ బ్రహ్మోత్సవాల సందర్బంగా వచ్చినప్పుడు దగ్గరగా దర్సిద్దాం..
*బోలో సరస్వతి మాతకి జై*.
;~ సదా వెంకట్.
Monday, May 24, 2021
Friday, May 21, 2021
వ్యవసాయ క్షేత్రం @ తారమతిపెట్
లాక్ డౌన్ అందించిన మరో అవకాశం.
*అద్బుత #వ్యవసాయక్షేత్ర సందర్సన*
అక్కడ ప్రతి #మొక్క, ప్రతి #చెట్టూ, ప్రతీ #తీగ, ప్రతి #రాయి, ప్రతి బొమ్మ ...ఒకటేమికి అక్కడ అన్నీ అద్భుతాలే.. అదొక #శ్రద్దాక్షేత్రం.
ఈ లాక్ డౌన్ సమయంలో పూజ్యశ్రీ #విద్యారణ్యభారతిస్వామిజీ తో పాటు కలిసి ఆ క్షేత్రం సందర్శించే అవకాశం రావడం ఒక అద్భుతం.
ముప్పై సంవత్సరాల #సాధన...
ప్రకృతి సేవకుడై,
అదే యావతో నిరంతర శ్రమ.
మట్టిని, శ్రమను నమ్మి, అదే ఆశను ఆశయంగా చేసుకుని సాధనతో #మట్టిలోమాణిక్యాలు తీస్తు ఎందరికో మార్గదర్శకుడైన #శ్రామికుడు,..
ఉన్నత విద్యార్హతలు కలిగి, ప్రకృతి మీద ఉన్న మమకారంతో
17 ఎకరాల పొలంలో ఏమాత్రం
కాలి స్థలం లేకుండా అన్ని రకాల #పూలమొక్కలను, #పండ్లమొక్కలను నాటి, వాటిని మొక్కలుగా చూసి, వాటిని పూర్తి #సేoద్రీయఎరువులతో వృక్షాలుగా, మహా వృక్షాలుగా మలచిన #మహాసాధకుడు.
తన నిరంతర శ్రమకు ఎన్నో అవార్డులు వచ్చినా, ఆయన శ్రద్దముందు అవన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి.
ఎప్పడూ బిజీగా ఉంటూ, ఒక్క నిమిషం కూడా వృధా చేయక తన క్షేత్రాన్ని అద్భుతoగా తీర్చిదిద్ది, అదొక ప్రయోగశాలగా మార్చిన వారి కృషి అభినందనీయం. అందుకే అదొక సందర్శనశాలగా మారింది. రేపటి తరం సాధకులకు దిక్ఛూచి అయ్యింది. ఆయన జీవితం నేటి విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా మారింది...
ఆ సాధకుడు #నాగరత్నంనాయుడు, ఆ క్షేత్రం తారమతిపేట్, అబ్దుల్లాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా.
Thursday, May 20, 2021
రాచకొండలో అఖండజ్యోతి శివ అనుగ్రహమే
ఒక కారణమంటూ లేకుండా ఏ కలయిక జరగదు....
కొన్ని ప్రకృతి ప్రసాదిత నిర్ణయాలు ఇంకా ఖచ్చితంగా జరుగుతాయి..
అనుమానమే అక్కరలేదు..
మన సంకల్పం మంచిదైతే శక్తి వెతుక్కుంటా వస్తుందనేది పచ్చినిజం..
Subscribe to:
Comments (Atom)