ఆలోచనలు అశలై... ఆశలు ఆశయాలై...
ఆశయాలు అచరణాలుగా మారి బుడి బుడి అడుగులేస్తున్నప్పుడు... ఆ అడుగుల నిశబ్ద సవ్వడికు ప్రకృతితోడైతే మహా అద్బుత ఆవిష్కరణలు జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. ఆ బుడి బుడి అడుగుల వెంట మన అడుగులూ పడే అవకాశం చిక్కితే, ఆ ప్రకృతి మననూ ఆశీర్వదిస్తే... ఆ అనుభూతి అద్బుతం.. అనిర్వచనీయం.
Friday, February 26, 2021
ఈ చదువులు మారాలి.
అవును..
అ చదువులు మారాలి....
బండెడు పుస్తకాలను బట్టే కొట్టించే చదువులు మారాలి..
పిల్లల సృజనను గుర్తించని చదువులు మారాలి..
చదువుకు సమజానికి మద్య అంతరాన్ని పూడ్చని చదువులు మారాలి...
చదువు సామాజిక హోదా కాదు _ చదువు సామాజిక భాద్యత అని నేర్పని చదువులు మారాలి...
ధర్మబద్దంగా జీవనం నేర్పని చదువులూ మారాలి...
అవునూ..... ఈ కాలం చదువులు మారాలి.
Monday, February 22, 2021
అధ్యాపక్ / ఉపాధ్యాయుడు / Teacher
తరగతి గదిలో దేశ భవిష్యత్తు అన్నారు పెద్దలు..
గుణసంపదగల వ్యక్తుల నిర్మాణం విధాలుగా ల నుండే జరగలి, తద్వార దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవ్వాలి అని ఆశించారు...
అలాంటి పవిత్రమైన, స్పూర్తివంతమైన వృతి ఉపాద్యాయ/ అద్యాపక వృత్తి..
ఒక విద్యార్థి ఎదుగుదలే ఆ దేశ ఎదుగుదలకు కారణముతుంది...
ఆలాంటి ప్రేరణాత్మక వృతిలోకి పూర్తి నిజాయితీగా ఉన్నవారు వస్తే ఆ ఫలితాలు అద్బుతంగా ఉంటాయి.
అవుసరం కొరకు, విలాసాల కొరకు డబ్బులు సంపాదించాలి అనుకునేవారికి అనేక రకాల వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉన్నది.. అలా చేసుకోవాలి అనుకున్నవారిని ఎవ్వరూ వద్దనరు, ఆపలేరు.. కావున రేపటితరం దేశ భవిష్యత్తును నిర్ణయించే దయచేసి పవిత్రమైన, ప్రేరణాత్మకమైన అద్యాపక వృత్తిలోకి రాకండి....
ఎవ్వరూ అన్యదా బావించరారు. ఆ వృత్తికి ఉన్న గౌరవన్ని కాపాడుకుందాం. రేపటి తరాన్ని తీర్చిదిద్దుకుందాం.
Subscribe to:
Posts (Atom)