నన్ను, నా పనిని ఎవరూ గుర్తిస్తలేరు, నా పనికి ఎవరూ చప్పట్లు, తాళాలు కొడుతలేరని ఆశపడి బాదపడేంత బలహీన మనస్సుతో ఏ పనీ చేయకు....నిజాయితీతో జరిగే ఏ పనికైనా ప్రకృతి తలవంచి సహకరిస్తదనేంత
Thursday, September 16, 2021
Tuesday, September 14, 2021
Sunday, September 12, 2021
Bhajan @ Vinayaka 2021
చప్పట్లు_ తాలాలు కొట్టుడేనా మీకు ఏమన్న వచ్చా అనే సందేహం అసలేం వద్దు.. మా స్థాయిలో మేం పాడగలం, పాడించగలం.. పే ద్ద గాయకులం కాకపోయినా, అవుతలోల్లకు ఇష్టం ఉన్నా-లేకున్నా, విన్నా-వినకపోయినా మా పాట, మా భజన మేం చెప్పేస్తాం. మిగతాది అవుతలోల్ల ఇష్టం..... అవును దేవుని దగ్గరా దేశభక్తి పాటలూ పాడుతం..అంతేగా దైవ భక్తి కన్నా దేశభక్తి వేయిశాతం ఎక్కువ ఉండాలని చెప్పిన పెదల మాటలు గౌరవిస్తాం...
వినాయక భజన @ 2021
అద్బుతం..... యువకులచే భజన @ సాధన కుటీర్ _మూడవరోజు.
సామాన్యులే సాధకులు, చైతన్య శక్తులు... సంస్కృతి_సాంప్రదాయాలకు వారసులు.. దేవుడి పూజ అంటే ఖరీదైనది అనుకోవడం పెద్ద తప్పు- ఉన్నంతలో ఉన్నతంగా ఆలోచించి ఉత్సాహంగా సమర్పణ చేయడమే ఆ దేవుడికిష్టం...అందుకే గణేశ్ నవరాత్రులు సామూహికం, సాదారణం, చైతన్యవంతం అయినాయి.... దూరపు కొండలు నునుపూ అన్నరు... జీన్స్ పాంటులు, ట్ షర్ట్స్ వేసుకున్నోలంతా నవతరం, వాల్లకు ఈ భజనలు, బాగోతాలు తెలవదు అసల్ రాదు వాల్లకు అనుకోవడం అమాయకత్వం..ముప్పూటలా స్నానం, పూజలు చేసిబ్ సమాజానికి అవసరమైనా గప్పున ఇంట్లో ఉండే వాల్లకంటే, సమాజానికి, సామూహిక చైతన్యానికి వారదులుగా నిలుస్తున్న ఇలాంటి యువతే ఆదరనీయం, ఆచరనీయం..
Thursday, September 9, 2021
Rachakoda Ganesh
శిలలపై శిల్పాలు చెక్కినారు మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు అనే మాటపాటలు నిజమే..
జనంసంచారం లేని ప్రాంతంలో, గుట్టల్లో, దారి మద్యలో ఉన్న రాళ్లకు రమణీయమైన బొమ్మలు చెక్కడం అద్బుతం. మన సంసృతీ, సాంప్రదాలను భావితరాలకు చేరవేయాలన్న వారి నిస్వార్ధ, త్యాగ బావననే వారిచే ఆ పని చేయించింది....అద్భుతమైన కళా సంపదకు, ఆ నిస్వార్ధ సేవాగుణం కారణంగా ఇలాంటి కళాకండాలు మనం చూడగలుగుతున్నాం...
ఎవరి చెక్కిన శిలనో సృష్టి... రాచకొండలో గణపతిగా మనకు దర్శనమిస్తాడు.. వినాయక చతుర్దిరోజున ఆ గజానునికి మొక్కుతూ.. ఆ అజ్ఞాత శిల్పికి ప్రణమిళ్ళుదాం.
Tuesday, September 7, 2021
గులాబీల పోటీ @ సాధన కుటీర్.
ఆరోగ్యకరమైన పోటీ ఎక్కడైనా మంచిదే..
మనుషుల్లో, జంతువుల్లో, పక్షుల్లో, మొక్కల్లో చివరకి పూలల్లో కూడా....
సాధన కుటీర్ లో భారత మాత హారతికోసం నాటిన పూలమొక్కల్లో.. కాశ్మీరి గులాబి, బాగ్యనరి గులాబీలు పోటాపోటీన పూస్తున్నయ్ . మేమంటే మేమని... నిన్నటి వరకు కాశ్మీరి గులాబి ఎక్కువ పూసి హారతికొచ్చే... మేమెందుకు రావద్దని బాగ్యనగరి గులాబీలు గులాబించే... కాశ్మీరీలో ఒకే రంగుంటే, భాగ్యనగరిలో రంగురంగులున్నాయ్.. చూద్దాం చివరికంటూ ఎవరుంటారో....
Wednesday, September 1, 2021
గులాబీ @ సాధన కుటీర్
*అరే ఓ సాంబా*...
మార్కెట్ లో గులాబి పూల రేటేముందో కనుక్కోరా......
*కుల్లా అయితే ఎంత? కిలో లెక్క ఎంతా?*...
*శంషాబాద్ గులాబి రేటేంది ? కాశ్మీరి గులాబీ రేటేంది?*...
*వచ్చి కొనుక్కుంటే ఏo రేటు? ఇంటికే సప్లై చేస్తే ఏమి రేటు?*...
*తోటలో కూలీలు పెంచిన గులాబి ఏం రేటు?* *ఇంటిమనుషులు హృదయంతో పెంచిన గులాబీ ఏం రేటు*...
*అరె ఓ సాంబా... రేట్లు కనుక్కోని వస్తొస్తా కాశ్మీరి గులాబీలకోసం బాక్సులు మరిచిపోకు*.. బాక్సుల్లో బద్రపరుద్దాం..
"" *ఇవి హృదయంతో సాగుచేసిన సాధన కుటీర్ లో కాశ్మీరి గులాబీలు...భారతమాత పాదాలకే అంకితం*.. *అని అన్ని రేట్లు తెలుసుకున్నాక దండోరా వేద్దాం*..... అరే ఓ సాంబా..
Subscribe to:
Posts (Atom)