Wednesday, April 28, 2021
సలేశ్వరం యాత్ర @2013
పాలమూర్ - సలేస్వరం యాత్ర...సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే సాగే ఈ యాత్రను/ ఆలయాన్ని సందర్శించాలన్నగత 4సం.రాల నుండి ఉన్న కోరిక ఈ సంవత్సరం పూర్తయ్యింది. పాలమూర్ జిల్లాలో ఉన్న ఈ సలేస్వరాలయాన్ని ప్రతి ఒక్కరు దర్సించాల్సినదే .... భాగ్యనగర్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం దర్శించినకా కలిగే తృప్తి . ఆనందం వర్ణనాతీతం . 40O అడుగుల లోతున.. లోయ ప్రాంతంలో చిన్న లింగాకారంలో వెలసిన దైవాన్ని దర్శించిన ఆనందం కన్నా... కొన్ని వందల సంవత్సరాల క్రితమే.. తమ భవిష్యత్ తరాల వారికి భారతీయ వారసత్వ సంపదను అందించే క్రమంలో వాళ్ళు చూపిన శ్రద్ద పట్ల అందరూ ఆశ్చర్య పడాల్సిందే. వాలందరికీ కృతజ్ఞులమై ఉండాల్సిందే...సాదారణ రోడ్డు మార్గం నుండి లోయ ప్రాంతంవైపు సాగే సుమారు 6 కిలోమీటర్ల రహదారి ప్రయాణం మాత్రం వర్ణనాతీతం ... కచ్చితంగా అది స్వీయ అనుభూతి పొందాల్సిందే. అందునా ఉత్సాహ వంతులైన మిత్రబృందం ఉంటె ఇక ఆ ఆనందం ఇంకా మధురం. దారి పొడుగునా ఉన్న రమణీయమైన అందాలను తిలకిస్తూనే... ఎన్ని వ్యయ ప్రయాసలని భరించి ఆ రహదారిని చూపిన/చేసిన వారిని అభినందించకుండా ఉండలేము..భవిస్యత్తు తరాల వారికి సంసృతీ సంప్రదాయాలను అందించటానికి వాల్లు పడ్డ శ్రమ పట్ల ఆశ్చర్యం కలుగుతుంది ... హ్రుదయం ఉన్నవారికేవరికైనా తాముకూడా ఏమైనా చేయాలనిపిస్తుంది.....
Wednesday, April 21, 2021
రాచకొండలో రామనవమి-2021
#శ్రీరామనవమి_2021 @ #రాచకొండ
రాచకొండలో రాతిరేళ #రాములోరికళ్యాణం #కమణీయం, రమణీయం...
గత నాలుగేండ్లుగా ఈ రాచకొండ రాములోరు మాకు ఆహ్వానం పంపుతానే ఉన్నాడు, మేమూ తప్పక పోతానే ఉన్నాము.
#కార్తీకపౌర్ణమి రోజున రాచకొండలో అఖండజ్యోతి వెలిగిస్తున్నందుకు శివపార్వతులే పిలుస్తరేమో అనుకున్నాం.. సీతారాములూ పిలుస్తున్నారు...సంతోషం*.
కానీ... పోతే ఊరికే కూర్చునే రకాలు కావుగా మనవాల్లవి, ఏదో ఒక పనిలో ఖచ్చితంగా ఉండాలంతే...
నిర్వాహకులు పని చెప్పకపోతే, మనవాల్లే ఆ పనిని దొరికించుకునే రకాలు.. మనవాళ్ళు ఎప్పుడూ అంతేగా..
ఈ సారి కూడా అంతే..
#శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే.......
#శ్రీరామజయరామజయజయరామ* స్మరణతో రాచకొండను మారుమ్రోగించారుగా..
అంతచేసి పెళ్ళి భోజనం చేయకుండా వస్తారా! అస్సల్ రారు, వస్తే వండుకుని తినాలెగా మరి. అందుకే మాంచి పెళ్ళి భోజనం ఆరగించి వస్తిమి.
కరోనా కాదుకదా దాని బందుగణం మొత్తం చుట్టుముట్టినా కొన్ని పనులు ఆగవు గాక ఆగవు. కాకుంటే కొంత ఉత్సాహం తక్కువైతదీ అంతే..
కట్టలకు కట్టలు పైసలు పంచి, తినిపించి, తాపించి ఎన్నికల సభలలకు బలవంతంగా పాల్గొని కరోనాను అంటించుకున్న దానికంటే... ఎవరి బలవంతం మీద రాకుండా, పిలవకనే వచ్చి, రామకళ్యాణానికి కట్నాలు, కానుకలు సమర్పించి సేవలో పాల్గొనేంత శక్తినిచ్చిన ఆ దైవానికి మొక్కకుండా ఉంటామా.. అదే సనాతన ధర్మం యొక్క శక్తి.
ప్రతీసారి రాత్రి 11కు ప్రారంభమై తెల్లవారులు కొనసాగే కళ్యాణo తదనంతర భోజనాలు, భజన కార్యక్రమాలు కరోనా కారణంగా 9 వరకే ముగిసాయి.
#శ్రీరామనవమి -2021 @ #రాచకొండ.
Tuesday, April 13, 2021
*మనిషి సృజనాత్మకతకు ఆది, అంతం లేదుగా*... ఉన్న బుర్రను వాడుకోవాలేగాని, ఈ భూమండలంలో తన ద్వారా జరగని పని ఏమీ లేనట్టుంది. పుట్టిన ఆది మానవుడు జంతువులతో సహవాసం చేసి వాటిని మచ్చిక చేసుకుని వాటితో జీవనం కొనసాగిస్తే, అంతరిక్షంలో గూడు కట్టుకునేలా తన విజ్ఞానాన్ని పెంచుకున్నా కూడా...జంతువుల, పక్షుల సాంగత్యాన్ని వదులుకోలేకున్నాడు... వాటి గొంతుకలను మట్టి మూకుడల్లో బందించి అమ్ముకుంటున్నాడు.. ఆ బుర్ర అమోఘం కదా. *ఒక మట్టి పాత్రలో మంచినీల్లు కలిపి ఊదితే అచ్చo పిచ్చుకల శబ్దాలు*. మట్టి పాత్రలో ఊదితే వచ్చే ఒక్క పిచ్చిక గొంతును చూసి మనం మురిసితే... మరి *తన గొంతితోనే అన్ని జంతువుల, పక్షుల గొంతుకలను పలికిన వీరప్పన్ ఎంత మురిసిండాలే* 😂 అది ఎంత విజ్ఞానం అయ్యిండాలి.ఏమైనాగాని.. *అన్నిటినీ వాడుకుంటున్న మనిషిని విజ్ఞానవంతుడనాలో, స్వార్ధపరుడనాలో ఆలోచించాలి*.తిరుపతిలో శ్రీవారి పాదాల వద్ద కొనుక్కున్న ఈ సాధనం భలే ఆలోచనను పెంచింది.
Tuesday, April 6, 2021
పిచ్చుక గూడ్లు_మన బంగ్లాలు
అనగనగనగనగా ఓ ఊరుందీ.. ఆ ఊరి చివరలో ఓ పే ద్ద మర్రి చెట్టుంది.ఆ చెట్టుకు చాలా పెద్ద పెద్ద కొమ్మలతో పెద్దగా పరుచుకుని ఉన్నది. అన్ని కొమ్మలున్నా, నా గూడు బాగా ఉండాలని, ఎత్తులో ఉండాలనుకుని ఓ పక్షి చాలా రోజులు కష్టపడి ఆ చెట్టు చిటారి కొమ్మన ఓ గూడు కట్టుకున్నదీ... కట్టెటప్పుడు అది పడ్డ కష్టం వర్ణణాతీతం... దాని గూడు దానికి దానికి బహు అందంగా,సురక్షితంగా ఉన్నా, మనలాంటి వారు ఆ చెట్టుకిండ కూర్చుని పైకిచూస్తే అది పిచ్చుకంత పిట్టుగూడులాగే కనిపిస్తుంది.. అయినా అది నిజమే..
ఇక్కడా అంతే.. సేమ్ టూ సేమ్.
నా 4 అంతస్తుల ఇళ్ళు, నా డూప్లెక్స్, నా ఇంట్లో కిరాక్ మార్బుల్స్ వాడినా, నా ఇంట్ళో మాంచి గార్డెన్ పెట్టినా అని మురిసిపోయే మనలాంటి వారం...ఆ పిట్టగూడుని కిందనుండి పైకి చూసినట్టుగా.. మన భవ్యమైన ఇండ్లను ఎత్తులోనుండి, అది దేవుని కొండలపైనుండి చూస్తే.. ఆ పిట్టగూడుకన్నా అద్వాన్నంగా కనిపిస్తాయి. ..
Subscribe to:
Comments (Atom)