Thursday, October 27, 2022
సీతాఫలం @2022
అసలు చూపియ్యకుండానే తిందామని ఉండే, కానీ చెట్టుమీద పండినవి ఎలా ఉంటాయో చాలా మందికి తెలువదనీ చూపియ్యడం అంతే.. ఈ పండ్లు చూడ్డానికి ఎంత బాగున్నాయో, ముట్టుకుంటే చిట్లిపోతాయి అన్నoత మక్కినయ్😀... అందులో ఒకటి తిన్నాకే రుచి కూడా చెపుదామని ఆగి, తిన్నాక చెపుతున్న😂.. చెట్టుమీద మక్కిన పండు ఇంత రుచా😋.. ఇంకో రెండు ఉన్నాయ్.. ఇక్కడ ఎలకలేక్కువ అట్లనే కోతులలాంటి మనుషులు ఎక్కువే.. కనిపిస్తే కథమే.. మిగిలిన ఆ రెండూ కనబడకుండా దాసడమే పెద్ద టాస్క్... హల్మారో లో దాసి, నెత్తికింద 🗝️పెట్టుకుంటా.. పొద్దున లేవగానే ఆ రెండు మెల్లగా తిందాం😀.
Wednesday, October 26, 2022
Hampi Trip-2022
ప్రతీ సంవత్సరం లాగానే ఈ సారి కూడా #హంపీ సoదర్శన సంపూర్ణం ...
పూజ్య #విద్యారణ్యస్వామిజీ #చాతుర్మాస్యదీక్షలో ఉన్న సమయంలో దర్శించుకోవడం 2008 నుండి ప్రారంభమైoది.. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం వెళ్లే అలవాటు కూడా అయింది.
పోయిన ప్రతీసారి కొత్త అనుభూతి, కొత్త శక్తితో రావటమూ అంతే...
తుంగభద్రా నది ఒడ్డునే ఉన్న #హంపీమఠం లో బస, ఉన్నన్నాళ్ళు పూజ్య #స్వామిజీతో పాటు #కోతి-కొండoగలకు(బయట వాటికి వైరం-ఈ క్షేత్రం లో కలిసే ఉంటాయి) పక్షులకు ఆహారం ఇవ్వడం,తుంగభద్రా నదిలో #లక్ష్మి_గజస్నానం ప్రతీసారి కొత్త అనుభూతే..
ఇగ ఆలయాల సందర్సనతో అక్కడి రాళ్ళలో దాగిన గత వైభవాన్ని చూసిన ఎవరికైనా ఒకింత #ఆశ్చర్యం, ఒకింత #బాధ అంతకు మించి #కోపం కలగక ఉండదు.
మొదటి రెండు మనవాళ్లు ఎంతో శ్రమకు ఓర్చి, వారి శక్తి యుక్తులను ఉపయోగించి వారి #వైభవాన్ని రమణీయంగా రాళ్ళలో బందిoచి, భావితరాలకు అందిoచాలానే తాపత్రయానికి ఆశ్చర్యం, ఆ శ్రమ, #కళానైపుణ్యం నాశనం జరిగిన విధానం చూసి భాద...
బానిసత్వానికి దూరమై ఇన్నేళ్లయినా ఇప్పటికీ #హంపీ క్షేత్రానికి పూర్వ వైభవo తేలేకుండా ఉన్నoదుకు కోపం అందరికీ వస్తుంది..
ఇలా ప్రతీ ఏడు అనుకుంటానే గడుస్తున్నా.. ఎక్కడో ఓ మూలన కొంత ఆశ.. రాబోయే కొన్ని సంవత్సరాలలో #హంపీ క్షేత్రం పూర్వవైభవాన్ని సంతరిoచుకుoటుందని..
ఆశతో ఉందాం.
అన్నీ సందర్శిoచడం ఒకవైపయితే సామాజిక కార్యకర్తలకు ప్రేరకుడు, చిరంజీవి మన #అంజన్న జన్మస్థలం #అంజనాద్రి సందర్సన ఇంకోవైపు😀.
ఈ సారి కొత్తగా హంపీ క్షేత్రానికి 40kms దూరంలో ఉన్న, 7వ శతాబ్దoలో కట్టిన అతి పురాతనమైన, శక్తివంతమైన, మహిమాన్వితమైన #సoడూర్ #సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సoదర్శన.
Thursday, October 6, 2022
మా ఊరి చెరువు @2022
మా ఊరి చెరువు... దాని పేరు కాముని చెరువు.. ఓ పదయిదు ఎకరాల్లో ఉంటుందంతే.. FTL కలిపితే ఓ 50ఎకరాలంట..
అప్పుడెప్పుడో చిన్నప్పుడు.. అంటే 1987 lo ఎనిదవ తరగతిలో ఉన్నప్పుడు చెరువు నిండి అలుగు పారుతుందoటే ఉరుక్కుoటా వచ్చి చూసినట్టు జ్ఞాపకం..మధ్యలో 2006లో నిండితే చూడడం కుదురలే.
మల్లా ఇప్పుడే చూడడం.. అదీ అనుకోకుండా, అలా అందరితో కలిసి చూడడం.. గంగా పూజ చేయడం, అందునా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో కావడం కొంత అదృష్టంగా బావించాలి.
Subscribe to:
Comments (Atom)