Wednesday, October 7, 2026

. ముందు - వెనక

ఒక మనిషి... నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు...
నీ వెనుక ఎలా ఉంటాడో అన్నదే అతని అసలు స్వభావం.

నీతో నవ్వుతూ మాట్లాడటం పెద్ద విషయం కాదు...
నీ గురించి లేనప్పుడు కూడా నీ గౌరవాన్ని కాపాడటం అసలైన వ్యక్తిత్వం.

నీ ముందు మంచిగా నటించే వాళ్లు చాలామంది ఉంటారు...
కానీ నీ వెనుక కూడా నీ విలువను తగ్గించకుండా మాట్లాడేవాళ్లే నిజమైన మనుషులు.

ముఖం ముందు చూపించే మంచితనం నటన కావచ్చు...
కానీ నీ వెనుక చూపించే ప్రవర్తన మాత్రం మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది.

అందుకే మాటలు కాదు...
మనిషి లేనప్పుడు అతని గురించి మాట్లాడే విధానాన్ని గమనించు.
అక్కడే అసలు మనిషి కనిపిస్తాడు.

No comments:

Post a Comment