అనుబంద బందాలు::.
అనుబందం, ఆప్యాయత, ఆత్మీయత...
ఏ బందం లేకున్నా అల్లుకునే బందాలవి.
అడుక్కుంటే, ఆడంబరాలు చేస్తే, అతి వినయం చూపిస్తే వచ్చేవి కావు_ వచ్చినా నిలిచేవి కావు.
కొలతలతో కొలిస్తే తూకానికి అందనివి, మనసున స్వార్దం పెట్టుకుని నటిస్తే, మాటేసి కాటేసే నికార్సయిన నిజాయితీ బందాలవి.
నీతులు, సూక్తులూ ఊరికే అవుతలి వాళ్ళకి చెప్పడానికే కాకుండా, మనకు ఆచరించి చూపే అవకాశం అందించే బందాలవి. అవుసరాలు తీరాక దాటేసే తెప్పరులు కావవి.
బడ బడా కానుకలే కావాల్సిన పనిలేదు, మనసుంటె మట్టిని కూడా మణిపూసలుగా చేసి మణిహారంగా అందించగల బందాలవి.
మనసున స్వార్ధం, నటన లేకుంటే కలకాలం కల్మషం లేకుండా కలిసుండే బందాలవి.. బహుపరాక్..
Tuesday, November 7, 2017
అనుబంధ బంధాలు_Relations.
Monday, November 6, 2017
AKHANDA HAARATHI_2017
సంకల్పించిన కార్యం చిన్నదా, పెద్దదా అన్నది కాదు విషయం. ఎన్ని అభ్యంతరాలు, అవాంతరాలు ఎదురైనా, సంకల్పించిన కార్యం కోసం కొసదాక కొనసాగడమే అసలైన విజయం...
వీరపట్నం పెద్ద చెరువు నిండి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, రాచకొండ పరిసర ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షింస్తూ సంకల్పించిన మహాకార్యమే ""గంగమ్మకు అఖండ హారతి_శివయ్యకు అఖండ జ్యొతి" కార్యక్రమం.
3 సం.రాల క్రితం కార్తీక పౌర్ణమి రోజు శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపీ విద్యారణ్య భారతీ స్వామీజీ కరకమలములచే ప్రారంభించబడి 2 సం. అందరి సహకారంతో రాలు దిగ్విజయంతో పూర్తిచేయబడింది.
3వ సంవత్సరం కూడా తమ అనుకూలతను బట్టి ఆ మహా కార్యాన్ని పూరిచేసిన "~వీరపట్నం అఖండ"" కార్యకర్తల బృందానికి హృదయపూర్వక శుభాభినందనలు... ఈ ప్రాంత వాసులందరి తరపున ధన్యవాదాలు..
హృదయంతో చేసే ఏ కార్యానికైనా కచ్చితంగా ఆ ప్రకృతి కనుకరిస్తది, అనుకూలిస్తది, ఆశీర్వదిస్తది. ..కాస్త ఆలస్యమైనా ఈ మహాకార్యం యొక్క ఫలితాలు ఖచ్చితంగా అందుతాయి...
Wednesday, October 11, 2017
దళిత పూజారులు _ Dalith Pujari.
"ఆలయాల్లో దళిత పూజారులు". ఈ మార్పుకోసం సాగిన నిరంరత ప్రయత్నకులకు, రహస్య సాధకులకు ప్రణామాలు.
కాని ఎందుకో ఈ దళిత అన్న పదమే వాడకుంటే బాగుంటది. అది తిట్టనుపోరా గాడిద అనట్టు, దూరం చేసి దగ్గరకు లాగినట్టు ఉంటది... అయినా అది మద్యలో వచ్చింది, మద్యలోనే పోతదేమో...
""అరాధన అంతరంగాల్లోంచి రావాలి గానీ... అంతరాల మద్య కాదు"".
అదే భగవద్గీతలో చెప్పింది కూడా...
"విద్యా వినయ సంపన్నే _ బ్రాహ్మణే గవి హస్తిని
శునిచైవ శ్వపాకే చ _పండితా: సమదర్శిన:" అని @ 5/18.
ఎవరన్నరు కొన్ని పనులు కొందరే చేయాలి అని.. అన్నీ అందరూ చేయొచ్చు.. కానీ నిష్టగా, నిజాయియిగా చేయాలి..అంటే చేసే పనిలో నిండా మునగాలి. చెయ్యాల్సిన ఏ పనైనా అలా మునిగితేనే అది సాధ్యం మరి...
Thursday, September 14, 2017
చెడపకురా చెడేవు
చెడపుకురా చెడేవు అంటే విన్నారా...
ఒరేయ్ జర యాది పెట్టుకొండిరా..
కాస్త ఆలస్యమైనా కంత్రీ పనులకు కచ్చితంగా శిక్ష ఉంటదిరా...
మీలాగే అందరివీ ప్రాణాలే...
భక్తితో దేవున్ని మొక్కడానికొచ్చిన వాల్లను కర్కషంగా కాల్చి చంపితిరి....
ఇప్పుడు రోజులు ముందులాగా లేవురా..
తప్పులు చేసి కూడా తప్పించుకుని తిరుగుతూ, దొరికినా జైల్లల్లో అప్పనంగా తింటూ, రాజభోగాలు అనుభవించే అలవాటు పడ్డారు.. కానీ ఇప్పుడు మునపటిలా రోజులు లేవురా..
నికార్సయిన దేశభక్తుల చేతుల్లో దేశం ఉంది. కాకలు తీరిన తీస్మార్ ఖాన్ లయినా కంత్రీ పనులు చేస్తే కనికరం లేకుండా కతం కానిచ్చిడే.. అదే మా దేశ ప్రజల ఉద్దేశ్యం కూడా..అందుకే జర పైలమ్ రా బిడ్డలూ.. అందరిలాగా మీ వీ ప్రాణాలే..
Tuesday, September 12, 2017
Support the #RURALSTUDENTS
పల్లె ఆణిముత్యాలు.... ప్రతిభను గుర్తించి వెన్నుతట్టి ప్రొత్సహిస్తే సమాజ ప్రగతి రథ చక్రాలు..
చలో... ఉన్నంతలో కొంత ఉడుతా భక్తిలా వారి ఉన్నతికి ఉపయోగపడదాం.....
""మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి, మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి.. అందుకే ప్రపంచం మీ కోసం ఎదురు చూసేలా మీరు ఎదగాలి"" అన్న స్ఫూర్తిని వారికిద్దాం..
అర్దిక నిరుపేదరికం నీకు అడ్డూ కాదు పొడుగూ కాకూడదు,
నీ ఆత్మవిశ్వాసమే నీ ఎదుగుదలకు నిచ్చెన కావాలి.. నీవు
చేయాల్సింది నీలోని న్యూనతా భావాన్ని తరిమేసి నిజాయుతీగా నీ నిగూడ ప్రతుభను బయటపెట్టడమే.. ఆదుకోవడం, ఆదరించడం, అండగా ఉండడం సమాజం పని అనే విశ్వాసాన్ని అందిద్దాం...
అవకాశం ఉన్నచోట అలాంటోల్లకు ఆసరయ్యే ప్రయత్నం చేద్దాం...
100 మందిని ఒకేసారి ఆదుకోలేకపోతున్న అని బాధపడే కంటే, సరైన సమయంలో కనీసం ఒక్కరికి అండగా ఉన్నా మేలు...
చలో కానిద్దాం ఆణిముత్యాలకు అండగా ఉందాం.. భావిభారత రథచక్రాలకు దారి దీపాలవుదాం.. బోలో భారత్ మాతాకి జై.
Sunday, September 10, 2017
అందరూ వ్యాపారలే...
వ్యాపారం చేసేటోల్లు అందరూ వైశ్యులే.. వైశ్యులే వ్యాపారులు అనడం ఆలోచించాలి.. వ్యాపారాలు చేయడమే దోచుకు తినడం అంటే ఆ జ్ఞానికి ఉన్న అజ్ఞానమే అది. వ్యక్తులు, కులాలే కాదు ప్రపంచ మే ఈ రోజు వ్యాపారం చేస్తుంది. కోమట్లే కాదు అన్ని కులాలోళ్లు ఈ రోజుల్లో కూడు, గుడ్డ కోసం చిన్న చిన్న కొట్లు పెట్టుకొని బతుకీడుస్తున్నారు. లేదంటే కూటికి దొరకదు. ఆల్లను స్మగ్లర్లు అంటే ఎట్లా. శ్రామికులే మా దేవుల్లు అనే చైనా లాంటి దేశాలే ప్రపంచమంతా వ్యాపరం చేస్తుంది. అంటే పరోక్షంగా శ్రామికులూ స్మగ్లర్లయితరా... అట్లయితే
. పుస్తకాలు రాసి మార్కెటింగ్ చేసుకోవడమూ వ్యాపరమే... అందుకే మనది మనము చేసుకుంట ఎదగాలి, చెప్పుకోవాలి. అంతేగాని అవుతలోల్లను అగవరపరిచి దాని పునాదుల మీదే ఎదగాలనుకోవటం మూర్కత్వం.
Jago Jago Jagore Jago
జాగో జాగో జాగోరే జాగో..
తూ తూ తూ... మీ బతుకులు..
ఎంతసేపు అవుతలోడు అట్ల చేసిండు, ఇట్ల చేసిండు.. వాడట్లాయే వీడిట్లాయే అని రంద్రాన్వేషణ కోసమేనా మీ జీవితమంతా. మీకంటూ సొంత అస్తిత్వం ఏర్పాటు చేసుకుని ఎదో ఒక పనికొచ్చే పనిచేయాలన్న ఆలోచన ఎందుకు రాదు. ఎంతసేపు అవుతలోని పనికి కట్టెలు, కాళు ఎట్లా అడ్డం పెట్టాలని ఆలోచించే కంటే సమాజంలో చాలా రుగ్మతలు, పనిచేయాల్సిన అవుసరాలు చాలా ఉన్నాయి.. అందులో ఎదో ఒకటి నీ వంతుగా నెత్తినెత్తుకుని దాని పని చూసికో, ఆ దేవుడూ సహకరిస్తాడు.. నీవెత్తుకున్న పని నిజాయితీగా కొనెల్లా చెయ్యు. అంతే గాని, అది పక్కన పెట్టీ అవుతలోల్ల మీధ యాడో దేవులాడుకొచ్చి ఇంత బురద చల్లి ఆనందపడుతా అన్న అమాయకపు అలొచనలు చేసి సమయం వృదా చేసుకోకు... పరిస్థితిలు ముందులా లేవు. ఉట్టిగా బురద రుద్దితే, ఆ బురదను రుద్దినోడితోనే కడిగిపిచ్చే రోజులివి. అప్పడు నీకు డబల్ ధమాకాల Double పని.. చల్లుడూ నీదే కడుగుడూ నీదే అయితది. సస్తవ్ పని చేయలేక. అందుకే వివేకంతో ఆలోచించి పని చెయ్యు. మంచి ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా అభినందించి, ఆనందపడు. అంతే కాదు నీకు అవకాశం ఉంటే ఇంత అసరా అవ్వు.. అంతే కాని కడుపుబ్బరంతో ఉండకూ..కుళ్ళిపోయి సస్తవ్.. సో చివరగా మల్లోసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం యేంటంటే అవుతలి వ్యక్తుల, కులాల, సంస్థల, మతాలా మీద పడి కుల్లుకుంటూ ఏడవకా.. నీ పని నువ్వు చేస్తూ, దానితో నలుగురికి ఆనందాన్ని పంచు. నీకూ మనశ్సాంతి ఉంటది. అలా కాదు కూడదు నేనట్లే చేస్తా అంటే నీ ఇష్టం. అలాంటి వారి పని కాలమే నిర్ణయిస్తది ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని.(అలాంటి పనిలో ఎవరున్నా కాస్త జాగ్రత్త పడాల్సిన అవుసరం ఉంది, నిజాయితీగా ఉన్నోళ్లు నిచింతగా ఉండొచ్చు) So take care