కష్టాన్ని కష్టం గానే ఇష్టపడాలి, ఇష్టాన్ని కూడా కష్టంగానే వదలాలి.
కష్టం అని తెలిసినా కష్టాన్నే ఎంచుకుని,
వంగకుండా… విరగకుండా…
ఎదిరించి నిలబడాలి.
కష్టం పారిపోవడానికి కాదు, తనని తాను తెలుసుకోవడానికి.*
ఇష్టం విడిచిపెట్టడం ఓటమి కాదు,
ఆత్మ గెలుపు.
*తెలిసీ తెలిసీ భరించే కష్టం బాధ కాదు… ఒక సాధన*,
విరగకుండా నిలిచే మనసే
జీవితానికి నిజమైన సమాధానం.
*వంగని ఆత్మకు ఓటమి లేదు*,
*ఎదిరించిన ప్రతి కష్టంలో ఒక కొత్త నేను నన్ను నేను కలుసు కుంటాను* *తెలుసు కుంటాను*✍️