ఆవేదనకు ఒక అర్థం ఉంటుంది... ఆవేదనలో ఒక ఆశా ఉంటుంది...
కానీ ఆ అవేదన ఒక ఆశయంగా మారి ఆచరణకు పూనుకొంటే అసాధ్యమన్నది ఉండదు అని
చరిత్ర చెపుతున్న నిజం.
*వ్యక్తికంటే వ్యవస్థ గొప్పది. వ్యవస్థ పరిపుస్టత కోసం ఆ వ్యవస్థలోని వ్యక్తి/వ్యక్తులు చేసే నిజయితీగా చేసే కార్యంపై ఆదారపడి ఉంటుంది*.
తప్పక తెలుసుకోవాల్సిన విషయం...
*నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా లేక కార్యానికైనా ప్రకృతి తప్పక(తలవంచి) సహకరిస్తుంది అనేది చరిత్ర చెపుతున్న నిజం*
ఆ రకంగా ఏ వ్యక్తి చేసినా, ఏ వ్యవస్థ చేసిన సహకరించడం ప్రకృతి ధర్మం...
పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర మొత్తం తిరగేసి చూసినా మనకు కనబడేది అదే...
ముఖ్యంగా *సమాజ హితం కోరి చేసే ఇలాంటి కార్యక్రమాలు, పదిమందిని బాగస్వాములను చేస్తూ చేసే కార్యక్రమాలు తప్పక ఆ ప్రకృతి నియమం పాటిస్తే, విజయాన్ని చాలా తేలికగా అందిస్తుంది*.
అలా కాకుండా *స్వార్థంతో, ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబo కోసం లేదా ఇతర వ్యక్తిగత అవుసరాలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లయితే దానిలో శాశ్వత విజయం,శాశ్వత ఆనందం లభించదు, ఉండదు. అదీ కాకుండా ఈర్ష్యా, ద్వేషాలతో ఇతర వ్యక్తులకు, ఇతర వ్యవస్థకు ప్రత్యేన్యాయంగా ఇంకో వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నా ఆ ప్రకృతి సహకరించదు*.
అంతే కాదు, మన ద్వారా జరుగుతున్న పనులకు,
జరిగే నష్టాలను ఇతరులకు ఆపాదించడమూ సరైన విషయమూ కాదు...
*ఒక సామజిక కార్యాన్ని ప్రారంభించి కొసదాక తీసుకువెల్లే క్రమంలో అనేక పరిణామాలు ఉంటాయి. వ్యక్తులు, వ్యవస్థ లు చివరకు ఆ ప్రకృతికూడా మనకు అనేక రకాల పరీక్షలు పెడుతుంది... వాటికి జవాబుదారిగా ఉంటూనే విజయాన్ని ముద్దాడాలి*
చరిత్రను పరిశీలించి చూస్తే మనకు అదే అనబడుతుంది.. అన్ని రంగాల సామాజిక పనులలో అదే విధానం ఉంటుండి..
*ప్రారంభంలో అవహేళన చేయబడుతుంది, ప్రశ్నించబడుతుంది, అపైన విమర్శించబడుతుంది, వేగంగా తిరస్కరించబడుతుంది.. చివరగా ఒప్పుకోబడుతుంది... ఏ సామజిక కార్యానికైనా ఇదే పరిణామ క్రమం.. కావున ఒక సామాజిక కార్యాన్ని చేయాలని సంకల్పించిన వ్యక్తులకు/వ్యవస్థకు తప్పనిసరిగా ఆ ఓపిక,పట్టుదల అవసరం*.
అలా సాధించిన విజయాల వల్ల ఆ వ్యక్తులకు/వ్యవస్థకూ కీర్తి లభిస్తుంది. అది ఎవరైనా సరే.
అలాంటి కార్యాన్ని చేయాలనుకున్నాప్పుడు చేతి నిండా డబ్బులే ఉండాల్సిన అవుసరం ఏమీ లేదు..గుండె నిండా ధైర్యం, పనిలో నిజాయితి ఉంటే చాలు.
ఇక నందివనపర్తి విషయానికి వస్తే అదోక ఆధ్యాత్మిక శక్తిని ఆపాదించుకున్న స్థలం. అది కొన్ని వందల సం.రాల చరితే..
కొంత వనపర్తి మహాసంస్థానం(గద్వాల), కొంత దేవరకొండ మహాసంస్థాన విధానాలకు సంబందించిన ఆనవాళ్ళు మనకు కనబడతాయి. చాలా కుటుంబాలు ఈ రెండు సంస్థానాల పరిదినుండి వచ్చి ఈ పరిసర ప్రాంతాలలో స్థిరబడ్డాయి. ఈ క్షేత్రంలో వెలసిన ఆలయాల చరిత్ర కూడా అదే.. ఈ ఆలయాల పరిరక్షనకోసమే కొన్ని కుటుంబాల ఆ సంస్థానాల నుండి పంపబడ్డాయి, వచ్చి స్థిరబడ్డాయి. కాల గమనంలో వచ్చిన మార్పుల కారణంగా కొన్ని అలసత్వాలు, కొంత స్వార్థపూరిత జీవన విదానం, పర్యవేక్షణ లోపం నేడు మనం చూస్తున్న వ్యవస్థకు కారణం...
కానీ *కాలం తప్పక తన పనిలో తాను ఉంటుంది. తనకు కావాల్సిన యోధుల్ని తనే తయారు చేసుకుంటుంది. తప్పక తన పని తాను చేసుకుంటుంది. ఆలాంటి పనిలో మనకూ అవకాశం దొరికితే అదృష్ఠవంతులమే*... దొరికిన ఆ పనిని నిజాయితీగా చేసి అప్పజెప్పడం కూడా అవసరమే..
ఆ పనికోసం ఎవరు నిజాయితీగ పూనుకున్నా కావలసిన శక్తినీ ఇస్తుంది..
మనం చేయాలసిందల్లా మనం చేస్తున్న పనిలో నిజాయితీని కాపాడుకుకోవడమే.
ఆ *భాద్యత ఎవరు తీసుకున్న విజయం తథ్యం.భాద్యత తీసుకోకుండా ఫలితాన్ని ఆశించడం అత్యాశే*..
*ఒక వ్యవస్థ నిర్వహణలో బాగస్థులైన కొంత మంది వ్యక్తులు, వారివ్యక్తిగత ఉపయోగాలకోసం చేసే తప్పులను వ్యవస్థకు ఆపాదించడం కరెక్ట్ కాదు. వ్యవస్థ కూడా వారిపట్ల కొంత జాగ్రత్త వహించాలి* )
*ఆచరింపక చెప్పే వాక్కులకు హక్కు ఉండొచ్చు కానీ శక్తి ఉండదు*.
*ఒక పనికోసం నిజాయితీగా బాధ్యత తీసుకున్న వారు ఒడిపోయినట్టు చరిత్రలో లేదు. భాధ్యతను తీసుకుందాం, విజయాన్ని ముద్దాడుదాం*.
If needed we are always ready to involve, suggestions & Guidelines to any GOOD CAUSE..