Monday, May 23, 2022

పనిలో ఆనందం..

*మన సంస్కార నిలయాలు అమ్మఒడి, బడి, గుడి*..

అద్భుతమైన అనుభూతి..

దేవాలయ కార్యక్రమాల్లో, ఉత్సవాలలో అన్ని వ్యవస్థలో ప్రత్యక్షంగా పనిలో పాల్గొంటే వచ్చే కిక్కే వేరు.. ఆ అనుభూతి అద్భుతo. 
కుల-వర్గ, చిన్న-పెద్దా, ధనిక-బీదా, ఈ పార్టీ-ఆ పార్టీ అనే అన్ని తారతమ్యాలు మరిచి, పనిలో మైమరచి పనిలో మునిగే అద్భుతం సందర్భాలు కేవలం సామాజిక చైతన్య కేంద్రాలైన దేవాలయ వద్దే సాధ్యం.. 
అందుకే అన్నారు మానవ వికాస కేంద్రాలు మన ఆలయాలు అని.... ఆ పరంపరను కొనసాగించే బాధ్యత, భాగ్యం కలిగేది కొందరికే..
ఆహాన్ని మరిచి అంతరంగాలు మరిచి దైవ కార్యాల్లో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో ఆలయాల వద్ద అనేక ఉత్సవాలను ఏర్పాటు చేశారు మన పూర్వులు. 
అన్ని అంతరాలు మరిచి మామిడాకులు, కొబ్బరిమట్టలలు, అరటి కొమ్మల పచ్చ తోరణాలు మొదలు పల్లికీ సేవ వరకు అందరూ పాల్గొని సంస్కారవంతులుగా  తయారుకావాలనే, అవుతారనే మూల సూత్ర  o ఆధారంగా అనేక సంస్కారవంతమైన కార్యాలకు రచన జరిగింది. అందుకే సమరసతా నిలయాలుగా దేవాలయాలు నిలిచాయి. ఆ పరంపరను కొనసాగించే బాధ్యతను నేటి తరం వారమైన మనం కొనసాగించాలి. మన సంస్కార నిలయాలు అమ్మఒడి, బడి, గుడి అని నినదించిన పెద్దల  ఆశయాన్ని బాధ్యతగా స్వీకరించాలి. అన్ని అంతరాలు మరిచి ఆలయాల వద్ద  నిస్వార్థ సేవకులుగా నిలవాలి.
●●●●●●●●●
హరివర అఖండక్షేత్రం వద్ద జరిగే అఖండ చాలీసా పారాయణం మహోత్సవoలో  ప్రత్యక్ష సేవలో పాల్గొంటూ ఆనందాన్ని పంచుకుంటున్న అఖండ కార్యకర్తలు.

;~ హరివర అఖండ సేవాసమితి & వీరపట్నం అఖండ ట్రస్ట్.*