త్యాగమూర్తులను స్మరిoచుకుందాం _ భావితరాలకు స్ఫూర్తినందిద్దాం.
బిర్సా ముండా (1875–1900) “బిర్సా భగవాన్” భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. ఆంగ్లేయ పాలకుల పాలన నుండి భారతదేశాన్ని విముక్తపోరాటాలు చేసిన యోధులలో పేరెన్నిక కన్నవారు బిర్సా ముండా. *ఈ భూమిపై జీవించినది అతి కొద్ది కాలమైన అనంతమైన చరిత్రను సృష్టించుకున్నారు.* జనజాతి వీరుడు, నవధీరుడు *బిర్సా ముండా జీవించిన కాలం పాతిక సంవత్సరాలే, జనజాతి ప్రజల మనస్సుల్లలో ‘భగవాన్ బిర్సా’ ముండా గా ఈనాటికి జీవిస్తున్న చిరంజీవి ఆయన.*
బిర్సా ముండా, జార్ఘండ్ లోని ఖుంతీ జిల్లా, ఉలిహతు గ్రామంలో నవంబర్ 15, 1875, గురువారం రోజున జన్మించాడు. తండ్రి సుగుణా ముండా, తల్లి కర్మి హాటు.
అహుబటు గ్రామంలో తన మామయ్య ఇంట్లో ఉంటూ దగ్గర్లోని సాల్గా అనే గ్రామంలోని పాఠశాలలో చేరాడు. సాల్గా గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని, తర్వాత బూర్జు మిషన్ స్కూలుకు మారాడు. అతని ప్రతిభను గమనించి స్కూలు యాజమాన్యం, పశ్చిమసింగ్ భూం జిల్లా కేంద్రమైన చైబాసాలో మరో మిషనరీ పాఠశాలకు పంపించారు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. అక్కడ ఆయన పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ఫలితంగా బ్రిటిష్ పాలకుల అణిచివేత, దోపిడిని అర్థం చేసుకున్నాడు. కాలేజీలో, *స్కూల్లో జరిగే వక్తృత్వం, చర్చా కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ వనవాసీల నీరు, అడవి, భూమిహక్కుల గురించి ఎంతో గట్టిగా వాదించేవారు*. ఆంగ్లేయులు చేసి అరాచకాల వల్ల ఎదుర్కొంటున్న దుస్థితిని గురించి బాగా ఆలోచించేవాడు. పాఠశాల వయస్సులోనె చరిత్రను దాని పూర్వా పరాలను ఆకలింపు చేసుకొని బ్రిటిష వారు చేసే కుట్రలను కుతంత్రాలను తమ జాతులు వారికి తెలియజేసి, వారిని స్వాతంత్ర పిపాశ కలుగ జేసిన దూర దృష్టి కలవాడు. అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్ పాలకులు, అధిక పన్నులు వసూలు చేసేవారు. పన్ను చెల్లించలేని వారి ఆస్తుల్ని లాక్కునేవారు, ఎదురు తిరిగిన వారిని నానా బాధలు పెట్టేవారు. బ్రిటిష్ వాళ్ళ బాధలు పడలేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటలలోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగి ఇచ్చేయాలని ఒకరోజు ముండాతెగ పెద్దలతో కలిసి బిర్సా, తెల్లదొరలపై ఒత్తిడి చేశారు. దాంతో మిషనరీ పాఠశాల ఆయనను బహిష్కరించింది. దీన్ని సవాలుగా తీసుకున్న, *బిర్సా వారి ఎదుటే నుదుట నామం పెట్టి, జన్యం, ధరించి ఇకపై క్రైస్తవంలోకి ఒక్క ఆదివాసీని కూడా మారకుండా చూస్తానని ప్రతిన బూనారు*.
అంతకు ముందు జరిగిన సంతాల్ ఉద్యమం, చులార్ ఉద్యమం అతని వ్యక్తిత్వంపై ప్రభావం చూపాయి. బ్రిటీషర్ల వల్ల ముండా సందాల్, ఓరియన్,కోల్, జాతి తెగలు ఎప్పటికైనా ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించిన, బిర్సా ప్రత్యేకంగా 'బిర్సాయిత్' మతాన్ని స్థాపించారు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక విషయాలని బోధిస్తూ, ఐక్యమత్యంగా ఉండవలసిన అవసరాన్ని స్పష్టం చేశారు. ప్రకృతి వైద్యంతో ఎంతోమంది ఆదివాసీలను కాపాడారు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు, బిర్సా ముండాను ' ధర్తిలాభ ' అంటే దేవుడిగా కొలిచేవారు. *తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్లో తిరుగుబాటు ' ఉల్ గులాన్ ' పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అందులో7,000 మంది పాల్గొన్నరు. భిర్సా ఆచూకీ తెలపాలని ఆదివాసీలను నిర్బంధిస్తూ వారిపై దాడులకు దిగేవారు బ్రిటిష్ వారు. వీటిని సహించని ఆయన అనుచరులు 1900, జనవరి 5న, ఎక్కేడి ప్రాంతంలో ఇద్దరు పోలీసుల్ని చంపేశారు. దీంతో రగిలిపోయిన పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించి చివరికి 1900 ఫిబ్రవరి మూడున జంకో పాయి అటవీ ప్రాంతంలో అరెస్టు చేసి రాంచీ జైలుకి తరలించారు. *"తెల్లవాళ్లు వెనక్కి పోవాలి "అనే నినాదాన్ని తన జాతి వారికి ఇచ్చాడు మహారాణి పాలన పోవాలి మన రాజ్యం రావాలి, అని సదా పరితపించేవాడు. *22ఏళ్ళవయసు లోనే తన జాతివారికి నాయకత్వం వహించిబ్రటిష్ వారిపైయుద్ధం ప్రకటించిన యువకుడు.* పన్ను మాఫీ కోసం ఉద్యమం ప్రారంభించిన మొట్టమొదటి వనవాసి. అతను చేసిన పోరాటాన్ని ఆ రోజుల్లోనే అన్ని పత్రికలు వేనోళ్ళ పొగిడాయి.
ఎప్పటికైనా తమకు ప్రమాధికారిగా మారతాడని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం భిర్స ముండా ను 1900, జూన్ 9న విష ప్రయోగంతో చంపేసింది. బయటకు మాత్రం మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేసింది. ఆ విధంగా ఒక విప్లవాత్మకమైన జీవితం ముగిసిపోయింది.
బిర్సా చేసిన పోరాటం వల్ల 1908లో చోటా నాగపూర్ కౌలు చట్టం అమల్లోకి వచ్చింది. నీరు, అడవి, భూమి పైన వారసత్వ హక్కుల పరిరక్షణ కోసం ప్రారంభమైన పోరాటాలు ఒక దాని తర్వాత ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి.
ఇప్పటికి ఆయన్ని ఝార్ఖండ్, బీహార్, పశ్చామ బెంగాల్, ఒడిస్సా రాష్ట్రాలలో ఆదివాసీలు భగవాన్ బిర్సాముండాగా పూజిస్తున్నాయి. *చనిపోయేటప్పుడు బిర్సాకు కేవలం 25 సంవత్సరాల వయస్సు మాత్రమే.*
బిర్సా ముండా గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారు. *కేంద్ర ప్రభుత్వం అతని జన్మదినాన్ని" జన జాతీయ గౌరవ దివస్ " గానిర్వహించింది*.