Thursday, June 13, 2024

వివేకానంద శిలాస్మారక కథ

సమాప్తం...తప్పక చదవాల్సిన పుస్తకం.
మాతృభూమిపై గాఢమైన ప్రేమతో నిండి ఉన్న హృదయంతో స్వామి వివేకానంద యావద్భారత పర్యటనకు బయలుదేరారు. ఆయన కన్యాకుమారి వచ్చి 1892 డిసెంబర్ 25,26,27తేదీలలో సముద్రం మధ్య ఉన్న శిలపై కూర్చొని భారత దేశపు భూత, వర్తమాన,భవిష్యత్తుల గురించి ధ్యానం సలిపారు.
వైభవోపేతమైన భారతదేశం కొరకై తన జీవన కార్యాన్ని ఆయన ఈ శిలపైనే గ్రహించారు. తదనంతరం భారతీయ ఆధ్యాత్మికతతో ప్రపంచాన్ని కుదిపివేశారు. ఈ పవిత్ర స్థలంలో శ్రీ ఏకనాథ రానడే నిర్మించారు..
ఆ నిర్మాణం కోసం జరిగిన 
వ్యవప్రయాసలు చాలా కఠినమైనవి. ఓర్పుతో,సమయ స్ఫూర్తితో, చాకచక్యంతో వారు చేసిన ఈ అద్భుత కార్యం చాలా మంది సామాజిక కార్యకర్తలకు స్ఫూర్తి వంతం..

Sunday, June 9, 2024

దీక్ష విరమణ @ కన్యా కుమారి

*దీక్ష విరమణ @ సుచీంద్రం, కన్యాకుమారి*.
on 09.06.2024.

అనామకలమైన మనలాంటి సామాన్యుల మస్తిష్కాలలో ఆశలు, ఆశయాలు, సంకల్పాలు చొప్పించి, మనను ఒప్పించి వాటి సాకారానికి కావలసిన శక్తిని ప్రసాదించి, అవసరమైన ఉపకరణాలనూ కల్పించి, ఆ పనిని పూర్తి చేసుకునే వారే దేవతలు. 
ఆ ఉపకరణాలు మనమే అయితే అది మహా భాగ్యం...
పుష్కరకాలం(12ఏండ్లు)క్రితం వీరపట్నo పెదచెరువు కొనకట్టన  108అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణ సంకల్పం చొప్పించి, అవసరమైన  ఉపకరణాలు అందిస్తూ ముందుకు తోస్తున్న ఆ దేవదేవుడు🙏.. 
*ఆ నిర్మాణo కోసం శంకుస్థాపన జరిగితేనే తలనీలాలు తీస్తాననే దీక్షను చేపట్టిన ఐదేళ్లకు @ 30.03.2024 రోజున శంకుస్థాపన కోసం అనుగ్రహించి, దీక్ష విరమణకు అదృష్టం కల్పించిన కన్యాకుమారి దగ్గర  సుచీద్రo దేవాలయ ఆంజనేయ స్వామికి శిరసా ప్రణామాలు* 🙏🙏.
:~ సదా వెంకట్,
*హరివర అఖండ క్షేతసమితి*

Friday, May 31, 2024

గద్ద జీవితం ఒక స్పూర్తి

జీవితం లో క్రింద పడితే పక్షి రాజు గద్ద జీవితం నిజం గా ఒక పాఠం. బాగా బతికి చెడితే గద్ద జీవితమే ఒక భగవద్గీత. బద్దకం ఉంటే గద్ద జీవితమే ఒక బైబిల్. నేను ఒంటరి, నేను ఏమీ చేయలేను అనుకుంటే గద్ద జీవితమే ఒక ఖురాన్. నా రాత ఇంతే మారదు, నా కర్మ ఇంతే నేను ఏమీ చేయలేను అనుకుంటే మాత్రం గద్ద జీవితం చదవాల్సిన ఒక గ్రంధం.   
 
నీరు నింగి నేల ఎక్కడైనా సాటిలేని వేట గద్ద దే. ఈ ప్రపంచం లో తెలివి కి ఇంకొకరితో పోటీ లేనిది గ్రద్ద. ఉరుములు మెరుపులతో వర్షం వస్తుంటే సమస్త జంతువులు, పక్షులు ఎక్కడో ఒక చోట దాక్కొని తల దాచుకుంటాయి కానీ గద్ద మాత్రం ఆకాశానికి ఎదురు వెళ్ళి ఉరుములు మెరుపులని దాటుకొని ఆకాశం పైన నిలబడుతుంది.   

గ్రద్ద దాదాపు 70 యేండ్లు జీవిస్తుంది.అయితే 40 యేండ్లకే గోళ్ళు బాగా పెరిగిపోయి కాళ్ళలోకి వంపు తిరిగి తనకే గుచ్చుకుంటాయి, రెక్కలు బాగా పెరిగిపోయి శరీరానికి అతుక్కుపోయి బరువు ఎక్కుతాయి, ఎగరటం కష్టమవుతుంది, పొడవైన దాని ముక్కు కొన చివర వంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు. తన మీద తనకే అసహ్య మేస్తుంది. ఆ 40 వ యేట దాని ముందున్నవి రెండే రెండు దార్లు; నా బతుకు ఇంతే, నా కర్మ ఇలానే తగలబడ్డది, నా రాత ఇంతే అని అనుకొని ఆహారాన్ని సంపాదించుకోలేక, ఎగరలేక సుష్కించి మరణించటం లేదా తనని తాను మార్చుకోవటం. 

అయితే ఇక్కడ గద్ద రెండో మార్గాన్ని ఎంచుకుంటుంది. నేను మారతాను, నా జీవితాన్ని మార్చుకుంటాను అనుకుంటుంది. దగ్గరలో ఉన్న ఒక పెద్ద కొండ శిఖరం దగ్గరికి వెళ్లి పెరిగిన ముక్కుని వలిచివేసుకుంటుంది. అత్యంత బాధ, కొన్ని సార్లు రక్తం. ఆహారం ఉండదు. అయినా అలానే ఉండి కొత్త ముక్కు వచ్చేంత వరకు వేచి ఉంటుంది. కొత్తగా వచ్చి ముక్కు పదును పెరిగాక వాటి సహాయం తో పెరిగిన గోళ్ళని కత్తిరించుకుంటుంది, వదిలించుకుంటుంది. మళ్ళీ రక్తం, బాధ. అయినా భరిస్తుంది. కాలిగోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయం తో పెరిగిన బరువైన రెక్కలని తొలగించుకుంటుంది, పీకేస్తుంది. మళ్ళీ రక్తం, నరకయాతన. అయినా భరిస్తుంది. . వీటి అన్నీటితో పాటు ఆకలి. ఇదంతా జరగటానికి ఒక 6 నెలల సమయం పడుతుంది. 

ఆకాశమే హద్దు గా జీవించిన స్వేచ్చా విహంగం, ఆ అకాశాన్ని చూస్తూ మాత్రమే బతుకుటుంటుంది ఒక 6 నెలలు. అప్పటిదాకా గ్రద్ద ని విస్మయం గా చూసిన మిగతా పక్షులు దాని స్తబ్దతని అచేతనాస్థితి ని చూసి విస్తుపోతూ ఉంటై. గ్రద్ద మాత్రం తనకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని ఖచ్చితం గా తెలుసు. ఎవరు ఏమనుకున్నా మౌనం గా ఉంటుంది కొన్ని నెలలు

ఆ విధం గా ఉండి కఠోర సాధన చేసి మళ్ళీ కొత్త ముక్కు, కొత్త గోళ్ళు, మంచి రెక్కలు సాధించుకొని పునర్జన్మ సాధించుకొని ఇంకో 30 యేండ్లు మళ్ళీ రాజు లాగ బతుకుతూ నీరు, నింగి, నేల లో తన ఆధిపత్యాన్ని చూపిస్తూ హాయిగా బ్రతుకుతుంది. 

ఒక పక్షి సాధన చేసి మార్చుకోగా లేనిది, మనిషి మార్చుకోలేడా..? పడిన మనిషి మళ్ళీ లేవలేడా..? సాధన, ఓపిక ఉంటే మనిషి తనని తాను మార్చుకోవచ్చు అంటారు పెద్దలు.