Tuesday, January 4, 2022
శివయ్య _ శివరాయ
శ్రీశైలం పోతే శివయ్యను దర్శిoచడం ఎoత ఆనందం, ఆసరమో ఆ శివరాయని దర్శిoచడం అంతే ఆనందం అంతే అవసరం... కానీ శివయ్య పక్కన ఫొటో పెట్టలేం- శివరాయ పక్కన పోటో ఇలా పెట్టొచ్చో.... both are not same😀...
Monday, December 27, 2021
#దండయుద్ధ
చాన్నాళ్ల తరువాత అలా ఓ సారి దండయుద్ధ..
అప్పటికప్పుడు అవసరం అనిపించి చేయాల్సివచ్చింది.. అదీ అడ్డపంచతోనే.. ఓ 20 ఏoడ్ల క్రితం ఇష్టంగా, విశేషంగా చేసేవాళ్ళం....
అదోరకమైన శారీరక వ్యాయామం, ఏమాత్రం ఖర్చులేని ఓ యుద్ధకల.. గన్నులు,రాకెట్లు వాడే ఈ కాలంలో ఈ దండయుద్ధతో ఏ మాత్రం ఆవసరం లేదు...కానీ ఆత్మవిశ్వాసం విపరీతంగా పెంచుతుoది.. నిరంతర అబ్యాసం అవసరం.
Wednesday, December 8, 2021
అవి వీర మరణాలు
మనం...
వ్యాధులు ముదిరితేనో
తెల్లవారుజాము నిద్రలోనో
హాస్పిటల్ బెడ్ పైనో
శ్వాస విడుస్తాం...
యోధులు కార్యక్షేత్రంలోనో యుద్ధరంగంలోనో దేశంకోసం ఆరాటపడుతూ పోరాడుతూ ఛిద్రమైన దేహాలతో అమరులవుతారు ...
వారికి ఉషోదయపు ఉల్లాసాలుండవు
సాయంకాలపు విరామాలుండవు
సాధారణ మరణాలూ ఉండవు...
జోహార్ జనరల్ బిపిన్ రావత్ & All
Monday, December 6, 2021
స్నేహం / బంధం.
ధర్మో రక్షతి రక్షిత: అని చదివి, కంఠస్తం చేసి ఇంకో పదుగురికి ఉచితంగా చెప్పమని కాదు.... ఆ అక్షరాలను పెద్ద ప్లెక్సీ చేసి గూట్లో పెట్టుకుని రోజూ అగరొత్తులు ముట్టిస్తూ పూజ చేయమని అసలే కాదు...
Sunday, December 5, 2021
*ధర్మో రక్షతి రక్షిత:
ధర్మో రక్షతి రక్షిత: అని చదివి, కంఠస్తం చేసి ఇంకో పదుగురికి ఉచితంగా చెప్పమని కాదు.... ఆ అక్షరాలను పెద్ద ప్లెక్సీ చేసి గూట్లో పెట్టుకుని రోజూ అగరొత్తులు ముట్టిస్తూ పూజ చేయమని అసలే కాదు...
Saturday, November 27, 2021
అల్పత్వం, అమాయకత్వం..మూర్ఖత్వం
రాజకీయ క్షేత్రంలో ఉండి పాలకుడివైనంత మాత్రాన...మిగతా రంగాలైన @ అద్యాత్మిక, సామాజిక & ఇతర రంగాలనూ శాసించాలకోవడం అల్పత్వం,అమాయకత్వo,మూర్ఖత్వం...
పరిమితుల్లో ఉండి,పరిపక్వతతో మసులుకోవడం నీ క్షేత్రానికే శోభనిస్తది..
కాదు, కూడదు అంటే చరిత్ర చదవుకోవాలి మరి. .
Wednesday, November 17, 2021
HAMPI trip_ 2020
అవును ఇక్కడి #ప్రతీరాయి #మౌనంగా మాట్లాడుతుంది....
#చరిత్రకు #మౌనసాక్షిగా నిలుస్తాయి ఇక్కడి రాళ్లు.. ..
ఇక్కడ రాళ్లలో మహత్తు ఉన్నది.....అవి మార్గాలు చూపుతాయి..
త్రేతాయుగపు సుందర రామాయణ చరితను చరిత్రకు అందించే అద్బుతాలు ఆ రాళ్లలోనే నిగూడంగా నిక్షిప్తం....
#భారతీయ గత వైభవ ఆనవాళ్ళను గుర్తుచేస్తూ భవిష్యత్తుకు దారిచూపుతాయి... అవును ఇక్కడి రాళ్ళకు రతనాలతో సమాన గుర్తింపు ఉండెనట...
#గుడులను_ గుడుల్లోని #దేవతల ఆశీర్వాదాలను, #శాస్త్రాలు_శాసనాలు, నదులు-జీవనదులకు,
దారులు_రహదారులన్నిటికీ ఇక్కడి రాళ్లే దివిటీలు..
ఇక్కడ నేలపై పారే నీటికే కాదు, కొండలపై #జీవనదులుల్లా పారే నీటికీ ఇక్కడి రాళ్ళే
సజీవ సాక్షాలు..రతనాల రాశుల వ్యాపారాలకు ఇక్కడి రాళ్ళే సిపాయిలుగా నిలిచాయంట....
ఈ రాల్లను రమణీయంగా మలిచేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయక, ఆ బండరాళ్ళను బద్రపరచి, సజీవ సాక్షులుగా మలుచుటకు జీవితాలను దారపోసిన ఆ #కళాహృదయాలు ఎంత గొప్పవో......
అందుకే ఇక్కడ ప్రతీ రాయి మౌనంగా మాట్లాడుతుంది.. చరిత్రకు
#మౌనసాక్షిగా నిలుస్తుంది.
రాల్లకే కాదు ఇక్కడి జంతువులకూ, ఈ నేల పట్ల శ్రద్ద ఎక్కువే అని చరిత్ర చెప్పిన పాఠం. ఇక్కడి కుందేళ్ళు వేటకుక్కలను సైతం తరిమితే.....
ఆ స్ఫూర్తితోనే #విద్యారణ్యస్వామిజి భారతజాతి #పూర్వవైభవం కోసం ప్రతిన చేసి, #విజయనగరసామ్రాజ్యానికి బీజం వేశాడు..
అలాంటి ఈ నేలను ఎన్నిసార్లు సందర్సించినా.. ప్రతీసారి కొత్త శక్తిని తోడిచ్చి పంపుతుంది...మౌనంగానే గత చరిత్రను నెమరేయిస్తాయి......
ఆ రమణీయ రత్నాల రాళ్ళ నగరమే #హంపీక్షేత్రం, #కర్ణాటక....
ఇప్పటికైనా #భారతప్రభుత్వo ఈ క్షేత్ర #గతవైభవాన్ని గుర్తించి, రేపటి #చరిత్రకు సజీవ సాక్షంగా నిలుపవచ్చు.
#HampiTrip2020 #HAMPI #హంపీ
#PM0 #govtofindia #IndianHeritage
Subscribe to:
Posts (Atom)